ఏపీలో మహిళకు రక్షణ కరువు

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు రక్షణేకాదు.. అసలు స్థానమే లేకుండా పోయే పరిస్థితి దాపురించింది. పచ్చ నేతల ఆగడాలకు ఆడవాళ్లు బయట కనిపించడానికే వణికి పోతున్నారు. ఆడదాన్నని చెప్పుకునేందుకు భయపడే రోజులు దాపురించాయి. ఇచ్ఛాపురం నుంచి తడ వరకు ఏ జిల్లాలో చూసినా మహిళ కనిపిస్తే చాలు టీడీపీ ఉన్నాదులు అచ్చోసిన ఆంబోతుల్లా పశుబలం ప్రదర్శిస్తున్నారు. ఏ క్షణంలో.. ఏ వైపు నుంచి... ఏ రూపంలో.. వచ్చి పడతారో తెలీదు. ఏం చేస్తారో అర్థం కాదు. టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళలను టార్గెట్‌ చేసినట్టుగా ఏపీలోని ప్రతి జిల్లాలో జరుగుతున్న దాడులు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుంటే తమ కూతుళ్లను బయటకు పంపాలంటే తల్లిదండ్రులు ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రెండు రోజుల క్రితమే ఏపీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు మహిళలను ఉద్దేశించి అన్నమాటలు పొరపాటున వచ్చినవి కాదని తేలిపోయింది. ‘కారు షెడ్డులో ఉండాలి.. ఆడవాళ్లు వంటింట్లో ఉండాలి’ అని ఎందుకన్నారో అప్పుడు చాలా మందికి సరిగా అర్థం కాలేదు. ఆడవారు బయటకొస్తే మా టీడీపీ నాయకులు, కార్యకర్తల చేతుల్లో బలైపోవాల్సిందేనని హెచ్చరిక అని తాజాగా కర్నూలులో కూలీపై అత్యాచారం, ఎమ్మెల్యే ఆర్కే రోజా కిడ్నాప్‌ సంఘటనలతో మరోమారు రుజువైంది. 
కర్నూల్‌లో మహిళా కూలీపై అత్యాచారం
కర్నూలు మండలం ఆర్‌. కొంతలపాడు గ్రామంలో పొలంలో పనిచేసుకుంటున్న ఓ మహిళా కూలీని అదే గ్రామానికి చెందిన కె. కృష్ణ, కె. శ్రీను, గొల్ల శివ అనే ముగ్గురు కామాంధులు బలవంతంగా అపహరించుకుని పోయి అత్యాచారం చేశారు. అరవకుండా నోట్లో తువ్వాలు కుక్కి అత్యాచారం చేస్తూ వీడియో తీశారు. ఈ సంఘటన డిసెంబర్‌ 13న చోటుచేసుకుంది. అంతటితో ఆగకుండా ఆ వీడియోలను చూపించి బెదరించి మరో రెండు సార్లు వారి పశువాంఛ తీర్చుకున్నారు. నిందితులు కోడుమూరు నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి విష్ణువర్ధన్‌రెడ్డి మనుషులు కావడంతో బాధితురాలు ఫిర్యాదు చేసేందుకు వెనకాడింది. అయితే వీడియోలను చూపించి బెదిరిస్తుండటంతో ఆమె చివరకు ధైర్యం కూడగట్టుకుని ఫిబ్రవరి 1న డీజీపీ సాంబశివరాను విజయవాడలో కలిసి ఫిర్యాదు చేసింది. 2న కర్నూలు సీఐ మహేశ్వర్‌రెడ్డికి ఇదే ఘటనపై బాధితురాలు మరోసారి భర్తతో కలిసి ఫిర్యాదు చేసింది. అయినా ఆమెకు న్యాయం జరగలేదు. 
సాధికారత మాటల్లోనే...
మహిళా రిజర్వేషన్లు ఆమోదింపజేస్తాం.. వెంకయ్య నాయుడు, సృజనాత్మకతలో మహిళలే మేటి.. చంద్రబాబు నాయుడు, మహిళా పార్లమెంట్‌ సమావేశాల్లో కేంద్రమంత్రి, ముఖ్యమంత్రి చెప్పిన మాటలు. అవును ఇవన్నీ కేవలం మాటల వరకే. మహిళా పార్లమెంట్‌ సమావేశాలు మొదలైన రోజునే బాధితురాలు డీజీపీని మరోసారి కలిసి న్యాయం కోరేందుకు వెళ్లింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన్ను కలిసేందుకు పడిగాపులు కాసినా సోమవారం రమ్మని పంపేశారు. ఇప్పటికే ప్రాణ భయంతో ఊరొదిలి హైదరాబాద్‌ వచ్చిన దంపతులు డీజీపీని కలిసే దాకా అక్కడ్నుంచి కదిలేది లేదని దీనంగా విలపించారు. అయినా ఆ పోలీసుల పాషాణ హృదయాలు కరగలేదు. వారి గోడు వినిపించుకోలేదు. చివరకు వీరి బాధను గమనించిన పాత్రికేయులు స్పందించి వారి వంతుగా అన్యాయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. లేదంటే ఈ విషయం అలాగే మరుగున పడిపోయేది.
సదస్సుకు ఆహ్వానించి కిడ్నాప్‌లా..
మహిళా పార్లమెంట్‌కు ఎమ్మెల్యే రోజాను ఆహ్వానించి తీరా ఆమె వస్తుంటే గన్నవరం ఎయిర్‌పోర్టులోనే అడ్డగించి కిడ్నాప్‌ చేయించారు. ఎక్కడెక్కడి నుంచో మహిళలను అరువుకు రప్పించి గొప్పలు చెప్పించుకుంటున్న బాబు సహచర ఎమ్మెల్యేకు మాత్రం కనీసం సదస్సులో పాల్గొనే అవకాశం కూడా కల్పించలేకపోయాడు. ఆమెకు మాట్లాడే అవకాశం కల్పిస్తే ఎక్కడ బాబు భండారం బయటపెడుతుందోనని భయపడి వేదిక వద్దకు కూడా రప్పించే సాహసం చేయలేకపోయాడు. గత మూడేళ్ల కాలంలో చంద్రబాబు హయాంలో జిల్లాలో వారీగా మహిళలపై జరిగిన దారుణాలను పరిశీలిస్తే వారి రక్షణ ఏమాత్రంగా ఉందో తెలిసిపోతోంది..
Back to Top