రాష్ట్ర ద్రోహి చంద్రబాబు


దేశాన్ని, దేశ సమగ్రతని, ఔన్నత్యాన్నీ కించపరచడం ఎంత దేశ ద్రోహమో, రాష్ట్ర గౌరవాన్ని కాలరాయడమూ అంతే ద్రోహం. చంద్రబాబు ప్రజాద్రోహి మాత్రమే కాదు. రాష్ట్ర ద్రోహి కూడా. తన స్వంత రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల్లో చిచ్చు పెట్టి, రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరపకుండా జాతికే అవమానం చేసాడు. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నో పోరాటాల చరిత్ర గల గడ్డ. 65 ఏళ్ల క్రితం 1953 అక్టోబర్ 1న కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్ర నిర్మాణం జరిగింది. ఆ సమయంలో అమరజీవి కోరినట్టు మద్రాసుపై ఆంధ్రరాష్ట్ర ప్రజలకు కూడా హక్కులు సంక్రమించాలన్న లక్ష్యం నెరవేరలేదు. ఉమ్మడి మద్రాసును కోల్పోయే నాడు ఆంధ్రరాష్ట్రం అవతరించింది. దాని తర్వాత 1956 నవంబర్ 1న తెలంగాణాతో కలిసిన ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు జరిగింది. ఆ సమయంలో రాజధానిగా హైదరాబాదును నిర్ణయించారు. మళ్లీ 2014 లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణాను కోల్పోయి రాజధానిని మార్చకోవాల్సిన అవసరం ఏర్పడింది. ప్రతిసారీ ఆంధ్రరాష్ట్రానికి రాజధాని విషయంలో అన్యాయమే జరిగింది. అందరిదీ అనుకున్న రాజధాని ప్రాతం చివరకు దక్కకుండా పోవడమే విషాదం. 

తెలుగు జాతికి బాబు ద్రోహం

గత పాలకుల తప్పిదాల్లాగే తెలంగాణా ఆవిర్భావం తర్వాత రాష్ట్రానికి ఉమ్మడి రాజధానిని లేకుండా చేసిన ద్రోహం చంద్రబాబుదే అవుతుంది. పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉన్న హక్కును కేవలం చంద్రబాబు స్వార్థ, అవినీతి రాజకీయమే కాలరాసింది. ఓటుకు నోటు కుంభకోణంలో ఇరుక్కుని, పదేళ్ల ఉమ్మడి రాజధానిని నుంచి ఉన్నపళాన పారిపోయి వచ్చాడు చంద్రబాబు. ఆగమేఘాల మీద ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్ కు తరలించాడు. ఎపిలో అమరావతిని నిర్మించుకుని, సావకాశంగా రాజధానిని తరలించుకోవాల్సింది పోయి, దొంగతనంగా పారిపోయి వచ్చాడు. అవమానంతో తల దించుకునేలా చేసాడు చంద్రబాబు. జాతీయ మీడియాతో సహా అన్ని చోట్లా ఎపి ముఖ్యమంత్రి బ్రీఫింగ్ టేపులు బయటపడ్డాక, మూడు రోజుల్లో మహానగరాన్ని ఖాళీచేసి, ఉద్యోగులను పరుగులు పెట్టించిన నీచ చరిత్ర చంద్రబాబుది. విభజన సమయంలో రెండు కళ్ల సిద్ధాంతం నుంచి విభజన అనంతరం ఉమ్మడిరాజధాని లేకుండా చేయడం వరకూ తెలుగు వారికి చంద్రబాబు చేసిన ద్రోహం చరిత్రలో నిలిచిపోతుంది. 

అవతరణ దినోత్సవం పై బాబు రాజకీయం

తెలంగాణా అవరణ దినోత్సవాన్ని ఆ రాష్ట్ర సర్కార్ నిర్ణయించుకుంది. కానీ ఎపి కొత్త రాష్ట్రం కాకపోయినా, చంద్రబాబు విభజన తేదీనే ఎపీ అవతరణ రోజుగా నిర్ణయించేసాడు. చరిత్రకారులను, ప్రజలను కనీసం సంప్రదించలేదు. ఎవ్వరి అభిప్రాయాలనూ అడగలేదు. అప్పుడు అలా జూన్ 2 ను అవతరణ దినంగా ప్రకటించి ఇప్పుడది చీకటి రోజని అనడంలో బాబు నీచత్వం బయట పడుతోంది. నిజంగా రాష్ట్రానికి అది చీకటి రోజు అయితే మరెందుకు ఎపికి అవతరణ దినోత్సవంగా దాన్ని నిర్ణయించినట్టు. విభజన జరిగిపోయింది. ప్రజల మనసులు కుదుట పడుతున్నవేళ మళ్లీ గాయాన్ని రేపడంలో బాబుది రాజకీయ ప్రయోజనం తప్ప మరోటి కనబడుతోందా? కేవలం విభజన నాటి సంగతులు చెప్పి ప్రజలను ఎమోషనల్ చేయడమే బాబు ఉద్దేశ్యం. ఆయన మార్చిన అవతరణ తేదీనే ఇప్పుడు చీకటి రోజు అని చెప్పి అవతరణ దినోత్సవాన్ని జరపకూడదంటూ నిర్ణయం తీసుకున్నాడు. అధికారం చేతిలో ఉందన్న అహంకారంతో ప్రజాస్వామ్య విలువలనే ఖూనీ చేస్తున్నాడు. రాష్ట్ర పుట్టిన రోజు వేడుకలను ఆపేయలని నిర్ణయించే అధికారం ముఖ్యమంత్రికి ఉండొచ్చు. కానీ దానికి సరైన కారణం ఉండి తీరాలి. ఆయన స్వప్రయోజనాల కోసం, ఆయన రాజకీయ అవసరాల కోసం రాష్ట్ర అవతరణ దినోత్సవాన్నే కాన్సిల్ చేసే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి దాపురించడం మన దౌర్భాగ్యం. 

రెండు నాల్కల బాబు 

ఇక్కడ ఎపి అవతరణ లేదు. సరే. కానీ తెలంగాణాలో టిడిపి పార్టీ ఆఫీసులో తెలంగాణా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిపింది.  ఎపిలో చీకటి రోజంటూ ఏడుపులు ఏడుస్తున్న బాబు, తెలంగాణాలో సంబరాలు చేయించాడు. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతాన్ని కనిబెట్టే తెలంగాణా వాసులు బాబును గత ఎన్నికల్లో చావు దెబ్బతీసారు. ఆ రాష్ట్రంలో పార్టీని భూస్థాపితం చేసారు. విభజన సమయంలో తెలుగు ప్రజలంతా చంద్రబాబు మాయ మాటలు నమ్మారంటే అందుకు కారణం, ఆ సమయంలో ఉన్న సెంటిమెంట్ ను చంద్రబాబు బలంగా ఉపయోగించుకోవడమే. విభజనతో సమయంలో ప్రజల్లోని బాధను, ఆందోళనను చంద్రబాబు సెంటిమెంట్ గా, ఓటు బ్యాంకుగా మలచుకున్నాడు. ఆ సెంటిమెంట్ మాయలోనే తెలుగు ప్రజలు బాబు ద్వంద వైఖరిని చూసీచూడనట్టు వదిలేశారు. 
ఆంధ్రరాష్ట్ర ప్రజలు ఇప్పుడు ఆలోచిస్తున్నారు. చంద్రబాబు కుతంత్రాలను పసిగడుతున్నారు. రెండు రాష్ట్రల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలనే బాబు కోరికను మొగ్గలోనే తుంచేసారు.  ప్రతిపక్ష నేత వైఎస్. జగన్ మోహన్ రెడ్డి సైతం ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నిర్వహించని ప్రభుత్వ తీరును విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పొట్టి శ్రీరాములు త్యాగాలకు ప్రతిరూపంగా రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహిస్తామని ప్రజలకు మాటిచ్చారు. 

Back to Top