ఓటమి భయంతో ఓటర్లకు బెదిరింపులు

  • చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు
  • నంద్యాలలో ఓటర్లకు బెదిరింపులు
  • నా పింఛన్లు, నారోడ్లు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు
  • నాకే ఓటేయ్యాలంటూ దౌర్జన్యం
  • ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత నేపథ్యంలో మతిభ్రమించిన వ్యాఖ్యలు
కర్నూలుః ముఖ్యమంత్రి చంద్రబాబుకు నంద్యాల ఫీవర్ పట్టుకుంది. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా అవినీతి, అక్రమాలే ధ్యేయంగా పాలన సాగిస్తున్న చంద్రబాబుకు ఉన్నపలంగా నంద్యాల గుర్తుకొచ్చింది. వైయస్సార్సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన భూమా నాగిరెడ్డి హఠాన్మరంతో అక్కడ ఎన్నికలు అనివార్యమయ్యాయి. త్వరలో అక్కడ ఉపఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నంద్యాలలో తిష్టవేసిన చంద్రబాబు మతిభ్రమించిన వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉండడంతో ఓటమి తప్పదని గ్రహించిన చంద్రబాబు నంద్యాలలో ఓటర్లను ప్రలోభపెట్టే చర్యలకు దిగుతున్నారు. నంద్యాలలో మకాం వేసి దిగజారుడు రాజకీయాలకు తెరలేపారు. 

నంద్యాలలో టీడీపీ శ్రేణులతో సమావేశమైన చంద్రబాబుతో తమ సమస్యలను చెప్పుకునేందుకు స్ధానికులు కొంతమంది వెళ్లారు. అక్కడి వెళ్లిన వారిని ఉద్దేశించి మాట్లాడిన బాబు.. సమస్యలు తర్వాత ముందు తాను చెప్పేది వినాలంటూ హూంకరించారు. ‘‘నేను ఇచ్చే పెన్షన్, రేషన్‌ తీసుకుంటున్నారు, మేం వేసిన రోడ్లపైన తిరుగుతున్నారు. కానీ నాకు ఓటు వేయకపోతే ఎలా? లేకపోతే పెన్షన్లు, రేషన్‌ తీసుకోవద్దు. ఓటెయ్యని గ్రామాలను పక్కన పెట్టేస్తానంటూ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి చంద్రబాబు సభ్యసమాజం తలదించుకునే రీతిలో మాట్లాడారు. తాను తల్చుకుంటే ఓటుకు రూ.వెయ్యి నుండి రూ.5 వేలు ఇవ్వగలనని, అందుకోసం ప్రజల నుంచి ఐదు లక్షల  వసూలు చేయాల్సి వస్తుందని అన్నాడు. అందులో సగం నాకు, సగం మీకు అంటూ చెప్పుకొచ్చారు.  జనం సొమ్మును బాబు తన సొంత సొత్తుగా ఫీలవ్వడమే గాకుండా ఓటుకు నోటు రాజకీయాలకు పాల్పడుతుండడంపై ప్రజలు, ప్రజసంఘాలు, ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.  ప్రజల సొమ్ముతో అందుకునే పించన్లను తీసుకోవద్దని, రోడ్లపై నడవొద్దని బాబు ఎలా అంటారని పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు.

బాబు హయాంలో జన్మభూమి కమిటీల పెత్తనంతో అర్హులైన పేదలకు ఎక్కడ పింఛన్లు అందడం లేదు. అన్నీ పచ్చనేతలకే దోచిపెడుతున్నారు. తాను అధికారంలోకి వస్తే రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తా, బ్యాంకుల్లో బంగారం ఇంటికి రప్పిస్తానని చెప్పిన చంద్రబాబు..అధికారంలోకి వచ్చాక నిలువునా రైతులను దగా చేశారు. బాబు చేసిన మాఫీ రైతులకు వడ్డీలకు కూడ సరిపోలేదు. బ్యాంకులు రైతులకు రుణాలు ఇచ్చిన పాపాన పోవడం లేదు. మహిళల మెడలోని పుస్తెలను బ్యాంకులు తాకట్టు పెట్టుకున్న దుస్థితి. రాష్ట్రంలో ఇంత దారుణమైన పరిస్థితులుంటే.. తాను రూ.వెయ్యి పింఛన్‌ ఇస్తున్నానని, రూ.1.50 లక్షల వరకు రుణమాఫీ చేశానంటూ బాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు. 

అశ్లీల కామెంట్‌కు బాబు కితాబు
తనవల్ల లబ్ధి పొందినప్పుడు తనకు ఓటు వేయాలని బాబు వ్యాఖ్యానించినప్పుడు టీడీపీ నేత ఒకరు నినాదాలు చేస్తూ.. ‘‘ఒక అబ్బ, ఒక అమ్మకు పుట్టిన వాడు ఓటెయ్యాలంటూ అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. దీన్ని ముఖ్యమంత్రి  తప్పుపట్టాల్సిందిపోయి, అతని వైపు చూసి కరెక్ట్‌ అని వ్యాఖ్యానించడం దారుణం. అంతటితో ఆగని చంద్రబాబు సాక్షిపైన తన అక్కసు వెళ్లగక్కారు. తన అవినీతి బండారాన్ని బయటపెడుతున్న సాక్షి దినపత్రికను చదవవద్దు, టీవీని చూడొద్దంటూ బాబు అసహనం వ్యక్తం చేశారు. Back to Top