పీక్ స్టేజికి బాబు పబ్లిసిటీ పిచ్చి

– నేషనల్‌ మీడియాలో వార్తల కోసం పబ్లిసిటీ పాట్లు 
– ముంబయి ఫ్యూచర్‌ డీకోడెడ్‌ సదస్సులో గొప్పలు
– ఏపీని 2029 నాటికి దేశంలో నెంబర్‌ వన్‌ చేస్తాడంట
– మహిళలకు రక్షణ లేదుకానీ.. జంతువులను కాపాడతాడట

అందేంటో కానీ సూటూ కోటూ వేసుకున్న జనాలు కనిపిస్తే చాలు  చంద్రబాబుకు అలవోకగా అబద్ధాలు బయటకొచ్చేస్తాయి. ఎవరు ఎంత చెప్పినా ఆగే ప్రశ్నే లేదు. పబ్లిసిటీ కోసమే పుట్టామన్నట్టు ఎక్కడ ఏ సదస్సు జరిగినా అక్కడ చంద్రబాబు అటెండెన్స్‌ ఉండి తీరాల్సిందే.. ఆయనకంటూ ఒక రీలు పడాల్సిందే. గతంలో పనిచేసిన.. ఇప్పుడు పనిచేస్తున్న ఏ ముఖ్యమంత్రులూ లేనంత బిజీగా చంద్రబాబు కనిపిస్తాడు. అయితే ఏదైనా సాధించాడా అంటే లేదు. చెప్పుకోవడం మాత్రం కలియుగం ప్రారంభం నుంచి అంతరించే వరకు అంతా నా పుణ్యమే. ప్రపంచంలో ఏ మూలన ఏ అద్భుతం జరిగినా అందుకు కర్త కర్మ క్రియ తానే అన్నట్టు ఫీలైపోతుంటాడు. 

ఇదంతా ఎందుకంటే బుధవారం ముంబయిలో జరిగిన ఫ్యూచర్‌ డీకోడెడ్‌ సదస్సులో కూడా చంద్రబాబు ప్రత్యక్షమయ్యారు. రాష్ట్రంలో పార్టీ నాశనమైపోయిందని సమీక్షలతో బిజీగా ఉంటూనే ఉన్నట్టుండి ముంబయిలో వాలిపోయారు. తనకంటూ ఒక రీలు సిద్ధం చేసుకున్నాడు. ఏం చెప్పుంటాడో ఎవరూ ఊహించాల్సిన పనిలేదు. తెలిసిందే కదా. పాడిందే పాడరా పాసిపళ్ల .. అన్నట్టు మళ్లీ సొంత డబ్బా. రాష్ట్రం విడిపోయినా.. ఏపీకి తాను ముఖ్యమంత్రిని అనే సంగతి మరిచిపోయి.. హైదరాబాద్‌ మన రాష్ట్రంలోనే లేదని తెలిసీ మళ్లీ అదే జపం. 

హ్యాపీనెస్‌ ఇండెక్స్‌లో నెంబర్‌ వన్‌ చేస్తాడంట
 ఈ సదస్సు సందర్భంగా చంద్రబాబు చెప్పిన మాటలు విన్నోళ్లకు ఆయనే టెక్నాలజీకి బాప్‌ అనుకుంటారు. బాబు గురించి తెలిసిన తెలుగోళ్లు మాత్రం పిచ్చి ఇప్పట్లో తగ్గేలా లేదనుకుంటారు. ఎవరు రాసిస్తారో తెలియదు కానీ.. సన్‌రైజ్‌ ఆంధ్రప్రదేశ్‌.. డేర్‌ టూ డ్రీమ్‌.. స్రైవ్‌ టు అఛీవ్‌ అంటూ మొదలు పెట్టాడు. ఇది విన్న జనాలకు మాత్రం ఆయన డ్రీమ్‌ ఏంటో.. ఆయన తపన దేని గురించో అర్థం చేసుకున్నారు. ఆ తర్వాత తెలిసిందేగా. హైదరాబాద్‌ను ప్రపంచంలోనే ప్రముఖ నగరాల్లో ఒకటిగా నలిపానని.. 2022 నాటికి ఏపీని టాప్‌ మూడు రాష్ట్రాల్లో నిలబెట్టడమే ధ్యేయంగా పెట్టుకున్నానని చెప్పాడు. 2029 నాటికి దేశంలోనే ఏపీని నెంబర్‌ వన్‌ చేస్తానని ఊదరగొట్టాడు. అంతటితో ఆగితే కదా హ్యాపీనెస్‌ ఇండెక్స్‌లో 2050 నాటికి ప్రపంచంలోనే ప్రముఖ స్థానంలో నిలబెడతానని బండేశాడు. 

మొబైల్‌ కమాండ్‌ కంట్రోల్‌తో హుద్‌హుద్‌ తుపాన్‌ని ఆపినంత పనిచేసినట్టు చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత చూడాలి.. విద్యా, వైద్యం, పారిశ్రామిక, వ్యవసాయం, సేవారంగం, ఇలా కనిపించిన అన్ని రంగాల పేర్లు చదివేసి అన్నింట్లో ఏపీని అభివృద్ధి పథంలో నిలబెట్టడానికి కృషి చేస్తున్నానని చెప్పడంతో అక్కడున్న వారికి ఒక క్లారిటీ వచ్చింది. బాబు విజన్‌ పేపర్లలో పడటం.. నేషనల్‌ మీడియాలో కనబడటమేనని అర్థమైంది. కాసేపు చెవులు మూసుకుని సహనం ప్రదర్శించారు. చివరిగా బాబుగారు చెప్పిన మాటలను వింటే ఎవరికైనా నవ్వాగదు. ఆయన పాలనలో పురుషులకే కాదు.. జంతువులకు కూడా రక్షణ కల్పిస్తానని చెప్పాడు. అయితే ఇక్కడ మరో క్లారిటీ ఇచ్చాడు. పురుషులు, జంతువులకు రక్షణ కల్పిస్తానని చెప్పాడు కానీ మహిళలకు రక్షణ ఇస్తానని ఎక్కడా చెప్పలేదు. 
Back to Top