బాబు అంత పిరికోడా...?


– కేసులంటే అంత భయమా..? 
– అరుపులు, కేకలు, గర్జనలూ పైపైకేనా..?
– ఎయిర్ ఏషియా ఆడియో టేపులతో మరోసారి బయటపడిన బాబు నైజం


నడిచినప్పుడు నా అంతటోడు లేడు..  ఈ సృష్టిని శాసించగల శక్తియుక్తులు నా సొంతం అనడం... కాలం అడ్డం తిరిగినప్పుడు మీరంతా నా వాళ్లే.. నేను మీకోసమే పుట్టాను. ప్రజలంతా నాకు రక్షణ కవచంలా నిలబడాలి. ఇదీ చంద్రబాబు నైజం. 

నేనిచ్చిన పింఛన్‌ తీసుకుంటున్నారు.. నేనేసిన రోడ్ల మీద నడుస్తున్నారు. మీ ఓట్లన్నీ నాకే వేయాలి. టైం నాది అనుకున్నప్పుడు చంద్రబాబు 

నన్ను అరెస్టు చేస్తారేమో. మీరంతా నాకు రక్షణ కవచంలా ఉండాలి. ప్రజలే నన్ను కాపాడుకోవాలి. బీజేపీతో తెగతెంపులు చేసుకున్నాక ఓటుకు నోటు కేసుకు భయపడి చంద్రబాబు చెప్పిన మాటలు. తాజాగా విశాఖలో జరిగిన ఓ కార్యక్రమంలో చంద్రబాబు ఇదే విధంగా తనను కాపాడుకోవాలని.. తనకు రక్షణ కవచంలా ఉండాలని ప్రజలను వేడుకున్నాడు. దీనికీ కారణం లేకపోలేదు. ఎయిర్‌ ఏసియా కుంభకోణంలో చంద్రబాబు పాత్ర ఉందంటూ కొన్ని ఆడియో టేపులను ఇంగ్లిషు పత్రిక ప్రచురించింది. ఈ వార్త తెలిసిన చంద్రబాబుకు నిద్ర కరువైంది. నిన్నటిదాకా అమిత్‌షా, మోడీల మీద అంతెత్తున ఎగిరిపడిన చంద్రబాబు చిన్న ఆడియో టేపులకే చెమటలు కక్కుతున్నాడు. ఏ క్షణానైనా అరెస్టు చేస్తారేమోనని భయంతో వణికిపోతున్నాడు. తనకు ఏ పాపం తెలియనప్పుడు.. ఎయిర్‌ ఏషియా కుంభకోణంతో సంబంధం లేనప్పుడు ఎలాంటి విచారణకైనా సిద్ధమేనని ప్రకటించవచ్చును కదా. కానీ అలా చేయలేదు సరికదా.. ఉన్నట్టుండి తన తీరు మార్చుకున్నాడు. తననేదో అమాకుడిని చేసి జైల్లో పెడుతున్నారన్నట్టు బిల్డప్‌ ఇస్తున్నాడు. నలభయ్యేళ్ల అనుభవం ఉన్న నాయకుడు చేయాల్సిన దానికి భిన్నంగా చంద్రబాబు వ్యవహరించడం ఆయన గురించి తెలిసిన వాళ్లకు ఆశ్చర్యపరచకపోవచ్చు. ఎందుకంటే పైకి అరవీర భయంకరుడిలా.. గంభీరంగా మాట్లాడే చంద్రబాబు అంతటి పిరికి వ్యక్తి ఉండరేమో. 
గతంలోనూ ఓటుకు నోటు కేసులో దొరికాడో లేదో.. కేసీఆర్‌కి భయపడి మూటా ముళ్లె సర్దుకుని అమరావతికి పరుగులు పెట్టాడు. ఆ రోజు నుంచి కేసీఆర్‌ని పల్లెత్తు మాట అనే ధైర్యం కూడా చేయడం లేదు. 

Back to Top