పంచాయతీ ఎన్నికలంటే భయమా బాబూ

–పూర్తవుతున్న సర్పంచ్‌ల పదవీకాలం
– కార్పొరేషన్‌లకు ఎన్నికలు నిర్వహించని ప్రభుత్వం
– ముందస్తు ఎన్నికలపైనా వెనుకడుగు..

నా పరిపాలనపై ప్రజలు 80శాతం సంతృప్తిగా ఉన్నారు. దేశమంతా ఈర్ష్యపడేలా అమరావతి రాజధాని నిర్మాణం చేపట్టా. ప్రజలు కూడా నా కష్టాన్ని గుర్తించి స్వచ్ఛందంగా భూములిచ్చేందుకు ముందుకొస్తున్నారు. రైతు రుణమాఫీతో రైతుల్లో వ్యవసాయంపై భరోసా కల్పించా.. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుని ముందుకు సాగుతున్నా. విదేశాల్లో చెప్పపులరిగేలా తిరిగి భారీగా పెట్టుబడులు తీసుకొచ్చా. ఎన్నో కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లో తమ ప్లాంట్‌లను నెలకొల్పడానికి ఉత్సాహంగా ఉన్నాయి. కంపెనీ ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్న ఒక్కరోజులోనే అనుమతులు వచ్చేలా నిబంధనలు సరళతరం చేశాము. పోలవరం ప్రాజెక్టుతో రాయలసీమకు నీళ్లిచ్చాం. అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌ దూసుకెళుతోంది.... 

ఇదీ మైకు దొరికినప్పుడల్లా చంద్రబాబు చేసుకుంటున్న ప్రచారం. ప్రజలు చంద్రబాబు పాలనపై అంత సంతృప్తిగా ఉన్నప్పుడు ఎన్నికలకు వెళ్లడానికి భయమెందుకు..? పంచాయతీ సర్పంచ్‌ల పదవీకాలం పూర్తయినా ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కాలేదు. రేపటితో సర్పంచ్‌ల పదవీకాలం పూర్తవుతున్నా.. చంద్రబాబు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనాలేదు. ఎన్నికలు నిర్వహించడానికి చంద్రబాబుకు ధైర్యం చాలడం లేదు. మూడేళ్లుగా కార్పొరేషన్‌ ఎన్నికలు నిర్వహించకుండా పెండింగ్‌లో పెట్టారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన సగర్వంగా ఒక ఎన్నికైనా నిర్వహించలేదు. ఈ నాలుగేళ్లలో జరిగింది రెండే ఎన్నికలు.  భూమా నాగిరెడ్డి  హఠాన్మరణంతో నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగితే టీడీపీ విజయం సాధించింది. ఆ తర్వాత హైకోర్టు ఉత్తర్వులతో కాకినాడ ఎన్నికలు జరగ్గా అక్కడా టీడీపీనే విజయం సాధించింది. ఈ రెండు ఎన్నికలూ చంద్రబాబు కోరుకున్నవి కాదు. టీడీపీ గెలుపు కూడా అంత ఈజీగా సాధ్యం కాలేదు. నంద్యాల ఎన్నికల్లో మొత్తం మంత్రి వర్గాన్ని రాయలసీమ ఎమ్మెల్యేలందర్నీ నంద్యాల నియోజకవర్గంలోనే మోహరించింది చంద్రబాబు ప్రభుత్వం. రెండు కోట్ల అభివృద్ధి పనుల వాగ్ధానాలు చేశారు. ఇళ్లు కట్టిస్తామని పేదలను నమ్మించారు. హడావుడిగా రోడ్డు వెడల్పు పనులు చేపట్టారు. ఎక్కడికక్కడ కొత్తగా రోడ్లు వేశారు. నాలుగేళ్లలో ఖర్చు చేయని నిధులను కేవలం నెల రోజుల వ్యవధిలో నంద్యాలలో ఖర్చు చేశారు. అపారంగా నల్లధనాన్ని బయటకు తీసి ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారు. ఎన్నికల్లో గెలుపు తర్వాత చంద్రబాబు ప్రకటనలు ప్రజలను నివ్వెరపోయేలా చేశాయి. బాబు పరిపాలన చూసి జనం పట్టం కట్టారని డాంభికాలు పోయాడు. అలాగైతే పార్టీ ఫిరాయించిన అన్ని స్థానాల్లో ఉప ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్ష వైయస్‌ఆర్‌సీపీ డిమాండ్‌ చేసినా చంద్రబాబు ధైర్యం చేయలేకపోయారు. పైకి మాత్రం నా అంతటోడు లేడని చెప్పుకుంటున్నా.. వాస్తవంలోకి వచ్చేసరికి చంద్రబాబుకు ధైర్యం చాలడం లేదు. ఏడాది కిందట వరకు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి పంచాయతీ ఎన్నికలపై హడావుడి చేసిన చంద్రబాబు తీరా సమయం ఆసన్నమైనకొద్దీ పట్టించుకున్న పాపానపోవడం లేదు. సార్వత్రిక ఎన్నికల ముందు పంచాయతీ ఎన్నికలకు వెళితే మంచిది కాదన్న భయంతో చంద్రబాబు ధైర్యం చేయలేకపోతున్నాడు. పొరపాటున పంచాయతీ ఎన్నికల్లో ఓటమి పాలైతే ఆ ప్రభావం సార్వత్రిక ఎన్నికలపైనా ఉండే అవకాశం ఉంటుందని బాబు ఆలోచిస్తున్నట్టు సమాచారం. గతంలో ముందస్తు ఎన్నికలకు అనుకూలంగా మాట్లాడిన బాబు.. ఇటీవల కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీకి మాత్రం తాము సంసిద్దంగా లేవని చెప్పడం బాబు భయానికి నిదర్శనం. 
Back to Top