ప్రజల తరపున పోరులో మరింత సమాయత్తం.. విస్త్రత స్థాయి సమావేశం

విజయవాడ)
విజయవాడ వేదికగా వైయస్సార్సీపీ విస్త్రత స్థాయి సమావేశానికి సర్వం సిద్ధం
అవుతోంది. నగరంలోని ఏ వన్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగే ఈ కార్యక్రమానికి రాష్ట్ర
వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల నుంచి పార్టీ నాయకులు పెద్ద ఎత్తున తరలి
వస్తున్నారు. అధ్యక్షులు వైయస్ జగన్ ముఖ్య ఉపన్యాసం చేసి పార్టీ శ్రేణులకు
దిశానిర్దేశం చేయనున్నారు.

          ఆవిర్భావం నుంచి వైయస్సార్సీపీ ప్రజల
తరపున వివిధ అంశాల మీద పోరాడుతూ వస్తోంది. విభిన్న అంశాల మీద ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ
ఉద్యమిస్తోంది. రెండు సంవత్సరాలుగా తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు
అంతకంతకూ పెచ్చుమీరుతున్నాయి. అవినీతి, లంచాల కోసం ప్రజా ప్రయోజనాల్ని తాకట్టు
పెట్టడంతో పాటుగా ఓటుకి కోట్లు కేసులో ఇరుక్కొని మొత్తం వ్యవస్థను అపభ్రంశం
చేశారు. ఇటువంటి పోకడల మీద పోరాడేందుకు బాధ్యత గల ప్రతిపక్షంగా వైయస్సార్సీపీ పోరు
బాట లో సాగుతోంది.

          అధికారపక్షం
వైఫల్యాలు, రాష్ట్రంలో శాంతి భద్రతల
పరిస్థితి, ప్రతిపక్షాలపైనా, మీడియాపైనా కొనసాగుతున్న అణచివేత వైఖరి వంటి అంశాల మీద చర్చిస్తారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి
రోజైన జూలై 8 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా
చేపట్టబోయే ‘గడప గడపకూ వైఎస్సార్’ అనే పార్టీ కార్యక్రమాన్ని పకడ్బందీగా ముందుకు తీసుకువెళ్లాల్సిన
తీరుపై ప్రధానంగా చర్చ
జరుగుతుంది. ఉదయం 10 గంటల
నుంచి సాయంత్రం 5 గంటల వరకూ
కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే ఈ విస్తృత సమావేశంలో పార్టీ శ్రేణులకు, నేతలకు, ప్రజా
ప్రతినిధులకు వైఎస్ జగన్ దిశా నిర్దేశం చేస్తారు.

          ఏ
వన్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగే కార్యక్రమానికి పార్టీ వర్గాలు పెద్ద ఎత్తున
ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు రెండు వేల మంది ప్రతినిధులు హాజరు అవుతారని అంచనా.
అంత మందికి సరిపడే రీతిలో అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశారు. ఉదయమే పార్టీ సిబ్బంది
రిజిస్ట్రేషన్ చేసుకొని పాస్ లు జారీ చేస్తున్నారు. పార్టీ వర్గాలకు కావలసిన అన్ని
రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు నాయకులు చెబుతున్నారు.

          

Back to Top