అంచ‌నాలు మించిన ఉప ఎన్నిక

- మహిళా ఓటర్ల చైత‌న్యం జ‌గ‌న్ ప్ర‌చార ఫలిత‌మే
- చ‌రిత్ర‌లో నిలిచే భారీ మెజారిటీ దిశ‌గా ఫ‌లితాలు
- వైయ‌స్ార్‌సీపీకే లాభం అంటున్న విశ్లేష‌కులు
రెండు నెల‌లుగా ఉత్కంఠ రేపిన నంద్యాల ఉప ఎన్నిక బుధ‌వారం ముగిసింది. విశ్లేష‌కుల అంచ‌నాల‌కు అంద‌ని విధంగా పెరిగిన పోలింగ్ శాతం వైయ‌స్ార్‌సీపీకి లాభించనుంది. నంద్యాల చ‌రిత్రలో ఎప్పుడూ లేనంత‌గా 80శాతానికి మించి పోలింగ్ శాతం న‌మోదు కావ‌డం ఫ‌లితాల‌పై మ‌రింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. మ‌రీ ముఖ్యంగా బుధ‌వారం ఉద‌యం 7 గంట‌ల నుంచే మ‌హిళ‌లు పోలింగ్ బూత్‌ల‌కు పోటెత్త‌డం విశేషం. పోలింగ్ స‌ర‌ళిని ప‌రిశీలిస్తే అనుకున్న‌ట్టుగానే గ్రామీణ ప్రాంతాలో్ల పోలింగ్ శాతం దాదాపు 90 శాతం దాటిపోయిన‌ట్లు తెలుస్తుంది. ఇది వైయ‌స్ార్‌సీపీకి మంచి ప‌రిణామంగా క‌నిపిస్తుంది. నంద్యాల రూర‌ల్‌, గోస్పాడు మండ‌లాల్లో ఓటు హ‌క్కును వినియోగించుకునేందుకు జ‌నాలు బారులుదీరారు. పురుషుల కంటే మ‌హిళా ఓట‌ర్ల‌లో చైత‌న్యం చూస్తే మెజారిటీ కూడా భారీగానే ఉన్న‌ట్టు తెలుస్తుంది. పురుషుల కంటే మ‌హిళ‌లే ఎక్కువ‌గా ఓటు హ‌క్కును వినియోగించుకోవ‌డం ఈ ఉప ఎన్నిక ప్ర‌త్యేక‌త‌. 13 రోజులుగా ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ నిర్వ‌హించిన ప్ర‌చారానికి మ‌హిళ‌ల నుంచి వేశేష స్పంద‌న క‌నిపించింది. ఇప్ప‌డు అదే స్పంద‌న మ‌హిళ‌ల‌ను పోలింగ్ కేంద్రాల‌కు ర‌ప్పించ‌డంలో ఉప‌యోగ‌ప‌డింద‌ని తెలుస్తుంది. అదే గ‌నుక జ‌రిగితే వైయ‌స్ార్‌సీపీ మెజారిటీ నంద్యాల చ‌రిత్ర‌లో నిలిచిపోతుంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. 
Back to Top