మరో అప్రయోజనదీక్ష

టిడిపి అంటే తెలుగు
డ్రామా పార్టీ అని ఊరికే అనటం లేదు. చంద్రబాబు తెలుగు ప్రజలను మభ్య పెట్టడానికి పూటకో వేషం
కడుతున్నారు. గత నెల 30న తిరుపతిలో చేసిన ధర్మపోరాట దీక్ష నాటకం స్టేజ్ షోలా ఉందని విమర్శలొచ్చాయి. అంతకు మునుపు ఆయన పుట్టిన
రోజు నాడు చేసిన ‘ఎసి నిరాహార దీక్ష’ అభాసు పాలైంది. అయినా కూడా బాబు ఏమాత్రం పట్టు వీడటం లేదు వంద సార్లు
ఆడితే అబద్ధం నిజం అవుతుందనే సామెతను నిజం చేయాలని కంకణం కట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వం మీద
యుద్ధం చేస్తున్నంత హడావిడితో దీక్షలు చేస్తున్నారు. దీనివల్ల ప్రయోజనం ఏదైనా ఉందా అని ఆలోచిస్తే అది మాత్రం
శూన్యం.

రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న ప్రభుత్వంపై
వ్యతిరేకతను చూపాలంటే అనుసరించాల్సిన పద్ధతి ఇదేనా అని నవ్వుతున్నారు తెలుగు రాష్ట్రాల
ప్రజలు. అధికారం లేని ప్రతిపక్షాలు తమ నిరసనను తెలియజేయడానికి ఎంచుకునే పద్ధతుల్లో, అధికారంలో ఉన్న టిడిపి
చేస్తున్న తాటాకు చప్పుళ్లు ఎవరి కోసం అని మండి పడుతున్నారు. నిజంగా ప్రత్యేక హోదా
పై, విభజన హామీలపై చిత్త
శుద్ధి ఉంటే రాజ్యాంగపరంగా కేంద్రంతో విబేధించాలి. కానీ చంద్రబాబు మాత్రం నామ్ కే వాస్తే దీక్షలు, హర్తాళ్లు, నిరసనలు, ర్యాలీలతో కేంద్రంతో
పోరాడేస్తున్నా అంటున్నారు.

గత నాలుగేళ్లుగా
అనేత విధాలుగా పోరాడుతూ ప్రజల్లో చేతన్యం తెస్తూ, చివరకు పార్లమెంటులో అవిశ్వాసంతో, రాజీనామాలతో ప్రతిపక్ష
పార్టీ  హోరాహోరీగా కేంద్రంతో తలపడుతుంటే చంద్రబాబు
మాత్రం కొబ్బరిపుల్ల పట్టుకుని కేంద్రంతోకత్తి యుద్ధం చేస్తున్నాచూస్కోండి అంటున్నాడు. ఎన్డీయే నుంచి వైదొలగినా
ఎమ్.పిలను మాత్రం కొనసాగిస్తున్న చంద్రబాబు కేంద్రంతో కయ్యంలో ఉన్నట్టా, వియ్యంలో ఉన్నట్టా?

మాటకి ముందో సారి 30 సార్లు దిల్లీ పేరెత్తే
చంద్రబాబు అసలు ఏ ఉద్దేశ్యాలతో అన్నిసార్లు దిల్లీ గడప తొక్కాడో నిన్నటి దాకా టిడిపికి
దోస్తులుగా ఉన్న బిజెపి నేతలు బైట పెడుతూనే ఉన్నారు. ఇంతకు ముందు ఓ నేత చంద్రబాబు దిల్లీకి అన్ని సార్లు
ఎందుకు వచ్చారో, వచ్చి ఏం అడిగారో బాహాటంగానే చెప్పుకొచ్చారు. అన్ని సార్లు వచ్చినా
మోదీని కలిసింది కొన్నిసార్లే అనే నిజాన్ని బైట పెట్టారు. వచ్చిన ప్రతిసారీ నియోజక
వర్గాల పెంపు, జగన్ కేసుల గురించే తప్ప విభజన హామీల గురించి ప్రస్తావించలేదని కుండ బద్దలు
కొట్టారు. నేడు మరో ముఖ్య నేత కన్నా లక్ష్మీనారాయణ కూడా ఇదే మాటను రూఢీ చేసారు. జగన్ జైలుకెప్పుడు వెళ్తాడంటూ
చంద్రబాబు ఆరా తీసేవాడని, రాష్ట్రప్రయోజనాలకోసం బాబు ఏనాడూ దిల్లీలో కాలు పెట్టలేదని
తెలియజేశారు.

చంద్రబాబు నాటకాలను
నడి వీధిలో నుంచోబెట్టి మరీ నిలదీస్తున్నారు మాజీ పొత్తు పార్టీ నేతలు. అందుకే పదే పదే బాబు
విభజన హామీలు, ప్రత్యేక హోదా విషయంలో తన నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు వారానికో
డ్రామా ఆడుతున్నారు. బిజెపి మోసం చేసింది. బిజెపి ద్రోహం చేసింది. బిజెపి రాష్ట్రానికి
అన్యాయం చేసింది అనడం ద్వారా, బిజెపి చేయిపట్టుకుని తిరిగిన తన తప్పులను కప్పిపుచ్చుకోవాలని
చంద్రబాబు శతవిధాల ప్రయత్నిస్తున్నాడు.

విశాఖ వేదికగా చంద్రబాబు
గతంలోనూ చాలా నాటక వేదికలు ఏర్పాటు చేసాడు. సిఐఐ సదస్సు, బ్లాక్ చైన్, మహిళా పారిశ్రామికవేత్తల సదస్సు, టెక్ -2017 సదస్సు, అగ్రిటెక్ సదస్సు ఇలా
ఏడాదికో అరడజను సదస్సులతో అటు మీడియాని తన కవరేజ్ బిజీలో, ఇటు ప్రజలను మాయలో పడేసి
ఉంచుతున్నారు. ఇవాళ కూడా ధర్మపోరాట దీక్ష పార్ట్ 2 మొదలు పెట్టాడు. వంచన, మోసం, మభ్యపెట్టడం, కాలం గడపడం, పబ్బం గడుపుకోవడం ఇదే చంద్రబాబు నీతి. ఆయన అవినీతిని కప్పి
పెడుతున్న దుర్నీతి. చంద్రబాబు చేసే ధర్మపోరాట దీక్షల్లో ధర్మం లేదు. ఆ దీక్షల వల్ల ఆంధ్ర
రాష్ట్రానికి ఉపయోగమూ లేదు అనుకుంటున్నారు తెలుగు ప్రజలు. 

Back to Top