దళితుల పిల్లల చదువులంటే గిట్టదా..!

హైదరాబాద్)) బడుగు బలహీన వర్గాలు అంటే తనకు గిట్టదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి రుజువు చేసుకొన్నారు. అడ్డగోలుగా సంక్షేమ హాస్టల్స్ మూసివేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఒక్క కలం పోటుతో 310 హాస్టల్స్ మూసివేసేందుకు రంగం సిద్ధం అయింది.
హాస్టల్స్ ప్రాధాన్యం
బడుగు బలహీన వర్గాల పిల్లల చదువుల్లో హాస్టల్స్ ముఖ్యపాత్ర పోషిస్తాయి. రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబాలకు చెందిన పిల్లల్ని ఈ హాస్టల్స్ లో ఉంచి చదివిస్తుంటారు. ఎస్టీలు, ఎస్సీలు, బీసీలకు చెందిన పిల్లల కోసం వేర్వేరుగా ఎప్పటినుంచో హాస్టల్స్ ను నిర్వహిస్తున్నారు. ఈ హాస్టల్స్ ను అంతకంతకు పెంచుతూ రావటంతో చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిని ఆయా వర్గాల పిల్లల్ని అక్కడ ఉంచి చదివించేవారు. ముఖ్యంగా దగ్గరలో ఉన్నహాస్టల్ లో ఉంచటంతో పిల్లల్ని అడపా దడపా తల్లిదండ్రులు చూసుకొనేందుకు వీలవుతుండేది. దీంతో పిల్లల చదువులు చైతన్యవంతం అయ్యేవి.
ఖర్చు పేరుతో కోత
బడుగు బలహీన వర్గాల పిల్లల చదువు కోసం పెడుతున్న డబ్బుల్లో ఖర్చు పెరిగిపోతోందని చంద్రబాబు ప్రభుత్వం లెక్కలు వేస్తోంది . దీంతో రేషనలైజేషన్ పేరుతో ఈ హాస్టల్స్ ను మూసివేయాలని నిర్ణయించుకొంది. వివిధ గ్రామాలకు విస్తరించిన హాస్టల్స్ ను మూసివేయటం ద్వారా దూర ప్రాంతాల్లో మాత్రమే హాస్టల్స్ ఉండేలా చర్యలు తీసుకొంది. ఫలితంగా 310 హాస్టల్స్ మూతపడబోతున్నాయి. వీటిలో చదివే 7,100 మంది విద్యార్థుల చదువులు ప్రశ్నార్థకం కాబోతున్నాయి. ఇన్ని వేల మంది చదువులు ఎలా సాగించాలా అన్నది డోలాయమానంగా మారనుంది.
ఉద్యోగులకు సైత ఎసరు
అటు ఈ హాస్టల్స్ లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల భవిష్యత్ అంధకారంలో పడింది. వేల సంఖ్యలో బడుగు బలహీన వర్గాలకు చెందిన సిబ్బంది రోడ్డున పడబోతున్నారు. ఇప్పటి దాకా చేస్తున్న ఉద్యోగాలు ఊడిపోతుండటంతో గ్రామీణ ప్రాంతాల్లో తిరిగి ఉపాధిని వెదక్కోవాల్సి వస్తోంది. బాబు వస్తే జాబు వస్తుందన్న మాట ఏమో కానీ, ఉన్న జాబులు మాత్రం ఊడిపోతున్నాయని ఆవేదన చెందుతున్నారు.

Back to Top