బాబు ‘జాతి’ రాజకీయాలు

2016 మహానాడు కార్యక్రమంలో చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తాం అన్నారు
బాబు. మళ్లీ 2018 మహానాడులో జాతీయ రాజకీయాల్లో
ఆయన కీలక పాత్ర పోషించాల్సిన సమయం ఆసన్నమయ్యిందని మంత్రి మాగధులు శెలవిస్తున్నారు.
ఆల్రెడీ ఎప్పుడో ఆయన పిఎమ్ కేండిడేట్ అనీ, కావాలనే
ఆ పీఠం వద్దనుకుంటున్నారనీ మరి కొందరు తెలుగు తమ్ముళ్ల టాక్. తమ్ముళ్లేమిటి స్వయంగా బాబుగారే ఆ డప్పు అప్పుడప్పుడూ మోగిస్తుంటారు.
సో ఇక్కడ మనకొచ్చే డౌటానుమానం ఏమనగా…ఆల్రెడీ పిఎమ్
కుర్చీని తృణప్రాయంగా వద్దన్న చంద్రబాబు, జాతీయ రాజకీయాల్లో ప్రధాని
పదవి పోటీలో ఉన్న బాబు కొత్తగా మళ్లీ జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాల్సిన
ఖర్మేం పట్టిందనీ?

ఎన్టీఆర్
సిద్ధాంతాలకు సమాధి

ఆహా
ఓహో చంద్రబాబు జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసారని చంకలు గుద్దుకునే టిడిపి నాయకులకు
బాబు చేసింది అంతా దగా రాజకీయామే అని తెలియదా? ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం
పార్టీ సిద్ధాంతాలని సమూలంగా పెకలించేశాడు చంద్రబాబు. ఎన్టీఆర్
అప్పట్లో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపీలను దూరం పెట్టారు.
నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాల్లో
కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్, బిజెపీయేతర
పార్టీలతోనే కలిసి సాగారు. కానీ ఆయన మరణించాక చంద్రబాబు ఎన్టీఆర్
లౌకికత్వ సిద్ధాంతానికి వ్యతిరేకంగా బిజెపితో పొత్తులు పెట్టుకున్నాడు.
1999 ఎన్నికల్లో బిజెపితో కలిసి పోటీ చేస్తే, కేంద్రంలో
24 భాగస్వామ్య పార్టీలతో ఎన్డీయే, రాష్ట్రంలో
తెలుగుదేశం ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ప్రతి ఏటా ఈ ఘన చరితను మహానాడులో
చెప్పుకోవడమే బాబు చేసే పని. ఎపి, తెలంగాణా
తప్ప మరొక్క లోక్ సభ స్థానం తెచ్చుకుంటే తప్ప తెలుగుదేశానికి జాతీయ పార్టీ గుర్తింపు
రాదు. తమిళనాడు, కర్నాటక, ఒడిషా, అండమాన్ నికోబార్ దీవుల్లో పార్టీని విస్తరిస్తానని
గతంలో చెప్పారు బాబుగారు. ఇప్పుడైతే ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో
100 దేశాల్లో పార్టీని విస్తరించేస్తానని ప్రగల్బాలు పలుకుతున్నాడు.

గతమెంతొ
గబ్బు

1984 లోక్ సభ ఎన్నికల్లో టిడిపి 30 స్థానాలు గెల్చుకుంది.
లోక్ సభలో ప్రధాన ప్రతిపక్షంగా రికార్డు సృష్టించింది. ఆ హోదాతోనే ఎన్టీరామారావు ఛైర్మన్ గా 1989లో జాతీయ స్థాయిలో
కాంగ్రేసేతర పార్టీలతో నేషనల్ ఫ్రంట్ ఏర్పడింది. ఆ తర్వాత చంద్రబాబు
పార్టీని కబ్జా చేసాక ఒక్కసారి కూడా ఆ స్థాయిని చేరుకోలేకపోయాడు. విభజన తర్వాత ఎపిలో తప్ప, తెలంగాణాలో చతికిలపడిపోయింది.
సీట్ల లెక్కలతో జాతీయ పార్టీ అనిపించుకోవడానికి బాబు తహతహలాడుతున్నాడు.
అవకాశవాద రాజకీయాలు తప్ప, జాతీయ సమస్యలపై నోరు
మెదపని బాబు జాతీయ స్థాయి నాయకుడినని చెప్పుకోవడమే విడ్డూరం. కుల రాజకీయాలు, జాతి రాజకీయాల్లో బాబు ఆరితేరిపోయి ఉన్నాడు.
కానీ దేశాన్ని కుదిపేసిన జాతీయ సమస్యలపై ఎప్పుడూ సరిగ్గా స్పందించనేలేదు.
జాతీయ రాజకీయాల్లో క్రియాశీలంగా ఉండటం విషయంలో బాబుదెప్పుడూ వెనుక బెంచే.
ఇక జాతీయస్థాయిలో బాబుకున్న పేరు గురించైతే ప్రత్యేకంగా చెప్పుకోవాలా..!!
ఎప్పటి సంగతేమో కానీ ఇప్పుడైతే బ్రీఫ్డ్ మీ బాబుగా, నెంబర్ వన్ అవినీతి ముఖ్యమంత్రిగా జాతీయ రాజకీయాల్లో బాబు పేరు మారుమోగుతోందన్న
విషయంలో ఎవ్వరికీ సందేహాలు లేవు.

Back to Top