మందు‘బాబు’లకు కిక్


రాష్ట్రంలో ఇక సర్కారీ మద్యం
ఆదాయం పెంచుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం కొత్త ఆలోచన
వచ్చే జులై నుంచి కొత్త సర్కారీ విధానం: యనమల


హైదరాబాద్: ఇది మందు‘బాబు’లకు శుభవార్త.. మహిళలకు చేదువార్త..! ఇక ప్రభుత్వమే నేరుగా మద్యం వ్యాపారంలోకి దిగనుంది. రాష్ట్ర ఖజానాను నింపేందుకు మద్యం విక్రయాలు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జూలై 1 నుంచి ఇందుకోసం నూతన ఎక్సైజ్ విధానం ప్రవేశ పెడతామని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. ఇదే విధానం ప్రస్తుతం తమిళనాడులో అమలులో ఉంది. ఇకపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మద్యంషాపులు ఏర్పాటు చేస్తుంది. అందులో ఇద్దరు డీలర్లను నియమిస్తుంది. వారికి విక్రయాలపై కమీషన్ ఇస్తుంది. ఎంత ఎక్కువగా మద్యం విక్రయిస్తే అంత ఎక్కువగా కమీషన్ వస్తుందన్న మాట. అంటే డీలర్లలో పోటీ వాతావరణం సృష్టించి, ప్రజలకు మద్యాన్ని మరింత చేరువా చేయాలని సర్కారు యోచిస్తోంది. తద్వారా దండిగా లాభాలు సాధించాలన్నది దీని వెనక ఉన్న లక్ష్యం. ఇప్పటికే దేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో  మద్యం విక్రయాల్లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో కొనసాగుతోంది. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని కంకణం కట్టుకున్న చంద్రబాబు ఈ ఆలోచన చేసినట్లుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.3,733 కోట్లు మద్యం ద్వారా ఆర్జించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. జనవరి నాటికే రూ.2,998 కోట్ల ఆదాయం వచ్చింది. ఆదాయం పెంచుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టడం వదిలేసి, మద్యం ద్వారానే మరింత పిండుకోవాలని చూడటంపై రాష్ట్ర మహిళలు మండిపడుతున్నారు. తమిళనాడులో ప్రభుత్వ మద్యం షాపులకు అనుబంధంగా బార్లు ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉంది. ఇదే ఏర్పాట్లు ఇకముందు ఆంధ్రప్రదేశ్‌లోనూ జరగనున్నాయి.

రాష్ట్రాల వారీగా మద్యం ఆదాయ వివరాలు (రూ.కోట్లలో)
రాష్ట్రం               2011-12       2012-13     2013-14
ఆంధ్రప్రదేశ్      8,672              9,595         10,793
తెలంగాణ       7,322              8,160         9,482
తమిళనాడు     18,081              21,681       21,575
కర్ణాటక          8,345              11,070        12,828
కేరళ               6,352               7,250         7,498

   
ప్రతిపక్షంలో సంక్షేమం.. అధికారంలోకి వస్తే సంక్షోభం..!

అబద్దాలు చెప్పడంలో, ఆడినమాట తప్పడంలో, ప్రజలను మభ్యపెట్టడంలో చంద్రబాబుది అందెవేసిన చేయి అని ఇతర పార్టీల నాయకులు విమర్శిస్తుంటారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారం చేజిక్కగానే మరోలా వ్యవహరించడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య అంటుంటారు. ఇప్పడు బాబు మాటలు సరిగ్గా ఇలాగే ఉన్నాయంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. 2014లో ఎన్నికలు జరిగే వరకు రాష్ట్రంలో తెలుగుదేశంపార్టీ ప్రతిపక్షంలోనే ఉంది. ఎన్నికల్లో రైతు, మహిళా సంక్షేమానికి పలు హామీల వర్షం గుప్పించింది. ఇందులో భాగంగా చంద్రబాబు తాము అధికారంలోకి వస్తే బెల్టు షాపులు మూసేస్తామని ప్రకటించారు. ఇప్పడు అధికారంలోకి వచ్చారు. కనీసం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారా ? అదీ లేదు. పైగా ఇకపై ప్రభుత్వమే నేరుగా మద్యం విక్రయిస్తామని ప్రకటించి మహిళ నెత్తిపై మరో పిడుగు వేసింది. అంటే ప్రతిపక్షంలో ఉంటే ప్రజల సంక్షేమం గురించి మాటలు వల్లించే చంద్రబాబు, అధికారంలోకి రాగానే అవే పథకాలను సంక్షోభంగా భావించడం పరిపాటిగా మారింది.

 
అధికారంలో ఉంటే మద్యం వరదే..!


1994లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో మద్యనిషేధం అమలు చేస్తామన్న నినాదంతో అధికారంలోకి వచ్చింది. పార్టీలో అనూహ్య మార్పులు చోటుచేసుకుని ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని చంద్రబాబు చేజిక్కించుకున్నారు. ఆ తరువాత ఆయన అసలు రంగు బయటపడింది. రాష్ట్ర ఖజానా సంక్షోభంలో ఉందన్న సాకుతో మద్యం విక్రయాలకు పచ్చజెండా ఊపారు. అంటే ప్రజలను, మహిళలను దారుణంగా వంచించారు. అంటే ఇప్పడు రైతురుణమాఫీ, డ్వాకా రుణమాఫీ పేర్లతో ప్రజలను మోసగించినట్లే.. అప్పుడు ఎన్నికలకు ముందు మద్యానికి వ్యతిరేకంగా పోరాడినట్లు నటించి, సారాయిపై ఉద్యమం చేసి మహిళలను, యువతల ఓట్లకు గాలం వేయగలిగారు. ఇందుకు చంద్రబాబు అనుచర పచ్చపత్రిక ఆ బాధ్యతను స్వయంగా నెత్తికెత్తుకుంది.

 బెల్టుషాపులు, చీప్‌లిక్కర్లు అయ్యవారి చలవే..!

రాష్ట్రంలో బెల్టుషాపుల సంప్రదాయానికి శ్రీకారం చుట్టిన ఘనత చంద్రబాబు నాయుడిదే. మద్యం విక్రయాలపై సాధ్యమైనంత ఆదాయాన్ని పిండుకోవాలనుకున్న చంద్రబాబు ఆలోచనకు నిదర్శనాలు బెల్టుషాపులు. అంటే ఎక్కడో ఊరికి దూరంగా ఉండే వైన్‌షాపులనే నేరుగా ఇళ్ల మధ్యలో బెల్టుషాపులు పెట్టించి అందించిన ఘనుడు చంద్రబాబు. అల్పాదాయ వర్గాలను సైతం మద్యానికి బానిసలుగా మార్చిన రికార్డు కూడా చంద్రబాబుదే. ఆదాయానికి కొత్త మార్గాల అన్వేషణలోఉన్న బాబు మెదడులో మరో ఆలోచన చీప్‌లిక్కర్ల విక్రయం. 2001లో చీప్‌లిక్కర్లను బెల్టుషాపులు, కిరాణాకొట్ల ద్వారా విక్రయాలకు తెరలేపారు.

బాబు జమనాలో మద్యం ఆదాయం పెరిగిన తీరు ఇలా ఉంది...
సంవత్సరం    ఎక్సైజ్       సేల్స్‌టాక్స్   బీవరేజ్ కార్పొరేషన్ మొత్తం
                  ఆదాయం     ఆదాయం     ఆదాయంఆదాయం
 1997-98   349.11        437.93        100.43            887.47
 1998-99   924.01        906.53        134.0             1964.54
 2000-01   1242.69      1137.66      213.05           2593.67
 2001-02   1651.9        1296.33       222.03           3170.26
 2002-03   1856.46      1375.81      246.99           3479.26
 2003-04   1914.98      1410.84      246.5           3572.32

Back to Top