ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ఆయనంతే...


– ఏ పనీ జరగనివ్వడుు.. ఏ ప్రాజెక్టూ పూర్తి కానివ్వడు
– రాష్ట్ర ప్రయోజనాల కన్నా స్వప్రయోజనాలే మిన్న
– నిత్యం క్రెడిట్‌ కోసం తహతహలాడే మనిషి చంద్రబాబు 

నాలుగేళ్లు బీజేపీ ప్రభుత్వంలో అధికారం పంచుకుని పదవులు అనుభవించి ఏపీకి దక్కాల్సిన ప్రయోజనాలపై నోరు మెదపలేదు. ప్రత్యేక హోదా మొదలు.. విభజన చట్టంలోని హామీల అమలు, విశాఖ రైల్వే జోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీ లాంటి విభజన చట్టంలో పొందుపర్చిన హామీలపై చంద్రబాబు కేంద్రాన్ని ప్రశ్నించిన పాపానపోలేదు. పైగా గతంలో వైయస్‌ఆర్‌ ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు పూనుకుంటే అనుకూల మీడియాలో అసత్య కథనాలు ప్రచురింపజేసి అడ్డుకోవాలని చూశాడు. ఈ నాలుగేళ్లు ప్రత్యేక హోదా వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోరాడుతుంటే పోలీసులను ప్రయోగించి అధికారాన్ని ఉపయోగించి అణగదొక్కాలని చూశాడు. జగన్‌ నిర్వహించే యువభేరిలకు హాజరు కావొద్దని విద్యార్థులను బెదిరించాడు. ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా చంద్రబాబుకు స్వప్రయోజనాలే ముఖ్యం. రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నా, ప్రజలకు మేలు జరుగుతుందన్నా ఆయన ఓర్వలేడు. ఏం జరిగినా తన చేతుల మీదుగానే జరగాలి. మంచి ఎవరు చేసినా ఒప్పుకునే పెద్ద మనసు ఆయనకు లేదు. ఇలాంటి వ్యక్తి కారణంగానే పెండింగ్‌ ప్రాజెక్టులు నిరుపయోగంగా ఉన్నాయి. నాలుగేళ్లు కాలక్షేపం చేసినా చివరి ఏడాదైనా ప్రజలకు ఏదైనా మేలు చేద్దామని ఆలోచన లేనేలేదు. రెండు రోజులు పత్రికల్లో ప్రధాన వార్తలొచ్చేలా బీజేపీని తిట్టిపోయడం.. ఇంకో రెండు రోజులు సొంతంగానే అద్భుతాలు చేస్తామని గొప్పలు పోవడం.. మరో రెండు రోజులు కేంద్రాన్నే అడిగి సాధించుకొస్తామని బీరాలు పోవడం మామూలైంది. చివరికి దాని ప్రస్తావనే మర్చిపోయేలా మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం.. ఇదీ నాలుగేళ్లుగా చంద్రబాబు చేసింది. సరిగ్గా కడప ఉక్కు పరిశ్రమ విషయంలోనూ అదే జరుగుతోంది. బీజేపీతో కలిసుండగా నాలుగేళ్లు నోరెత్తకుండా ఉన్న బాబు.. ఇప్పుడు బయటకొచ్చి దొంగ దీక్షలతో తానే ఏపీకి ఏదో సాధించబోతున్నట్టు కలరింగ్‌ ఇస్తున్నాడు. మొన్నటిదాకా బీజేపీ మోసం చేసిందని వాపోయిన బాబు.. నిన్నటి నుంచి కొత్త పల్లవి అందుకున్నాడు. తానే ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించబోతున్నట్టు పేపర్ల నిండా వార్తలు రాయించాడు. ఇప్పుడు కొత్తగా తానే ఉక్కు ఫ్యాక్టరీ నిర్మిస్తాన ని.. కేంద్ర సహకారం లేకపోయినా.., ఉక్కు ఫ్యాక్టరీ పూర్తి చేసే తమకే ఉందని బడాయి పోయాడు. జనాన్ని నమ్మించేలా లండన్‌కు చెందిన ఒక సంస్థ యజమానితో మాట్లాడినట్లు ప్రచారం చేయించుకున్నాడు. 

ఆ సంస్థ ప్రతినిధులను విమానాశ్రయం నుంచి నేరుగా కడప నగర శివారులోని కొప్పర్తి పారిశ్రామికవాడకు తీసుకువెళ్లి అక్కడ ఏపీఐఐసీ సేకరించిన భూములు, రైల్వేలైన్, నీటి సౌకర్యాలు తదితరాలను చూపించినట్టు చెప్పుకొచ్చారు. 

ఇదంతా అయ్యాక ఇప్పుడు కొత్త పల్లవి అందుకున్నాడు. కేంద్రానికి బానిసలం కాదని పనికిరాని పౌరుషాలకు పోతున్నాడు. అంతలోనే ఢిల్లీ వెళ్లి కేంద్రాన్ని నిధులు అడుగుతా అంటాడు. ఇలా క్షణానికో రకంగా మాట మార్చడానికి ఏమాత్రం వెనుకాడని మనిషి చంద్రబాబు. ఒకేసారి రెండు పరస్పర విరుద్ధమైన అర్ధాలొచ్చే విధంగా మాట్లాడటానికి ఏమాత్రం సిగ్గుపడని మనిషి ఆయన. 
Back to Top