అసెంబ్లీ వేదికగా బాబు రిహార్సల్స్‌

– గ్లిసరిన్‌ కన్నీళ్లు సినిమా డైలాగులతో పస లేని ప్రసంగం
– బీజేపీని ప్రశ్నించలేక వైయస్‌ఆర్‌సీపీ మీద పడి ఏడుపు 
– బీజేపీతో జట్టు కడతారంటూ గోబెల్స్‌ ప్రచారం 
– హోదా  ఏ పార్టీ ఇచ్చినా మద్ధతు తెలిపిన వైయస్‌ జగన్‌ 

మొగున్ని కొట్టి మొగసాలకెక్కిందని... కేంద్రం నుంచి నిధులు సాధించుకురాలేని చంద్రబాబు.. ప్రశ్నిస్తున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మీద పడి ఏడవడం సిగ్గుచేటు. నాలుగేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉండి.. ఏం సాధించలేక ప్రశ్నిస్తున్న వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మీద గోబెల్స్‌ ప్రాచారానికి దిగుతున్నారు. రాబోయే ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ, బీజేపీతో జట్టు కడుతుందంటూ తప్పుడు వార్తలు వదులుతున్నారు. ప్రత్యేక హోదా ఇచ్చేది ఏ పార్టీ అయినా వారికే మేము మద్ధతు ఇస్తామంటూ ఇప్పటికే వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌ పలుమార్లు చెప్పారు. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో బయటకొచ్చి నంగనాచిలా మాట్లాడుతున్నారు. రాబోయే కాలంలో ఆడబోయే డ్రామాలకు అసెంబ్లీని రిహార్సల్స్‌కు వేదికగా మార్చుకున్నాడు. 

బీజేపీని ఇప్పటికీ నిలదీయరే..?

నిన్న అసెంబ్లీలో సుదీర్ఘంగా మాట్లాడిన చంద్రబాబు.. కేంద్రం మీద విరుచుకు పడిపోయాడని అనుకూల మీడియాలో వార్తలొచ్చాయి. దాంతోపాటు చంద్రబాబు ఉద్వేగానికి గురయ్యారని పతాక శీర్షికల్లో కథనాలు ప్రచురితం అయ్యాయి. తనకు మాత్రమే అలవాటైన మాట మార్చే ధోరణితో నిన్న ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్నారు. పోనీ ఇదే మాట మీద నిలబడి బీజేపీని నిలదీస్తారా అంటే చెప్పలేం. అంతెందుకు కేవలం ఒక్క ఫిబ్రవరి నెలలోనే ప్రత్యేక హోదాపై చంద్రబాబు స్టేట్‌మెంట్లు గమనిస్తే అబద్ధాల్లో చంద్రబాబు మాస్టర్‌ డిగ్రీ పట్టభద్రుడని ఎవరిరైనా తెలసిపోతుంది. 

పొంతనలేని మాటలు.. పసలేని ప్రసంగం

కేంద్ర ప్రభుత్వం ఏపీకి అన్యాయం చేసిందని కాసేపు.. మొత్తం దక్షిణ భారతాన్నే చిన్నచూపు చూస్తున్నారని ఇంకోసారి.. బడ్జెట్‌లో కేటాయింపులు జరగలేదని ఒకసారి.. ఇలా పొంతనలేని ప్రసంగంతో.. స్పష్టతలేని నిర్ణయాలతో ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నాడు. బీజేపీ అన్యాయం చేసింది కాబట్టి తప్పుకుంటున్నాం అంటూనే.. ఎన్‌డీఏ కూటమితోనే కొనసాగుతామని నాలుక మడతేస్తారు. నాలుగేళ్లు బీజేపీతో అంటకాగి ఏం సాధించకుండా టైంపాస్‌ చేసి ఇప్పుడు అసెంబ్లీలో రికార్డు కోసం చిందులు తొక్కుతున్నాడు. ఆనాడు ప్యాకేజీని స్వాగతించాడు, అసెంబ్లీలో తీర్మానం చేసి మోదీని ప్రశంసించాడు, అరుణ్‌జైట్లీకి, వెంకయ్యనాయుడు తదితరులకు సన్మానాలు, ఊరేగింపులు చేశారు. శాలువాలు కప్పి తిరుపతి లడ్డూలు పంచారు. అంతెందుకు మొన్న టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ పార్లమెంట్‌లో మిస్టర్‌ మోడీ అన్నందుకే సంబరాలు చేసుకున్నారు. దానివల్ల ఏం సాధించారంటే వాళ్లకే స్పష్టత లేదు.  రైల్వే జోన్‌ ఇవ్వలేదంటారు, పోలవరం పూర్తి కాలేదంటారు. దుగరాజపట్నం ప్రస్తావనేది అంటారు.. కేంద్రాన్ని అడిగే సాహసం మాత్రం చేయరు. 

ప్యాకేజీ చట్టబద్ధతపై జగన్‌ ఆనాడే ప్రశ్నించినా ...

నిజానికి ప్యాకేజీకి చట్టబద్ధత లేదని, లెక్క–జమ పత్రాలు సరిగ్గా లేవని దాదాపు మూడేళ్లుగా జగన్‌ చెబుతూనే ఉన్నారు. అంతేకాదు.. ప్యాకేజీ పేరుచెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని పక్కదారి పట్టిస్తున్నారనే అనుమామాన్ని కూడా అప్పట్లో వ్యక్తం చేశారు. జగన్‌ వ్యక్తపరిచిన అనుమానాల్లో ఆవగింజంత అనుమానం కూడా చంద్రబాబుకు రాకపోవడం ఆశ్చర్యకరం. ఒకవేళ అనుమానం వచ్చినా బయటపడకపోవడం బాధాకరం. అప్పటి జగన్‌ అనుమానాలే ఇప్పుడు నిజమయ్యాయి. విడిపోయిన ఆంధ్రప్రదేశ్‌ కు కేంద్రం అటు ప్రత్యేకహోదా ఇవ్వలేదు, ఇటు ప్రత్యేక నిధులు కూడా ఇవ్వలేదు. మొత్తానికే ముంచేసింది. మనం నిండా మునగకముందే ఆందోళన చేద్దాం, హక్కులు సాధించుకుందామన్నారు జగన్‌. నిండా మునిగిన తర్వాత నష్టాల లెక్కలు చెప్పి కన్నీళ్లు పెడుతున్నారు చంద్రబాబు. 

ఇప్పటికీ గ్లిసరిన్‌ కన్నీళ్లు... సినిమా డైలాగులు

రాష్ట్రానికి ఏం కావాలో ఆలోచించకుండా.. రాబోయే ఎన్నికల్లో ఎంత కావాలో సంపాదించే పనిలో పడ్డాడు చంద్రబాబు. ఆయన ఈ ఆలోచన ధోరణి ఏపీకి శాపంగా మారింది. స్వార్థం కోసం ఏపీ ప్రయోజనాలను పక్కన పెట్టి నాలుగేళ్లు ప్రత్యేక హోదా కోసం పోరాడిన వైయస్‌ఆర్‌సీపీపై అమానుషంగా ప్రవర్తించారు. చివరికి యువభేరిలకు వెళ్తే కేసులు పెడతామని విద్యార్థులను బెదిరించడానికి కూడా వెనుకాడలేదు. కనీసం ఇప్పటికైనా పార్టీలను, రాజకీయాలను పక్కనపెట్టి 25 ఎంపీలం రాజీనామా చేసి సమైక్యతను చాటుదామని వైయస్‌ జగన్‌ పిలుపునిచ్చినా చంద్రబాబులో చలనం లేదు. ఇంకా అసెంబ్లీలో కూర్చుని గ్లిసరిన్‌ కన్నీళ్లు, సినిమా డైలాగులతో జనాన్ని మోసం చేసేందుకు అనుకూల మీడియాను అడ్డం పెట్టుకుని వ్యూహ రచన చేస్తుండటం సిగ్గుచేటు. 
Back to Top