క్లైమాక్స్‌లో చంద్రబాబు నాన్సెన్సు

– అవిశ్వాసంపై మళ్లీ యూటర్న్‌
– వైయస్‌ఆర్‌సీపీకి మద్ధతిస్తానని చెప్పి వెనకడుగు 
– ఒక్కరోజులో వెనక్కి తగ్గిన చంద్రబాబు 
– ప్రత్యేక హోదా ఫైనల్‌కు చేరిన సమయంలో కుట్ర రాజకీయం
– రాజకీయ ప్రయోజనాల కోసం మరోసారి హోదా నిర్వీర్యానికి స్కెచ్‌
– ఐక్యంగా ఉండి సాధించాల్సిన పరిస్థితుల్లో డబుల్‌ గేమ్‌ 


ఎవరు ఏమన్నా అనుకోనీ.. ప్రజలకు ఎంత నష్టమైనా జరగనీ.. రాష్ట్ర అభివృద్ధి అంతటితో ఆగిపోనీ.. ఆయనకు సంబంధం లేదు. ఎలాగైనా మరోసారి ముఖ్యమంత్రి కావాలి. చనిపోయేదాకా పదవుల్లో ఉండాలి. అధికారంతో రాష్ట్రంపై పెత్తనం చెలాయించాలి. నేను బాగుండాలి.. నా తర్వాత నా కుంటుంబానికి రాష్ట్రంపై హక్కులు కావాలి. దానికోసం ఎన్ని సార్లయినా మాట తప్పుతాం.. ఎన్ని అబద్ధాలైనా ఆడతాం.. ఎన్ని యూటర్న్‌లు తీసుకోడానికి వెనుకాడం. ఇదే చంద్రబాబు సిద్ధాంతం. ఆయన వ్యవహార శైలి గతంలో కంటే ఇప్పుడు చాలా వేగంగా మారుతూ వస్తోంది.

కష్టాలోచ్చినప్పుడే మనవాళ్లు ఎవరనేది తెలుస్తుంది. పరిస్థితులు చంద్రబాబుకు ఎదురు తిరుగుతున్న కొద్దీ తన అసలు నైజాన్ని బయట పెడుతున్నారు. ఇన్నాళ్లు సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుంటానని గప్పాలు కొట్టుకునే చంద్రబాబు.. ప్రత్యేక హోదా అంశాన్ని తన రాజకీయ అవకాశంగా మార్చుకోవాలని ఉబలాటపడుతున్నారు. వైయస్‌ జగన్‌ నాలుగేళ్లు పోరాడి హోదా అంశాన్ని ఫైనల్‌ వరకు తీసుకొస్తే శభాష్‌ అని అభినందించాల్సిందిపోయి ఆఖరి అవకాశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాడు. ఊసరవెళ్లి మనస్తత్వంతో ఆంధ్రా ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నాడు. కేంద్రం మీద అవిశ్వాసం తీర్మానం, ఎంపీల రాజీనామా ప్రకటన... కేంద్రంలోని ఇతర రాజకీయ పార్టీలతో మద్ధతు కూడగట్టడం వంటి చర్యలతో ప్రత్యేక హోదా ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లారు. హోదా మీద ప్రజల్లో, విద్యార్థుల్లో అవగాహన కల్పించడం దగ్గర్నుంచి అవిశ్వాసం పెట్టే వరకు అంచెలంచెలుగా పథకం ప్రకారం కేంద్రంపై వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒత్తిడి పెంచితే ఇప్పుడొచ్చి చంద్రబాబు దాన్ని నీరు కార్చేందుకు కుట్రలు పన్నుతున్నారు. ఏపీకి రావాల్సిన ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, ఇతర సమస్యలపై నాలుగేళ్లు నోరెత్తకపోయినా తాను కేంద్రంపై పెట్టబోయే అవిశ్వాసానికి వైయస్‌ జగన్‌... చంద్రబాబు మద్ధతు కోరారు. రాజకీయంగా ఎన్ని వైరుధ్యాలున్నా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మీరు అవిశ్వాసం పెట్టినా మేము మద్ధతు ప్రకటిస్తామని చెప్పారు. అవిశ్వాసం పెట్టేది ప్రభుత్వాన్ని కూల్చడానికి కాదు... ఆంధ్రుల ప్రత్యేక హోదా ఆకాంక్షను కేంద్రానికి తెలియజేయడానికి..., తెలుగు ఎంపీలంతా మూకుమ్మడిగా రాజీనామాలు చేయడం ద్వారా ఎక్కడైతే (పార్లమెంట్‌లో) గత కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిందో.. అక్కడే(పార్లమెంట్‌లో)నాలుగేళ్లుగా హామీని నెరవేర్చని బీజేపీని నిలదీద్దామని పిలునిచ్చారు. వైయస్‌ఆర్‌సీపీ అవిశ్వాస తీర్మానానికి మద్ధతు ప్రకటిస్తామని నిన్న రాత్రి ప్రకటించిన చంద్రబాబు.. ఉదయానికే మాట మార్చేశారు. తామే సొంతంగా అవిశ్వాసం పెట్టబోతున్నామంటూ యూటర్న్‌ తీసుకున్నారు. 

టీడీపీ అవిశ్వాసం పెడితే నష్టమేంటి..

నిజానికి అవిశ్వాసం ఎవరు పెట్టినా అంతిమంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాలనేది వైయస్ ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌ లక్ష్యం. ప్రభుత్వాన్ని కూల్చాలని కాకుండా ఆంధ్ర ప్రజలందరూ ఐక్యంగా ఉండి ఒకే సమస్యపై ప్రభుత్వాన్ని నిలదీస్తే కేంద్రం దిగిరాక తప్పదని ఆయన విశ్వాసం. అందుకే టీడీపీ అవిశ్వాసం పెట్టినా మద్ధతు ఇస్తామని గతంలోనే చెప్పారు. నిన్న సాయంత్రం అందుకు అంగీకరించిన టీడీపీ అధినేత.. ఉదయాన్నే ఉన్నట్టుండి మాట మార్చారు. తామే అవిశ్వాసం పెట్టబోతున్నట్టు అనుకూల మీడియా హడావుడి మొదలు పెట్టారు. ఒకే రాష్ట్రం నుంచి వేర్వేరుగా అవిశ్వాసం పెట్టడం ద్వారా లక్ష్యం నీరుగారిపోతోంది. ఎంపీల మధ్య ఐక్యత లేదని.. పోరాటంలో న్యాయంలేదని.. డిమాండ్‌లో స్పష్టత లేదని అనుకునే ప్రభావం ఉంది.పైగా ఇతర పార్టీల మద్ధతును కూడగట్టడంలోనూ వేర్వేరుగా ప్రయత్నించడం కంటే.. ఇద్దరూ కలిసి ప్రయత్నిస్తే కేంద్రంపై ఒత్తిడి పెరుగుతుందన్నది సత్యం. కానీ చివరి నిమిషంలో చంద్రబాబు తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయంతో ప్రత్యేక హోదా సాధన మార్గాలకుతూట్లు పడే ప్రమాదం కనిపిస్తోంది. నాలుగేళ్లు చేసిన పోరాటం వృథా అయ్యే పరిస్థితులను చంద్రబాబు కల్పించారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక్కటై సాధించారు అని చరిత్రలో నిలిచిపోయే ఘట్టాన్ని చేజేతులా నాశనం చే స్తున్నారు. వైయస్‌ఆర్‌సీపీకి క్రెడిట్‌ వస్తుందేమోనన్న రాజకీయ కారణంతో మరోసారి రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతున్నాడు. విభజిత ఏపీకి చారిత్రక అవసరంగా, హక్కుగా దక్కాల్సిన ప్రత్యేక హోదా అంశాన్ని తన కుట్రలతో నిర్వీర్యం చేస్తున్నారు. 

తాజా వీడియోలు

Back to Top