బాబు పవర్ సెంటిమెంట్

పదవీ గండం ఉందని తెలిస్తే అక్కడ అడుగు కూడా పెట్టని చంద్రబాబు
సెంటిమెంట్లను ఫాలో అయితే అధికారం అంటిపెట్టుకుని ఉంటుందని ఆశ
అడుగుతీసి అడుగు వేయాలంటే వాస్తు చూస్తున్న ముఖ్యమంత్రి

పదవే ప్రాణం, అధికారంపై మోహం, ముఖ్యమంత్రి పీఠం మీద వ్యామోహం ఇదీ చంద్రబాబు బలహీనత. అందుకే తొమ్మిదేళ్ల పాలనలో ప్రజలను నానా బాధలు పెట్టినా, పదవిమీద ఆశ చావక, దొంగ హామీలతో, అబద్ధపు ప్రచారాలతో మరోసారి గద్దెనెక్కాడు. రాబోయే ఎన్నికల్లో మళ్లీ అధికారాన్ని దక్కించుకోవాలని నానా అగచాట్లూ పడుతున్నాడు. ఆ పదవి దక్కకుండా పోతుందేమో అన్న భయం బాబును ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. అందుకే పదవీ గండం ఉన్న ఏ చిన్న విషయాన్నీ అలక్ష్యం చేయడు చంద్రబాబు. విశాఖలో గురజాడ కళాక్షేత్ర ప్రారంభోత్సవానికి బయలుదేరాక ఆయనకు అలాంటి ఓ సెంటిమెంట్ గురించి తెలిసింది. ఆ క్షేత్రంలో అడుగుపెట్టిన వారు పదవులు పోగొట్టుకున్నారని కొందరు టిడిపి నేతలు అనడంతో గురజాడ కళాక్షేత్రం లోపల శిలాఫలకాన్ని ఆవిష్కరించాల్సిన ఆయన హడావిడిగా బైటనుంచే వెళ్లిపోయారు. అదీ బాబుకున్న పదవీ వ్యామోహం. 

యూనివర్సిటీ పేరు చెబితే బెంబేలు పడే బాబు

ఆచార్య నాగార్జున యూనివర్శిటీ (ఎన్ యు) కు వాస్తు దోషం ఉందని అక్కడకు వచ్చిన నాయకులకు పదవి ఊడిపోతుందని చెప్పడంతో చంద్రబాబు అక్కడ కాలు పెట్టడానికి కూడా చాలా తర్జన భర్జన పడ్డారు. ప్రమాణ స్వీకారాన్ని కూడా యూనివర్సిటీ సమీపంలో పెట్టారు. తొలి అసెంబ్లీ సమావేశాలు నాగార్జునా యూనివర్సిటీలో నిర్వహించాలనుకుని వెనక్కి తగ్గారు. చివరకు యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగిన యువజన సైన్స్ కాంగ్రెస్ కు వెళ్లాల్సి వస్తే దాన్నీ కాన్సిల్ చేసుకున్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని కూడా అధికారులు ఎ.ఎన్.యులో ఏర్పాటు చేయాలనుకుంటే దాన్ని చివరి నిమిషంలో పెరేడ్ గ్రౌండ్స్ కు మార్పించారు. పదవీ గండం అనే పేరు వినిపిస్తే చాలు చంద్రబాబు భయంతో వణికిపోతాడనటానికి ఆచార్య నాగార్జునుడే పెద్ద సాక్ష్యం. 

వాస్తు కోసం వందల కోట్లు 

ఇక వాస్తు విషయంలో చంద్రబాబు భయానికి అంతే లేదు. విభజన తర్వాత హైదరాబాద్ సచివాలయంలో  తనకు  కేటాయించిన హెచ్ బ్లాక్ వాస్తు బాలేదంటూ  ఎల్ బ్లాక్ ను ఎంపిక చేసుకుని దానిలో కూడా వాస్తు సరిగా లేదని కోట్లు ఖర్చు పెట్టించి మరమ్మతులు, మార్పులు,చేర్పులు చేయించారు. ఇక విజయవాడలో స్టేట్ గెస్టు హౌసును కూడా ప్రజా ధనంతో మరమ్మత్తులు  చేయించి, అది కూడా వాస్తు రీత్యా బాలేదని చెప్పడంతో చాలా కాలం హోటళ్లలో బస చేస్తూ కాలం గడిపారు. ఇక వెలగపూడిలోని సెక్రటేరియట్ లోనూ వాస్తు దోషం ఉందంటూ బాబుగారు కాన్వాయ్ రూట్ మార్చుకుని తిరుగుతున్నారు. సచివాలయంలో వాస్తు దోషాల పేరిట 6 గేట్లు ఏర్పాటు చేసారు. గోడలు కట్టడం, కూలగొట్టడం చేసారు. 

ఆగస్టు వస్తే తెలుగుదేశానికి అదురు

ఇక ఆగస్టు నెలమీద టిడిపి కి ఉన్న సెంటిమెంట్ సర్వాత్రా తెలిసిందే రెండుసార్లు 1984, 1995 ల్లో ఆగస్టులోనే టిడిపి సంక్షోభాల్లో చిక్కుకుని కొట్టుమిట్టాడింది. ఒకదానికి నాదెండ్ల భాస్కర్ రావు కారణం కాగా, మరోదానికి చంద్రబాబే సూత్రధారీ పాత్ర ధారీ. ఏదేమైనా ఆగస్టు నెల వచ్చిందంటే చంద్రబాబుకు గడ్డు సమస్యల్లో పడి కొట్టుమిట్టాడతారని తెలుగు తమ్ముళ్లే కాదు, అధినేత గూడా గట్టిగా నమ్ముతారు. ప్రతి ఏటా ఆగస్టులో టిడిపి ఏదో ఒక విపరీత పరిణామాన్ని ఎదుర్కుంటూనే ఉంటుందని ఆగస్టు వస్తే చాలు చంద్రబాబు ఉలిక్కి పడుతుంటారని ఆ పార్టీ నేతలే  చెబుతుంటారు.

ఇలా అనేక సెంటిమెంట్లతో చంద్రబాబు నాయుడు తన చిత్తం వచ్చినట్లు కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తున్నారు. 
Back to Top