పథకం, ప్రచారం తప్ప.. ప్రయోజనమేదీ..?

– నాలుగేళ్లలో రాష్ట్రానికి చేసింది శూన్యం

– సంపాదన కోసమే దోమల మీద దండయాత్ర

– తనకే టెక్నాలజీ మీద పట్టున్నట్టు సొంత డబ్బా

  ముఖ్యమంత్రి పదవి చేపట్టి నాలుగేళ్లు
దాటినా చంద్రబాబు నాయుడు ఇప్పటికీ కళ్లబొల్లి పథకాలతో కాలయాపన చేస్తూనే ఉన్నారు. 2014లో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నాటి నుంచి నేటి వరకు ఆయన చేసిన ఒక
మంచి కార్యక్రమం ఏదని ఆలోచిస్తే కనుచూపు మేరలో ఒక్కటి కూడా కనిపించదు. ప్రజలకు పూర్తి స్థాయిలో మేలు చేకూర్చి, ఫలితాలు తీసుకువచ్చే వాటిలో ఏ ఒక్క దానిని  కూడా చేపట్టని నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు చరిత్రలో
నిలిచిపోవడం ఖాయం. నాలుగేళ్లు బీజేపీతో అంటకాగిన చంద్రబాబు.. నిధులన్నీ జలహారతి, మజ్జిగ పథకం, నవ నిర్మాణ దీక్షలు, ఆస్పత్రుల్లో
ఎలుకలు పట్టడం, దోమల మీద దండయాత్రలంటూ ప్రభుత్వ ఖజానాని ఖాళీ చేసేసి తన జేబులు
నింపుకున్నాడు. ఒకవైపు బీద అరుపులు అరుస్తూనే పెట్టుబడుల కోసం విదేశీ పర్యటనలంటూ
ప్రత్యేక విమానాల్లో దేశాలు చొట్టొచ్చాడు. సగం ఖజానాను తన సొంత అవసరాలకే చంద్రబాబు
వినియోగిస్తున్నాడనే విమర్శలు కూడా ఆయనపై వచ్చాయంటే ఖర్చులు ఎంత దారుణంగా ఉంటున్నాయో
చెప్పాల్సిన పనిలేదు. 

బిల్లింగుల కోసం పథకాలు..

ఆస్పత్రిలో ఎలుకలు పట్టడానికి కోట్లకు
కోట్లు గుమ్మరించిన చంద్రబాబు ఆస్ప్రత్రి పాలవుతున్న రోగులకు ఆరోగ్యశ్రీలో చికిత్స
చేయించడానికి మాత్రం నిధులు కేటాయించరు. ఎలుకలు కొరికి గుంటూరులో పది రోజుల
పసికందు చనిపోయినా.. గుంతకల్లు ఆస్పత్రిలో స్ట్రేచర్‌ లేక ఓ మహిళ తన భర్తను
ఈడ్చుకెళ్లిన ఘటన అందర్నీ కన్నీరు పెట్టించినా బాబు మనసు కరగలేదు. ఆయా ఆస్పత్రుల
అభివృద్ధికి నిధులు కేటాయించి అభివృద్ధి చేయకపోగా అర్థంలేని పథకాలకు, పేపర్లు, టీవీల్లో
ప్రచారానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేసి అభాగ్యుల ఉసురు మూటకట్టుకుంటున్నాడు మన
ముఖ్యమంత్రి. హెరిటేజ్‌ పాలు,
మజ్జిగ అమ్ముకునేందుకు ఎండాకాలంలో
మజ్జిగ పంపిణీ పథకం పెట్టిన మహానుభావుడు చంద్రబాబు. 13 జిల్లాలో మజ్జిగ
పంపిణీ చేపట్టడానికి జిల్లాకు రూ. 3 కోట్లు వంతున రూ. 39 కోట్లు అప్పనంగా
విడుదల చేశాడు. అయితే ఎంతమంది ఆ మజ్జిగ తారాగో.. ఎక్కడెక్కడ పోశారు.. ఎన్ని రోజులు
పోశారో ఆ దేవుడికి తప్ప ఎవరికీ తెలియదు. 

 దోమల మీద దండయాత్రలతో ఏమొస్తుంది..

 దోమల మీద దండయాత్ర పేరుతో చంద్రబాబు
నిధులు వృథా చేయడమే కాకుండా పథకం ప్రచారం కోసం స్కూల్‌ విద్యార్థులను, ఉపాధ్యాయులను కూడా
బాగానే ఇబ్బంది పెట్టాడు. ఎండల్లో రోడ్ల వెంట తిప్పుతూ వారిని చదువులకు దూరం
చేశాడు. బడుల్లో వసతులు కల్పించమని అడిగితే స్పందించే తీరిక లేని చంద్రబాబు బడి
పిల్లలను మాత్రం తన పథకాల ఉచిత ప్రచారానికి వాడుకోవడం చాలా మంది తల్లిదండ్రులను
ఆగ్రహానికి గురిచేసింది. మలేరియా,
టైఫాయిడ్, డెంగీ వంటి వ్యాధుల
నివారణకు వాటికి కారణమైన దోమలను నివారించడమే ఉద్దేశ్యంతో చంద్రబాబు దోమల  మీద దండయాత్ర ప్రకటించినా.. ఆ దోమలు ఎక్కువగా కనిపించే వసతులు
తక్కువగా ఉండే గిరిజన ఏరియాల్లో ఏనాడు చంద్రబాబు వెళ్లి చూసిన దాఖలాలు లేవు. కనీసం
ఆయన దత్తత తీసుకున్న పెదలబుడు పంచాయతీలో మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి కాకపోయినా, శుద్ధ జలం సరఫరా
జరగకపోయినా పట్టించుకోని చంద్రబాబు.. పథకాలకు హైటెక్‌ పేర్లు తగిలంచి టెక్నాలజీ తన
సొంతమే అని చెప్పడానికి ఆరాట పడుతున్నాడు తప్ప.. ఆయా పథకాలు ఎంతమాత్రం
ఉపయోగపడుతున్నాయో ఆలోచించకపోవడం నిజంగా దారుణం. 

Back to Top