విమర్శిస్తే నోటీసులిస్తారా...?

– నిజాయతీ గల నిప్పు చేయాల్సింది ఇదేనా?

– నిరూపించుకునే సాహసం బాబు ఎందుకు చేయరు

– చంద్రబాబులో పెరిగిపోతున్న అసహనం

– పాలనలో హిట్లర్‌ను తలపిస్తున్న చంద్రబాబు

 నియంతలా
వ్యవహరిస్తున్నాడని చెప్పడానికి హిట్లర్‌ పాలన గురించి పోల్చి చెప్పడం అలవాటు చాలా
మందికి. కాకతాళీయమో ఏమో గానీ హిట్లర్‌ పుట్టిన రోజునే పుట్టిన చంద్రబాబు కూడా
పాలనలో ఆ హిట్లర్‌కు ఏమాత్రం తీసిపోవడం లేదు. తన పాలనలోని లోపాలను బయట పడకుండా
ఉండటానికి ప్రశ్నించిన వారి మీద అధికారాన్ని అడ్డం పెట్టుకుని కేసులు బనాయించడం
చాలా మామూలైపోయింది. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడికి రాజకీయాల్లో విమర్శలు సాధారణం
అన్న విషయం కూడా మరిచి సంయమనం కోల్పోతున్నాడు. తనపై వచ్చిన విమర్శలకు సమాధానం
చెప్పుకోలేక నిస్సహాయ స్థితిలో ప్రతిపక్షంపై పగ సాధించే కార్యక్రమానికి శ్రీకారం
చుట్టాడు. 

ప్రతిపక్ష పార్టీకి
చెందిన ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలకు సమాధానం చెప్పలేని చంద్రబాబు టిటిడి  పేరుతో పగ సాధించడానికి పూనుకుంటున్నాడు. టీటీడీలో అవినీతి
జరిగిందని, ప్రతిష్ట దిగజారిపోతోందని ప్రధానార్చకులు రమణ దీక్షితులు సహా
ఉద్యోగులు నెత్తీ నోరూ మొత్తుకుంటున్నా బాబులో చలనం లేదు. ప్రపంచ వ్యాప్తంగా
పేరున్న తిరుమల తిరుపతి దేవస్థానం చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నాడు.
నగలు మాయమయ్యాయని విమర్శలున్నాయి,
పోటులో అక్రమ తవ్వకాలు జరిగాయని
ప్రధాన అర్చకులు విమర్శించారు. వీటన్నింటికీ బాబు నుంచి సమాధానం లేదు. విమర్శకుల
నోళ్లు మూయించడానికి విచారణకు ఆదేశించి తాను నిజంగానే నిప్పునని ప్రూవ్‌ చేసుకునే
సత్తా లేదు. ఇవన్నీ చేయలేక అధికారం చేతిలో ఉంది కదా అని విమర్శకుల నోళ్లు
మూయించడానికి ప్రయత్నించి తనకు తెలియకుండానే  మరింత లోతు
కష్టాల్లోకి కూరుకుపోతున్నారు. 
బాధ్యతాయుతమైన పార్లమెంటు సభ్యులు లేవనెత్తిన అంశాలకు సరైన సమాధానం ఇవ్వకుండా, డొంక
తిరుగుడు వ్యవహారాలకు పాల్పడటంలోనే తప్పించుకోడానికి చూస్తున్నారన్న విషయం బహిరంగ
రహస్యమైపోయింది.

 జగన్‌ను చంద్రబాబు
విమర్శించని రోజుందా...

 చంద్రబాబుకు తాను అధికారంలో
ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తిట్టకుండా పూట గడవదు. ఆయన
పేరెత్తకుండా బాబు ప్రసంగంలో ఏ వాక్యమూ పూర్తికాదని చెప్పడం అతిశయోక్తి మాత్రం
కాదు. చంద్రబాబు సహా టీడీపీ నాయకులంతా చేస్తున్న ఆరోపణలకు, ధీటుగా తన వద్ద నిజంగా
అంత సొమ్ము ఉన్నట్టు నిరూపించి అందులో పది శాతం వాటా ఇచ్చి మిగతా మొత్తం తీసుకోవచ్చని
వైయస్ జగన్ మోహన్ రెడ్డి  అప్పట్లోనే సవాల్‌
విసిరారు. అంత సొమ్ము తనకున్నట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కూడా ప్రకటించారు.
అయితే చంద్రబాబు నుంచి మాత్రం దానికి సమాధానం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఎవరో ఒక
వ్యక్తి పది వేల కోట్లు నల్లధనం ఉన్నట్లు ఆదాయ పన్ను శాఖకు వెల్లడించాడంటే దానికి
వైయస్ ఆర్ సీపీకి అంటగట్టి పచ్చ మీడియాలో పెయిడ్‌ ప్రచారం చేయించాడు. దానిని నిరూపించుకోమని
సవాల్ విసరడమే కాకుండా, దీనికి సంబంధించిన వివరాలు బయటపెట్టాలంటూ జననేత  ప్రధానికి లేఖ రాశాక చంద్రబాబు నోట మాట రాలేదు.

 స్వయంగా సీబీఐ
దర్యాప్తు చేయించుకున్న వైయస్‌ఆర్‌ 

 గతంలోనూ పరిటాల రవి
హత్య కేసులో చంద్రబాబు ఆరోపణలకు స్పందించి.. నాటి ముఖ్యమంత్రి
వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి సీబీఐ దర్యాప్తుకు ఆదేశించి చిత్తశుద్ది నిరూపించుకున్నారు. వోక్స్
వ్యాగన్ వ్యవహారంలోనూ, కోకాపేట భూముల 
వ్యవహారంలోని నిజాలు వెల్లడి కావడానికి విచారణ వేయించుకుని నిజాయతీ
నిరూపించుకున్నారు. కానీ చంద్రబాబు మాత్రం తన మీద తానే దర్యాప్తు చేయించుకోవడం
కాదు కదా... కనీసం తనపై ఉన్న కేసులకు కోర్టులకు హాజరై నిరూపించుకున్న దాఖలాలు ఈ 40 ఏళ్ల ప్రస్థానంలో
ఎక్కడా లేకపోవడం గమనార్హం. 

ఆరోపణలు వచ్చినప్పుడల్లా ఎదురుదాడి
చేయడం, తామే కేసులు వేస్తానంటూ బెదిరించడం వంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారు.
నాలుగేళ్ల పాలనలోతనపై వచ్చిన ఆరోపణలపై ఏఒక్కదానిపై కూడా విచారణకు సిద్ధపడక పోవడమే
చంద్రబాబు నైజానికి నిదర్శనం. చంద్రబాబు తనకు తాను నిప్పు అని సర్టిఫికేట్ ఇచ్చుకోకుండా,
కనీసం తిరుమల పుణ్యక్షేత్రం విషయంలోనైనా నిజాలు వెల్లడయ్యేలా సిబిఐ విచారణకు
సిద్ధపడి నిజాయితీని నిరూపించుకోవాలి. లేకుంటే విచారణలంటే భయపడే వ్యక్తిగా
చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతారు.

 

 

 

తాజా వీడియోలు

Back to Top