పేరు గొప్ప.. ఊరు దిబ్బ..!

() చంద్రబాబు
పాలనలో ప్రచారానికే పెద్ద పేరు

() పనుల
సార్థకతలో నిండు సున్నా

()
వ్యతిరేకత ఎక్కువ అవుతుండటంతో ప్రభుత్వ వర్గాల్లో కలవరం

హైదరాబాద్)
ఒకటే పనిని పది సార్లు పది రకాలుగా చేస్తే.. దానికి పది పేర్లు పెడితే..  పది పనులు చేసినట్లు అవుతుందన్నది చంద్రబాబు
ఫిలాసఫీ. అందుకు తగినట్లుగానే గత ప్రభుత్వాల్లో అమలైన పనుల్నే పేరు మార్చి హడావుడి
చేయటం ఆయనకు అలవాటు. గత తొమ్మిదేళ్ల పాలనలో చేసినట్లుగానే ఇప్పుడు కూడా ఆయన
చెలరేగుతున్నారు. కానీ ప్రజల్లో ఈ ప్రచారపు ఆర్బాటం మీద వెగటు పుడుతోందన్నది అక్షర
సత్యం.

పౌర సరపరాల
శాఖ తరపున పండుగలు, పబ్బాలకు నిత్యావసర వస్తువుల్ని అందించటం ఎప్పటినుంచో అమలులో
ఉంది. కానీ, దీనికే పేరు మార్చి చంద్రబాబు ద్వారానే ఇటువంటి పథకం మొదలు
పెట్టినట్లుగా కలరింగ్ ఇచ్చి ప్రచారం చేయించుకొన్నారు అయితే నాసిరకం సరుకులు అంట
గడుతుండటంతో ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. ఈలోగా తమిళనాడులో అమ్మ పేరుతో రక రకాల
పథకాలు విజయవంతం కావటంతో ఆ బాటలో వెళదామని ప్రయత్నించారు.

చంద్రబాబు
తలచినదే తడవుగా అన్ని శాఖలు పోటీ పడ్డాయి. పాత పథకాలకు బూజు దులిపి, కొత్త
బోర్డులు రాసేశారు. వాటికి చంద్రబాబు పేరు తగలించి కొత్త పథకం అన్న రంగు
పులిమేందుకు పోటీ పడ్డారు. చివరకు కాపు సంక్షేమ భవనాలకు కూడా చంద్రబాబు పేరు
పెట్టేందుకు ప్రయత్నించటంతో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో నాలిక్కరచుకోవటం
తెలుగుదేశం నేతల వంతయింది.

ఎప్పటిలాగే
దీన్ని కూడా అధికారుల మీదకు నెట్టేసేందుకు ప్రయత్నించారు. చంద్రబాబుకి
తెలియకుండానే ఆయన పేరుని రక రకాల పథకాలకు పెట్టేస్తున్నారని, దీని మీద చంద్రబాబు
ఆగ్రహం వ్యక్తం చేశారని పచ్చ మీడియాలో పచ్చ పచ్చగా వార్తలు రాయించేసుకొన్నారు.
మొత్తం మీద చంద్రబాబు ప్రచారపు ఆరాటం మాత్రం అందరికలో నవ్వుల పాలవుతోంది. 

Back to Top