గిరిజన గూడెల్లో ఏం జరుగుతోంది..!


 

కొంత కాలంగా విశాఖ ఏజన్సీ ప్రాంతం వార్తల్లో
నిలిచింది. అక్కడ బాక్సైట్ తవ్వకాలు జరుగుతాయన్న వార్తలతో మన్యం ఒక్కసారిగా
ఉలిక్కి పడింది. గిరిజనుల గుండెల్లో ఆందోళన మొదలైంది. అడవి పుత్రులకు అప్పటి నుంచి
అండగా నిలిచింది వైఎస్సార్సీపీ నే.

విశాఖ ఏజన్సీలో బాక్సైట్ నిక్షేపాలు ఉన్నాయని
ఎప్పుడో గుర్తించారు. వీటిని తవ్వుకొనేందుకు గతంలో కొంత మేర ప్రయత్నాలు జరిగాయి.
అయితే చంద్రబాబు మొదటి సారి అధికారంలోకి 
వచ్చినప్పుడు వీటిని తవ్వుకొనే మార్గాలపై పారిశ్రామిక వర్గాలతో చర్చలు
జరిపించారు. ఇందుకు సంబంధించి మార్గం సుగమం చేశారు. తర్వాత ప్రభుత్వాల హయంలో ఇదే
బాటలో కొంత మేర కసరత్తు నడిచింది. తర్వాత అక్కడితో ఆగిపోయింది.

తిరిగి చంద్రబాబు పదేళ్ల తర్వాత అధికారం
చేపట్టాక ఆయన కన్ను మళ్లీ విశాఖ ఏజన్సీ మీద పడింది. బాక్సైట్ ను తవ్వుకొనేందుకు
ప్రైవేటు పారిశ్రామిక వేత్తలకు అనుమతిస్తే అన్ని విధాలా లాభం ఉంటుందని ఆయన భావించారు.
ఇందులో రాజకీయ కోణం కూడా ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఉత్తరాంధ్ర లోని అన్ని గిరిజన
నియోజక వర్గాల్లో వైఎస్సార్సీపీ నాయకులే ఎమ్మెల్యేలుగా నిలిచారు. అన్ని చోట్ల
తెలుగుదేశాన్ని తిరస్కరించారు. దీన్ని మనస్సులో పెట్టుకొన్న చంద్రబాబు అధికారంలోకి
వచ్చాక ప్రతీకారం తీర్చుకోవాలని భావించారు. ఇందుకు బాక్సైట్ తవ్వకాల్ని మార్గంగా
ఎంచుకొన్నారు. ఇందుకు అనుగుణంగా ఆయన ప్రభుత్వం తవ్వకాల్ని అనుమతిస్తూ జీవో కూడా
విడుదల చేయించింది.

వాస్తవానికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే
చంద్రబాబు బాక్సైట్ తవ్వకాల్ని వ్యతిరేకించారు. దీని మీద గవర్నర్ కు లేఖ కూడా
రాశారు. గిరిజనుల జీవితాల్ని అతలాకుతలం చేసే నిర్ణయాలు వద్దంటూ సుద్దులు పలికారు.
కానీ, అధికారం చేపట్టాక మాత్రం ఆయన అసలు స్వరూపాన్ని బయట పెట్టారు. పైగా గిరిజన
సలహా మండలి ఏర్పాటు చేయకుండా ఆయన కాలం వెళ్లబుచ్చుతున్నారు. గిరిజన సలహా మండలి
ఏర్పాటైతే అందులో ఎక్కువ మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఉండే అవకాశం ఉన్నందున
దానికి మోకాలడ్డుతూ వచ్చారు.

చంద్రబాబు కుట్రల్ని గమనించిన వైఎస్సార్సీపీ
ప్రజల్ని చైతన్య పరుస్తూ వచ్చింది. బాక్సైట్ తవ్వకాల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న
గిరిజనులకు అండగా నిలిచింది. తవ్వకాలకు చంద్రబాబు అనుమతిస్తూ జీవో జారీ చేసిన
వెంటనే ప్రజల తరపున పోరాటాన్ని ఎంచుకొంది. పెద్ద ఎత్తున ఉద్యమం ఎగసిపడుతుండటంతో
చంద్రబాబు ప్రభుత్వం వెనక్కి తగ్గింది. జీవో సంగతి ముఖ్యమంత్రికి తెలీదంటూ కొత్త
నాటకాలు మొదలు పెట్టింది. అయినప్పటికీ తవ్వకాల మీద సంకేతాలు పంపుతూనే ఉంది. తాజాగా
చంద్రబాబు మాట్లాడుతూ ప్రజల ప్రయోజనాల్ని గమనిస్తూ బాక్సైట్ తవ్వకాలు సాగిస్తామని
వెల్లడించారు. దీన్ని బట్టి చూస్తే ఎప్పటికైనా బాక్సైట్ తవ్వకాలు సాగించాలన్నదే తమ
లక్ష్యంగా చంద్రబాబు చెప్పకనే చెబుతున్నారు.

ఈ పరిస్థితుల్లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ విశాఖ
ఏజన్సీ లో పర్యటిస్తున్నారు. మన్యం లో గిరిజనుల తరపున వైస్సార్సీపీ సాగిస్తున్న
పోరాటానికి అండగా ఈ పర్యటన ఏర్పాటైంది. గిరిజన సోదరులకు సహాయ సహకారాలు
అందచేసేందుకు దీన్ని ఉద్దేశించారు.

 

Back to Top