రైతులకు కీడు చేసే మాస్టర్ ప్లాన్

కార్పొరేట్లకు దోచిపెట్టడమే బాబుగారి స్కీమ్
రాజధాని రైతులకు వ్యతిరేకంగా రోజుకో కుట్ర
సామాజిక కార్యకర్తలు, మేధావుల సలహాలను పట్టించుకోని వైనం
హైదరాబాద్: రాజధాని నిర్మాణం పేరుతో రైతుల భూములను లాక్కుంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి మాస్టర్ ప్లాన్ వెనక కుట్రలన్నీ ఒక్కటొక్కటిగా బైటపడుతున్నాయి. రోజుకొక ప్రముఖుడు చంద్రబాబు భూదాహాన్ని, రైతులకు కీడు చేస్తున్న ఆయన కుట్రలను బైటపెడుతున్నారు. మొన్న మేధాపాట్కర్, నిన్న శివరామ కృష్ణన్, నేడు అన్నా హజారే.... చంద్రబాబు కుట్రలను, రాజధాని పేరుతో ఆయన ఆడుతున్న నాటకాలను దుయబట్టారు. రైతులనుంచి భూములు లాక్కుంటున్న చంద్రబాబు నాయుడు ఆ భూములను కారుచౌకగా కార్పొరేట్ కంపెనీలకు, జగ్గీ వాసుదేవన్ లాంటి వారికి పప్పుబెల్లాల్లా పంచి పెడుతున్నారు. సీఆర్‌డీఏ పరిధిలో రైతుల భూములను ముందుగానే కొడుకు లోకేష్, అత్యంత ఆప్తులైన సుజనా చౌదరి, సీఎం రమేష్, మంత్రి నారాయణ తదితర నేతలకు దోచి పెట్టడమే బాబుగారి మాస్టర్ ప్లాన్ లా కనిపిస్తున్నది. రాజధానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ఎందుకు బయట పెట్టడం లేదని ప్రతిపక్ష పార్టీగా వైఎస్‌ఆర్‌సీపీ అడుగుతుంటే ఇంత వరకు సమాధానం లేదు. కొడుకు లోకేష్‌కు, తన చుట్టూ ఉన్న కార్పోరేట్ పొలిటీషియన్స్‌కు రాజధాని ప్రాంతాన్ని, రైతుల భూముల్ని దోచి పెట్టడం కోసమే చంద్రబాబు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. 
  • చంద్రబాబు నాయుడు  భూ దాహం తీరాలంటే ఇంకెన్ని వేల, లక్షల ఎకరాలు రాజధాని పేరుతోనో.. మరో పేరుతోనో దోపిడీ చేస్తారో? 
  • మేధా పాట్కర్, అన్నా హజారే లాంటి సామాజిక ఉద్యమకారులు, శివరామకృష్ణన్ లాంటి సీనియర్ ఐఏఎస్ అధికారి చెప్పిన తర్వాతైనా చంద్రబాబు నాయుడు తీరు మార్చుకోవాలి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారు. 
  • తనది రైతు పక్షపాత ప్రభుత్వమని కబుర్లు చెబుతున్న చంద్రబాబు నిజానికి రైతుల్ని కూలీలుగా మార్చేందుకు.. కూలీల్ని వేరే రాష్ట్రాలకు వలస పంపేందుకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసుకున్నట్లు కనిపిస్తోంది.
  • భూ సేకరణపై దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు  చంద్రబాబు నాయుడుకు కనిపిస్తున్నట్లు లేదు. నిన్న ఢిల్లీ నడివీధుల్లో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న విధానం ఆయన గుండెను కదిలించడం లేదు? రైతులకు కీడు చేయటానికే, అన్యాయం చేయటానికే బాబుగారి ప్రభుత్వం ఉంది.
  • రాజధాని పేరు మీద తాను చేస్తున్న అన్యాయాలు ఎవరికీ కనపడటం లేదని చంద్రబాబు అనుకుంటున్నారు. మీడియాలో అనేక సంస్థల్ని మేనేజ్ చేసి ఆ ప్రాంతంలో రైతుల ఆందోళనలను బయటకు రాకుండా ఆపగలిగానని చంద్రబాబు అనుకోవచ్చు. కానీ అరచేయి అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపగలుగుతామనుకోవడం భ్రమే.
  • రాజధాని నిర్మాణాన్ని తమకు సంబంధించిన, నచ్చిన విదేశీ కంపెనీలకు ఎలా అప్పగించాలా అన్న కుట్రపూరిత ఆలోచనతో చంద్రబాబు డ్రామాలు చేసి స్విస్ ఛాలెంజ్ విధానం ముందుకు తీసుకువచ్చారు. రాజధాని పరిధిని ఏకంగా 370 చ. కిమీలకు పెంచి రైతులకు మరింత అన్యాయం చేసేలాగా నిర్ణయం తీసుకున్నారు.
  • రాజధాని నిర్మాణం పేరిట చంద్రబాబు చేస్తున్న అన్యాయాలపై కోర్టులు కూడా స్పందిస్తున్నాయి. రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వటానికి అభ్యంతరం తెలియజేస్తూ 9.2 ఫారాలు ఇచ్చిన రైతులు,రాష్ట్రపతి ఆమోదముద్ర లేని సీఆర్‌డీఏ చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. 
  • రాజధాని నిర్మాణానికి చేపట్టిన భూసమీకరణ(ల్యాండ్ పూలింగ్)కు ప్రభుత్వం పిటీషనర్ల ఆమోదం ప్రభుత్వం కోరడం గానీ, పిటీషనర్ల ఆమోదం తెలపడంగానీ జరగనందున వారి  భూముల విషయంలో ప్రభుత్వం చట్టప్రకారం నిర్ణయం తీసుకోవచ్చని న్యాయస్థానం పేర్కొంది. అప్పటివరకు పిటీషనర్ల వ్యవసాయ కార్యకలాపాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోరాదని స్పష్టం చేసింది. 
  • ఎవరెన్ని చెప్పినా చంద్రబాబు నాయుడు గారికి మాత్రం చెవికెక్కడమేలేదు. రాజధాని రైతుల ప్రయోజనాలను కాలరాస్తూ తీసుకుంటున్న నిర్ణయాలనుంచి వెనక్కు మళ్లడం లేదు. పైగా రోజుకొక కుట్ర పన్నుతూనే ఉన్నారు.
  • అందుకే వైఎస్‌ఆర్‌సీపీ ఇలా ప్రకటిస్తోంది... ‘‘రెతుల దగ్గర నుంచి బలవంతంగా లాక్కుంటున్న భూములను, జగ్గీ వాసుదేవన్ లాంటి వ్యక్తులకు పంచుతున్న భూములను మా పార్టీ అధికారంలోకి రాగానే సమీక్షిస్తాం. రైతుల భూములు రైతులకు వెనక్కి ఇచ్చేస్తాం. ప్రభుత్వ భూములను పేదలకు పంచుతాం.’’
బలవంతంగా సేకరించిన భూములు తిరిగి ఇచ్చేయండి ః అన్నా హజారే
‘‘అన్నపూర్ణగా భాసిల్లుతున్న ఆంధ్రప్రదేశ్‌కు అప్రతిష్ట తేవొద్దు. రాజధాని నిర్మాణం కోసం ఏడాదికి రెండు, మూడు పంటలు పండే భూములను తీసుకుంటే దేశ ఆహార భద్రతకు తూట్లు పొడిచినట్టు అవుతుంది. రైతులెవరూ స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన దాఖలాలు లేవని వెల్లడవుతోంది. బలవంతంగా భూసేకరణ చేస్తామని బెదిరించడంతోనే వారు ప్రభుత్వానికి భూములు ఇచ్చినట్టు తేటతెల్లమైంది.  ఒత్తిడికి తలొగ్గి భూములు అప్పగించిన రైతులకు తక్షణం తిరిగి భూములు ఇవ్వాలి. పంట భూముల పరిరక్షణ కోసం రైతులకు దన్నుగా ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత గ్రామాల్లో పర్యటిస్తా. రెండు, మూడు పంటలు పండే భూములను పరిరక్షించాలి. వ్యవసాయోగ్యం కాని భూముల్లో రాజధాని నగరం నిర్మించండి. బంజరు భూముల్లో పరిశ్రమలు స్థాపించండి.  రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయోగ్యం కాని భూములను తక్షణమే వర్గీకరించండి. పాలేకర్ సూచించిన రీతిలో సేంద్రీయ వ్యవసాయ విధానాన్ని అమలు చేసి రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దండి. శివరామకృష్ణన్ కమిటీ చేసిన ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకుని రాజధాని నగరాన్ని నిర్మించండి. 
 
ఏకే 47 లేకుండానే రైతులను బాబు ఎన్‌కౌంటర్ చేస్తున్నారు ః మేథాపాట్కర్
‘‘రాజధాని పేరుతో ప్రభుత్వం రైతుల భూములను కబ్జా చేస్తోంది. ఏకే 47 లేకుండానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని గ్రామాల్లోని రైతులు, రైతు కూలీలను ఎన్‌కౌంటర్ చేస్తున్నారు. చంద్రబాబు ఇప్పటికైనా భూ సమీకరణ రాజకీయాన్ని ఆపితే మంచిది. ఇప్పటికైనా ప్రజలకు అబద్ధాలు చెప్పడం మాని వ్యవసాయానికి పనికిరాని ప్రభుత్వ భూముల్లో రాజధాని కట్టుకోవాలి. ప్రధాని మోడీ 2013 భూసేకరణ చట్టాన్ని సవరించాలని చూస్తుంటే.. చంద్రబాబు అందుకు సహాయం చేస్తున్నారు. రాజధాని నిర్మాణం చివరికి సింగపూర్ ప్రైవేట్ కంపెనీల చేతుల్లోకి పోతుంది. సింగపూర్ భాగస్వాముల ప్రయోజనం కోసమే భూములు లాక్కుంటున్నారు. బాధితులకు అండగా ఈ పోరాటాన్ని జాతీయ స్థాయికి తీసుకువెళతా. భూ సమీకరణను ఇంతటితో నిలిపివేయాలని ప్రధానికి లేఖ రాస్తా.’’
Back to Top