అమ‌రావ‌తి కాదు..భ్ర‌మ‌రావ‌తి!

-  అమరావతి  క‌నిపించ‌ని రాజ‌ధాని ప‌నులు
 -  అడుగడుగునా బాబు అబద్ధాలే  
- బాబు తన అనుభవాన్ని దోచుకోవడానికి..దాచుకోవడానికే  
-  భూములు లాక్కునే  అధికారం బాబుకు ఎవరిచ్చారు
- లంక భూములు, అసైన్డ్ భూములకు పరిహారం రాదని భయపెట్టించారు
  భూములిచ్చిన రైతుల‌కు ముష్టి వేసినట్లు వెయ్యి గజాలేనా? 

అమ‌రావ‌తి:  ఏపీ  రాజధాని అమరావతి. పేరు చాలా బాగుంది. కాని అక్కడి  ప్రజల జీవితాలే  బాగాలేవు. అక్కడ ప్రజల బతుకులే బాగాలేవు. రైతుల దగ్గర నుంచి రైతు కూలీలు దాకా అందరి కళ్లల్లో కన్నీళ్లే. అక్కడ ఎత్తైన భవనాలు కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ల్లో మాత్రమే  కనిపిస్తాయి. నేటి అమరావతి ఒకప్పుడు పచ్చని పంటలకు  నెలవు..ఇప్పుడు అంతా బీడువారిన భూములే. ఎవర్నీ కదిలించినా కన్నీళ్లు రాలుతాయి. ఎవర్నీ  పలకరించినా దుఃఖం కట్టలు తెచ్చుకుంటుంది. ఏపీ రాజధాని అమరావతి నేడు అవస్థల అమరావతి. అమరావతి అంటేనే అమ్మోరావతి అనాల్సిన పరిస్థితి. ఉండవల్లిలో జరిగిన సభలో అమరావతి రైతుల కష్టాలను వైయ‌స్ జగన్ కళ్లకు కట్టారు. 

అరచేతిలో స్వర్గం సామెత విన్నాం కదా...అరచేతిలో అమరావతి అనేది కొత్త సామెత. చంద్రబాబు పనుల నుంచి పుట్టుకొచ్చిన సామెత ఇది.  అమరావతి అభివృద్ధి అదిగదిగో అమరావతి అన్నట్లు తయారైంది. అవిగో బిల్డింగ్‌లు, అవిగో ఆట స్థలాలు..అదిగో అసెంబ్లీ, ఇవిగో ఎమ్మెల్యే క్వార్టర్స్‌ .. అన్ని అదిగోనే..రియల్‌గా  మాత్రం  కనిపించవు. అనుభవం ఉందని  ప్రజలు ఓట్లు వేస్తే..ఆ అనుభవాన్ని దోచుకోవడానికి..దాచుకోవడానికి బాబు ఉపయోగిస్తున్నారని ప్రతిపక్ష నేత జగన్‌ విమర్శిస్తున్నారు.   ఇక అమరావతికి భూములు ఇచ్చినవారి పరిస్థితి దారుణాతిదారుణం..ఇక భూములు లాక్కున్నవారి బాధ వర్ణనాతీతం. వైఎస్‌ జగన్‌ ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ...అమరావతిలో పర్యటిస్తున్న సమయంలో రైతులు, రైతు కూలీలు  తమ బాధలు  చెప్పుకుని కన్నీరు పెట్టుకున్నారు. 

పట్టా భూములతోపాటు ..అసైన్డ్ భూములను కూడా లాక్కున్నారు. దశాబ్ధాలుగా పంటలు పండించుకుంటున్న అసైన్డ్ భూములను అడ్డంగా లాక్కున్నారు. ఇవ్వకపోతే బెదిరించారు. పోలీసులతో భయపెట్టించారు. పంటలకు నిప్పు పెట్టించారు. 
పాలకులను చూస్తే ప్రజలకు భరోసా కలగాలి..కాని తమకు భయమేస్తుందని అమరావతి  ప్రజలు కన్నీరు పెట్టుకున్న సందర్భాలు అనేకం.దీన్ని నిజం చేస్తూ..అమరావతిలో జగన్ పాదయాత్ర సంద‌ర్భంగా  ప్రభుత్వంపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి 
భూములు తీసుకునేటప్పుడు కేజీ నుంచి పీజీ దాకా  ఉచితంగా చదివిస్తానని పాలకులు హామీ ఇచ్చారని..ఆ హామీలు కృష్ణా నదిలో కొట్టుకుపోయాయని స్థానికులు చెబుతున్నారు. చంద్రబాబు నమ్మించి మోసం చేశారని వాపోతున్నారు. అమరావతిలో అడుగుడుగునా టీడీపీ ప్రభుత్వ అబద్ధాలే కనిపిస్తాయని రైతులు చెబుతున్నారు.  

అమరావతిలో చంద్రబాబు ఓ పాలకుడిలా కాకుండా రియల్ ఎస్టేట్ బ్రోకర్‌లా వ్యవహరించారని ప్రతిపక్ష నేత జగన్ ఇప్పటికే పలుమార్లు విమర్శలు చేశారు. స్థానిక రైతులను  విస్మరించి..తన వారికి మాత్రమే లబ్ధి  చేకూరేలా బాబు వ్యవహరించారని జగన్‌ ఆరోపించారు. 
అమరావతిని పాలకులు  ప్రజారాజధానిగా కాకుండా.. టీడీపీ రాజధానిగా మార్చేశారు.  
Back to Top