ఇక అవిశ్వాసం పెట్టాల్సింది ప్రజలే...




ప్రజల చేత, ప్రజలకోసం, ప్రజలే ఎన్నుకునే ప్రభుత్వాలపై ఎ.పి ప్రజలు పెట్టుకున్న ఆశలు...ఆకాంక్షలు అన్నీ ఆవిరైపోయాయి. ప్రత్యేకహోదా పై అటు కేంద్రం చాణక్యం..ఏ సమస్యలోనైనా తన స్వీయరాజకీయప్రయోజనాన్ని వెదుక్కునే చంద్రబాబు రాజకీయం..ఐదు కోట్ల మంది ఆంధ్ర ప్రజల భవిష్యత్తును నట్టనడిరోడ్డుపై పడేశాయి. 

నాలుగేళ్లుగా....
విభజిత ఆంధ్రప్రదేశ్‌కు ఎన్నెన్నో హామీలు...ఎన్నెన్నో వాగ్దానాలు చేసిన కేంద్రం, ఎన్నికలయిపోయిన వెంటనే, ఆంధ్ర మాకేమి ప్రత్యేకం కాదు, అన్ని రాష్ట్రాల్లో అది కూడా ఒక్కటి అన్న చందాన ఏపీపై నిర్లక్ష్యపు నీడలు పరిచింది. రాష్ట్రభవిష్యత్తుపై కేంద్రం నీలినీడలు కమ్ముకుంటుంటే, అవి వర్షం కురిపించే ఆకాశమేఘాలనీ చంద్రబాబుగారు అమాయకంగా నమ్మారు. తన అమాయకత్వానికి, తన చిత్తశుద్ది లేని వ్యక్తిత్వానికి బాబుగారు పెట్టుకున్న పేరు విజ్ఞత. దేశంలోనే సీనియర్‌ పొలిటీషియన్‌ నేనే నంటూ తన నెత్తిన తానే కిరీటం పెట్టేసుకుని, నాలుగేళ్లకాలం రాజకీయం నడిపారు. ఐదుకోట్ల ఆంధ్రులకు ప్రత్యేక హోదా అవసరం లేదని, మోడీసారు ఇస్తానన్న ప్యాకేజీ చాలని...రాష్ట్రముఖ్యమంత్రిగా నిర్ణయం తీసుకున్నారు. తమ విడదీయరాని బంధంపై అపారప్రేమను ప్రకటిస్తూ...రాజధాని నిర్మాణమంటే మోడీగారు ముంతెడు మట్టి, చెంబుడు నీళ్లు ఇవ్వగానే మురిసిపోయి...నెతిన చల్లుకుని మురిసిపోయారు. హైదరాబాద్‌ నగరంలో ఎపి రాజధానిని నడుపుకోవడానికి పదేళ్లు అవకాశం వున్నా ’సన్నాసి’లా వదిలేసి...నేనక్కడ వుంటే, ఇక్కడ రాజధాని కట్టేదెవరని...ఇదేంటని? అడిగిన వారిని దబాయించారు. రాష్ట్రానికి సంబంధించి తాపీనైనా, మేస్త్రేనైనా నేనేనంటూ...స్వీయ భ్రమలకు తీవ్రంగా లోనై...కేంద్రం ఉచ్చులో పడిపోయారు. ప్రజలందరికీ ఈ విషయాలు ఏరోజుకారోజు అర్థమవుతున్నా, ఎపిలో తన దబాయింపు రాజకీయం మానలేదు. నిజానికి చంద్రబాబుగారికి ఇదేమీ కొత్త కాదు. ఆయన నెవరైనా ప్రశ్నిస్తే దబాయింపు. మీరిచ్చిన హామీని మరిచారా? అంటే దబాయింపు. ఆయన దబాయింపుల బారిన దళితులు, బలహీనవర్గాలతో పాటు అన్ని వర్గాల ప్రజలూ పడ్డారు. తాను స్వంతమామగారికి వెన్నుపోటు పొడిచి, గద్దెనెక్కి కూర్చున్న రోజు నుంచి సామాన్యులపై, ప్రశ్నించేవారిపై ఇదే దబాయింపు రాజకీయం చేస్తూ పోయారు. ఇంతకాలం పాపం అమాయ ఆంధ్రులపై దబాయింపులతో పెత్తనం చేస్తూ వచ్చిన నారా బాబుగారికి, నీ నార తీసేది మేమేనంటూ బీజెపి తగులుకుంది పాపం! ఇంతకాలం అమాయకుడిని చేసి ఆడుకుంది. తనకు, తనవారికి, తన పచ్చపార్టీకి అన్ని సమకూరితే చాలనుకున్న స్వార్థంతో...పాలన కొనసాగిస్తూ పోతున్న పాపానికిప్పుడు సరైన శిక్ష పడింది. 
ఇదంతా పక్కన పెడితే, ఒక్క ప్రత్యేకహోదా విషయంలోనే బాబుగారు ఎన్ని పిల్లిమొగ్గలు వేశారో, ఎన్ని దారుణ నిర్ణయాలు తీసుకున్నారో...వాటన్నిటి ఫలితం ఇప్పుడు ఎ.పి భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసిపడేసింది. తెలుగు వాడి, వేడి...బాబుగారి చలవతో మొద్దుబారిపోయే పరిస్థితి తలెత్తుతోంది. సరిగ్గా, ఎపి ప్రజల అదృష్టం కొద్దీ ఆకురాయిలా ప్రతిపక్షనాయకుడు దొరికాడు. ఇప్పుడు తెలుగు కత్తి వాడి. వేడి అతనే. ఈ అప్రజాస్వామిక రాజకీయాలపై...ప్రజాస్వామిక కత్తిలా నడిచేస్తున్నా...నడిచొచ్చేస్తున్నా...విపక్ష నాయకుడే ఇప్పుడో భరోసా. ఆయన లేవనెత్తుతూ వస్తున్న ప్రజాసమస్యలు...రేపటి భవిష్యత్తుపై రేకెత్తిస్తున్న ఆశలే .. దిగులు పడుతున్న రాష్ట్రానికి ’సంజీవని’ టానిక్‌. మీకోసం – మనందరి ప్రభుత్వం ...అంటూ నడుస్తున్న తీరే గ్యారంటీ సంతకం.
’’ఇక ఈ మభ్యపెట్టే హామీలతో, మోసకారి మాటలతో, ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి స్వీయప్రయోజనాలు సాధించుకునే రాజకీయాలతో, ఈ అబద్దాలతో, అవినీతితో, కుట్రలు, కుతంత్రాలతో నష్టపోవడానికి సిద్దంగా లేము. మీకు మీ రాజకీయాలకో దండం. మీపై అవిశ్వాసం ప్రకటిస్తున్నాం’’ అంటూ ...బాబు అధికారంపై ప్రజలు అవిశ్వాసం ప్రకటించే రోజు అట్టే దూరం లేదు. . 

తాజా వీడియోలు

Back to Top