చంద్రబాబు కనుసన్నల్లో సభ

అసెంబ్లీః కాల్ మనీ సెక్స్ రాకెట్ కుంభకోణం నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వం బరితెగించి ప్రవర్తిస్తోంది. అసెంబ్లీ గేట్లకు తాళాలు వేసి..ప్రతిపక్ష సభ్యులను మార్షల్స్ తో సభనుంచి గెంటించి సభను ఇష్టాను సారంగా నడుపుకుంటున్నారు. అంతేగాకుండానిండు సభలో టీడీపీ సభ్యులు ప్రతిపక్ష సభ్యులపై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ సభా నియమాలను మంటగలిపారు. అప్రజాస్వామికంగా నియంత పాలన సాగిస్తూ ప్రతిపక్షాన్ని అణచే ప్రయత్నం చేస్తున్నారు. మహిళలపై అన్యాయాన్ని ప్రశ్నించినందుకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజాను సంవత్సరం పాటు సస్పెండ్ చేశారంటే..ప్రజాస్వామ్యం పట్ల, మహిళపట్ల ప్రభుత్వం ప్రభుత్వ పనితీరు ఏవిధంగా ఉందో అర్థమవుతోంది. 

చంద్రబాబు..
బాధ్యత గల ముఖ్యమంత్రి స్థానంలో ఉండి చంద్రబాబు నిండు సభలో దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. వీళ్లేం ఎమ్మెల్యేలు, బజారు రౌడీలంటూ చంద్రబాబు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను దూషించారు. 

గోరంట్ల బుచ్చయ్య చౌదరి..
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మరోసారి రెచ్చిపోయారు. 'కాల్ మనీ' సెక్స్ రాకెట్ వ్యవహారంపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష వైఎస్సార్సీపీ  సభ్యులను నోటికి వచ్చినట్టు తిడుతూ ఊగిపోయారు. . మాకూ అధికారం ఉంది. వైఎస్సార్సీపీని ఏదైనా చేయగలం . ఎలా నలిపేయాలో మాకు తెలుసంటూ ప్రతిపక్షాన్ని బెదిరింపులకు దిగారు. 
 
విష్ణుకుమార్ రాజు..
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఒంటికాలిపై లేచారు. కాల్ మనీపై చర్చించాలని వైఎస్సార్సీపీని కోరినందుకు  తాము తల్చుకుంటే రెండు నిమిషాలు పట్టదంటూ ఊగిపోయారు. 

అచ్చెన్నాయుడు..
ప్రతిపక్ష నాయకుడిపై మంత్రి అచ్చెన్నాయుడు బరితెగింపు వ్యాఖ్యలు చేశారు. నోటికి వచ్చినట్లు దూషిస్తూ సభా నియమాలను ఉల్లంఘించారు. 
Back to Top