అభద్రతలో బాబు


చంద్రబాబు నాయుడిలో అభద్రతా భావం పెరిగిపోయిందా? సిబిఐ ఎంక్వైరీ గురించి ఎత్తగానే బాబు వణికిపోవడానికి కారణం ఏమిటి? నీతి నిప్పు అని చెప్పుకునే వాళ్లకు ప్రభుత్వ సంస్థల ముందు నిజాయితీ నిరూపించుకోవడానికి భయం ఎందుకు? ఢిల్లీకి వచ్చింది కనిపించిన ఎమ్.పిలతో అల్లా పొటోలు దిగడానికేనా? ఢిల్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పరమార్థం ఏమిటి? ఎపిలో జరిగే విషయం ఏదీ దేశానికి తెలియదని, జాతీయ మీడియాకు తెలీదని బాబు భావిస్తున్నారా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వీర కాస్ట్లీ అంటూ జాతీయ మీడియాల్లో వార్తలు ప్రసారం అయ్యాయి.  పోలవరం లో అవినీతి గురించి నేషనల్ మీడియా ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉంది. అలాంటప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం చేతగానితనం దేశంలో ఎవ్వరికీ తెలియదను కోవడం చంద్రబాబు భ్రమ కాదా? 

పదేళ్లు ప్రతిపక్షం లో ఉండి కల్లబొల్లి హామీలతో అధికారంలోకి వచ్చినప్పటి నుండీ బాబు చేస్తున్న అవినీతి పాలన గురించి దేశమంతా చర్చించుకుంటోంది. బాబు గారి విలాసాలు, దుబారాలు, తెలుగు తమ్ముళ్ల ఆగడాలు, ఎపిలో రాజధాని వ్యవహారాలూ, మోదీ మోచేతికింద బాబు మంతనాలూ అన్నీ తేటతెల్లంగా తెలుస్తూనే ఉన్నాయి. కానీ బాబు మాత్రం తానో ముఖ్యవిషయాన్ని మీడియా ముందుకు తెచ్చినట్టు కలరింగ్ ఇస్తున్నారు. రాష్ట్రానికి బిజెపి అన్యాయం చేసిందంటూ పెద్ద నివేదిక పట్టుకుని ఎమ్.పిల దగ్గర పాంప్లెట్లలా పంచారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పేరుతో మీడియా వారికి ఎన్డీయే గవర్నమెంట్ వల్లే ఆంధ్రప్రదేశ్ నష్టపోయిందని సినిమా చూపించాలనుకున్నారు. ఇది చూసిన బిజెపి నేతలు బాబు మీద ఒంటికాలిమీద లేచారు. 

ప్రకాశ్ జవదేకర్, జీవిఎల్ నర్సింహారావులు బాబు నాటకాన్ని పబ్లిక్ గా ఎండగట్టారు. కేంద్రం వల్లే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేకపోయామనే భ్రమ కలిగించేందుకే చంద్రబాబు ఈ పవర్ పాయింట్ నాటకం ఆడుతున్నారని మండిపడ్డారు. వినియోగ పత్రాలు ఇచ్చామని బాబు చెబుతున్నది శుద్ధ అబద్ధం అని తేల్చేసారు బిజెపి నేతలు. 1050 కోట్లకు లెక్కలు చెప్పని వాళ్లకి 20,000 కోట్లు ఇస్తే ఏం చేస్తారో అనే భయం కేంద్రానికి కూడా ఉంటుంది కదా అని ప్రశ్నించారు. అంటే చంద్రబాబు ప్రభుత్వం నిధుల విషయంలో అవినీతికి పాల్పడిందని కేంద్రంలోని ఎన్డీఎ ప్రభుత్వం గట్టిగా నమ్ముతోందని రూఢీ అవుతోంది. కేవలం బాబు, అతడి అవినీతి వల్లే రాష్ట్రానికి ఏ ప్రయోజనం రాకుండా పోయాయని ఈ వాఖ్యలు విన్న ఎవ్వరికైనా క్లియర్ గా అర్థం అవుతుంది. ఇక రాజకీయ పరంగా బిజెపికి వైసిపీకి ఏ సంబంధం లేదని, కేవలం ఇలాంటి ఓ తప్పుడు ప్రచారంతో బాబు తనని తాను రక్షించుకోవాలని ప్రయత్నిస్తున్నారని బిజెపి నేతలు ఆరోపిస్తున్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కేసులకు సంబంధించి దర్యాప్తు సంస్థలు నిబంధనల ప్రకారం తమ పని తాము చేసుకుపోతున్నాయని, అందులో కేంద్రం జోక్యం ఏమాత్రం లేదని ఈ సందర్భంలో బిజెపి నేతలు స్పష్టం చేసారు. అంటే బిజెపి ప్రభుత్వంతో వైఎస్సార్ కాగ్రెస్ కలిసి నడుస్తోందంటూ బాబు చేసే విష ప్రచారానికి ఆ పార్టీ నేతలే సమాధానం ఇచ్చేసారు. 

బాబు అవినీతి గురించి ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఏళ్లుగా చెబుతూ వస్తోంది. అయితే కేంద్రం ఈరోజు వరకూ చంద్రబాబును ఒక్కమాట అనకపోవడానికి కారణం టిడిపి మిత్రపక్షం అవ్వడమే అని అందరికీ తెలుసు.  ఇప్పుడు అది మిత్రబేధంగా మారింది కనుక బాబు అవినీతి ఫైళ్లన్నిటినీ మోదీ బైటకు తీస్తారని, అందులో భాగంగానే బిజెపి నేతలు నేరుగా బాబు అవినీతి గురించి ప్రశ్నిస్తున్నారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చంద్రబాబు సైతం తమ నేతలతో ఈ విషయంపై చర్చించినట్టుగా సమాచారం. కేంద్రం తమపై కక్ష సాధింపులకు దిగుతుందని, దర్యాప్తులకు ఆదేశించే అవకాశం ఉందని స్వయంగా బాబే సీనియర్ నేతలతో చెప్పాడంటున్నారు. ఇంత జరిగాన బాబు కేంద్రం, ఎన్డీయే కూటమి అని తప్ప మోదీ గురించి ఒక్కమాట అనకపోవడం వెనుక కారణం ఇదే అని కూడా విశ్లేషిస్తున్నారు. గతంలో అసెంబ్లీలో టంగ్ స్లిప్ అయి మోదీపై కేసులు వేస్తా అన్నందుకు బాబుకు పైనుంచి గట్టి వార్నింగ్లు వచ్చాయిట. దాంతో మర్నాడే బాబు ఆ తప్పిదాన్ని కిందామీదా పడి సరి చేసుకున్నాడు. మోదీపై కేసులు కాదని, కేంద్రంపై వేస్తానన్నా అని మీడియాలో కవరింగ్ కొటేషన్లు వేయించుకున్నాడు. ఎప్పుడేం జరుగుతుందో అన్న అభద్రతాభావంతోనే సీక్రెట్ మిషన్ తో బాబు పార్లమెంట్ కు వచ్చాడని అంటున్నారు కొందరు ఢిల్లీ నేతలు. 
 

తాజా వీడియోలు

Back to Top