తప్పుల నిప్పుకు విచారణ భయంచంద్రబాబు పదే పదే
తాను నిప్పు అని ప్రకటించుకుంటారు. అధికారం అనే గాలి తోడై ఆ నిప్పు అవినీతికి
ఆజ్యం పోస్తుంటుంది. అయితే ఆ నిప్పును నిలువరించే నీరంటే బాబు కు చచ్చేంత భయం.
కోర్టులో విచారణలో ఉన్న ఆయన కేసులే బాబు నిప్పును ఆర్పే నీళ్లు...తాజాగా ఓటుకు
కోట్లు కేసులో ఆడియోటేపుల్లో గొంతు చంద్రబాబుదే అని ల్యాబ్ రిపోర్టులు తేల్చడంతో
చంద్రబాబు అవినీతి చరిత్ర మరోసారి చర్చకు వచ్చింది. 

చంద్రబాబుపై ఉన్న
ఆరోపణలను, ఆధారాలతో నిరూపించడానికి సిద్ధమైన ప్రతి కేసులోనూ బాబు స్టే
తెచ్చుకున్నాడు. విచారణను వాయిదాలు వేయించుకున్నాడు. స్టేఆర్డర్లతో కేసును
నీరుగార్చేందుకు ప్రయత్నిస్తుంటాడు. కనీసం పది కేసుల్లో బాబు స్టే ఆర్డర్
తెచ్చుకున్నాడంటే...ఆయన అవినీతి భూతం ఎన్ని ఆధారాలతో కోర్టు గుమ్మంలో నిలబడి ఉందో
అర్థం అవుతుంది. తన మేనేజ్మెంట్ క్వాలిటీతో ఎంక్వైరీలను ఆడ్డుకుంటూ, కేసులను
తప్పించుకుంటున్న బాబు, ధైర్యంగా వాటిని ఫేస్ చేయలేకపోతున్నాడంటే కారణం ఆయన అవినీతి...

చంద్రబాబు
అవినీతిపై నందమూరి లక్ష్మీపార్వతి కోర్టుకెళ్లారు. ఆధారలన్నీపక్కాగా ఉండటంతో ఆ
కేసును కోర్టు ఇంకా కొట్టివేయలేదు. చంద్రబాబ స్టే ఆర్డర్ మీదే కేసు ఇంకా
నడుస్తోంది.  బాబు అవినీతి వ్యవహారాలపై ఉన్న మరో కేసు కూడా పెండింగ్ లోనే ఉంది. ఆపద్ధర్మ
ముఖ్యమంత్రిగా ఉండి క్యాబినెట్ తీర్మానం లేకుండా ఐఎంజీకి భూములు కేటాయించిన
వ్యవహారాన్ని ప్రస్తుత తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ సీరియస్ గా తీసుకున్నారు. ఈ
వ్యవహారంలో బాబు పాత్ర ప్రాథమికంగా తేలడంతో తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ
చేసినట్లు ప్రచారం జరుగుతోంది.  ఏలేరు
కుంభకోణంపై విచారణకు ఏర్పాటుచేసిన సోమశేఖర కమిషన్ కు కాలదోషం పట్టేలా, తన అక్రమాలు
వెలుగులోకి రాకుండా చంద్రాబబు ఎలా కుయుక్తులు నడిపాడో అందరికీ తెలిసిందే. ఈ కేసులో
ఆధారాలన్నీ పక్కాగా ఉండటమే అందుకు కారణం.

ఉమ్మడి రాష్ట్రంలో
మద్యం కొనుగోళ్లపై  ఎసిబి విచారణను ఎదుర్కోకుండా
బాబు ఎలా తప్పించుకున్నారో కూడా బహిరంగ రహస్యమే. కుప్పంలో తుంపర సేద్యం పేరిటజరిగిన అక్రమాలపై పై వేసిన ఏక
సభ్య కమిషన్ నివేదిక,  ఇలా ఎన్నో బాబు అక్రమాలకు నిదర్శనంగా ఉన్నా, సాంకేతిక
కారణాలతో తప్పంచుకుంటూ తాను నిప్పునని ప్రచారం చేసుకుంటున్నారు. వాస్తవంలో చంద్రబాబు
ఏనాడు కూడా ఒక్కదానిపై కూడా విచారణను ఎదుర్కోలేదు, అసలు విచారణను ఎదుర్కోకుండా తాన
సచ్చీలుడినని, తుప్పుపట్టని నిప్పునంటూ బడాయిలకు పోవడం చంద్రబాబుకే సొంతం.

 ముఖ్యమంత్రిగా ఉండి సొంత కంపెనీ హెరిటేజ్ ఫుడ్స్
కు ప్రయోజనాలు చేకూర్చిన వ్యవహారంపై, కోట్లకు కోట్లు తమ కంపెనీకి సేల్
టాక్స్ రాయితీలు, సబ్సిడీలు కట్టబెట్టడంపై కేసులునట్లుగా ప్రచారం జరుగుతోంది.

 దేశ వ్యాప్తంగా సంచలనమైన ఓటుకు నోటు కేసు లో
చంద్రబాబు అడ్డంగా దొరికిపోయినా,
ఆడియో టేపుల్లో రెడ్ హ్యాండెడ్ గా
పట్టుబడ్డా మూడేళ్లుగా ఆ కేసు నీరుగారుతూనే ఉంది. ఈ కేసులో బాబు వ్యవహారంపై  పునర్విచారణ చేపట్టింది. లేటెస్ట్ గా
ఆడియోటేపుల్లోని గొంతు చంద్రబాబుదే అనే విషయాన్ని అటు ఫోరెన్సిక్ ల్యాబ్ వారు
నిర్థారించడంతో, ఓటుకునోటులో చంద్రబాబు ఎ.1అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తెలంగాణా ప్రభుత్వం ఈ కేసును సీరియస్ గా తీసుకోనుంది. దీనిపై ఉన్నత స్థాయి సమావేశం
ఏర్పాటు చేసి మరీ తదుపరి ప్రొసీజర్స్ గురించి ముఖ్యమంత్రి కెసిఆర్ చర్చిస్తున్నారు.
ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాసరే తమ ప్రభుత్వాన్ని కూల్చే అవినీతి చర్యలకు
పాల్పడ్డందుకు చంద్రబాబుపై చర్యలు తీసుకునేందుకు గవర్నర్ కూడా సంప్రదించినట్టు అనధికారిక
సమాచారం.  ఇన్నేళ్లుగా ఎన్నో కేసుల్లో విచారణను కూడా ఎదుర్కోకుండా స్టేఆర్డర్
ముసుగుతో కాలం వెళ్లబుచ్చుతున్న చంద్రబాబు బండారం బయటపడే రోజు ఇంకెంతో దూరంలో
లేదు.

Back to Top