మరో స్వాతంత్ర‌ పోరాటం చేయాల్సిందే..!

() దేశాన్ని దోచుకొంటున్న విదేశీయుల్నితరిమి
కొట్టేందుకు స్వాతంత్ర్య పోరాటం

() ఇప్పుడు పరాయి దేశాలకు
దోచిపెడుతున్న చంద్రబాబు

() రాజధాని పేరుతో చంద్రబాబు
దొంగాటలు

హైదరాబాద్) సరిగ్గా ఇదే ఆగస్టు
నెలలో భారతదేశం పరాయిపాలన నుంచి విముక్తి పొంది, స్వాతంత్ర‌ 0 సాధించుకొంది.
అడ్డగోలుగా దోచుకొంటున్న విదేశీయుల్ని తరిమి కొట్టి స్వాతంత్ర్యాన్ని పొందింది.
కానీ, చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.
రాజధాని పేరుతో దేశ సహజ సంపద, భూముల్ని విదేశీయులకు అడ్డగోలుగా
అప్పగించేస్తున్నారు.

విదేశీయుల పాలనలో జరిగిందిదే

ఆంగ్లేయులు భారతదేశంలో అడుగు
పెట్టిన రోజుల్లో కూడా సరిగ్గా ఇదే జరిగింది. పోర్చుగీస్, డచ్చి దేశాలకు చెందిన
విదేశీయులు వ్యాపారం కోసం భారత్ కు వచ్చారు. తర్వాత ఫ్రెంచ్ వారు, బ్రిటీష్ వారు
ఇలాగే అడుగు పెట్టి వ్యాపారాల కోసం కొంత సాయం పొందారు. తర్వాత కాలంలో మొత్తంగా
దేశాన్ని ఆక్రమించి సంపదను కొల్లగొట్టేశారు. ప్రజల్ని పీడించుకొని తింటూ,
అడ్డగోలుగా దురాక్రమణ చేసేశారు. తర్వాత కాలంలో మొత్తం దేశాన్ని ఆక్రమించుకొని సర్వ
నాశనం చేసిపెట్టారు. అప్పటిదాకా ప్రపంచంలోనే సుసంపన్న రాజ్యంగా వెలుగొందిన భారత్,
చివరకు నిరుపేద దేశంగా మారిపోయింది.

ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నదీ
ఇదే

అదిరిపోయే రాజధాని కడతానంటున్న
చంద్రబాబు కూడా సరిగ్గా ఇదే మార్గాన్ని ఎంచుకొంటున్నారు. సింగపూర్ బినామీ
కంపెనీలతో చీకటి ఒప్పందాలు కుదుర్చుకొని అందుకోసం ఎంతకైనా తెగిస్తున్నారు. రాజధాని
ప్రాంతంలో 33వేల ఎకరాల భూముల్ని రైతుల నుంచి లాగేసుకొన్నారు. 32వేల ఎకరాల అటవీ
భూమిని స్వాధీనం చేసుకొని చెట్లు నరికేసేందు రంగం సిద్దం చేసుకొన్నారు. అసైన్డ్,
వక్ఫ్, కుంట భూముల్ని కలుపుకొంటే మొత్తం లక్ష ఎకరాల భూమిని మింగేస్తున్నారు.
స్విస్ ఛాలెంజ్ అంటూ దిక్కుమాలిన పద్ధతిని తెర మీదకు తెచ్చి సింగపూర్ బినామీ
కంపెనీలకు భూముల్ని అడ్డగోలుగా దోచిపెడుతున్నారు. అంటే రాష్ట్ర రాజధాని ప్రాంతం
మీద మొత్తంగా విదేశీయుల పెత్తనమే రాజ్యం చేయబోతోంది.

పరాయి పెత్తనం అవసరమా

రాజధాని పేరుతో నాలుగు భవనాలు
కట్టడం అన్నది భారతీయులకు చేతకాదా. భారతీయ ఇంజనీర్లు చేయలేరా. ఇదే ప్రశ్న అడిగితే
భారతీయులు అయితే మురికివాడలు మాత్రమే కడతారంటూ చంద్రబాబు ఈసడించుకొన్నారు.
మూకుమ్మడిగా భూముల్ని విదేశీయులకు అప్పగించేందుకు తాపత్రయ పడుతున్నారు.
ప్రపంచంలోని ఏ దేశంలోనూ ఈ మాదిరిగా ఒక రాజధాని మీద మరో దేశానికి పెత్తనం ఉండదేమో.
ఇంతటి దుర్మార్గానికి చంద్రబాబు ఒడిగడుతున్నారు. ఇటువంటి దుర్మార్గాన్ని ప్రజలంతా
చైతన్యం తెచ్చుకొని ఎదుర్కోవాల్సి ఉంటుంది. రాష్ట్రాన్ని , భూముల్ని , సహజ సంపదను
కాపాడుకోవాల్సి ఉంది.

 

 

Back to Top