మా ఆడాళ్ల ఓట్లన్నీ ఈసారికి జగన్‌కే


నీకేందమ్మా పింఛన్‌ వెయ్యి రూపాయలిస్తుంట్రి, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తిరి... మీకు రుణ మాఫీ జరిగిందాయె.. బంగారు మీద రుణాలిస్తిరి.. వాటర్‌ ప్లాంట్‌ పెట్టి 20 లీటర్లు మినరల్‌ వాటర్‌ రెండు రూపాయలకు ఇస్తుంట్రి.. రేషన్‌ షాపుల్లో చంద్రన్న సరుకులు దొరుకుతున్నాయి.. ఏదైనా ప్రమాదం జరిగితే చంద్రన్న బీమా ఉందాయె.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పిల్లలను చదివిస్తున్నారు... ఆరోగ్యం బాగలేనప్పుడు పైసా ఖర్చు లేకుండా చూపించుకుంటున్నారు.. మరో డౌట్‌ లేకుండా ఈసారి కూడా మీ ఓటు చంద్రబాబుకే వేస్తారు కదా.. అమెరికా నుంచి వచ్చిన ఓ కు్రరాడు వాళ్ల పక్కింటావిడతో అన్నాడు... అంతే ఆవిడకు కోపం నషాళానికంటింది. అమెరికాలో ఉండి టీవీల్లో చూసినవన్నీ నిజమనుకుంటుండవా... నువ్వు చెప్పిన వాటిల్లో ఏ ఒక్కటీ ఇక్కడ జరగడం లేదు. పింఛన్‌ అందరికీ ఒక నెల వస్తే ఇంకో నెల రాదు..  డ్వాక్రా రుణాల మాఫీ, పావలా వడ్డీకే రుణాలు గెలిచిన తర్వాతే మరిసిపోయుండు.. పది వేలు ఇస్తానండు.. అదీ రెండుసార్లే ఇచ్చి చేతులు కడిగేసుకుండు. రుణ మాఫీ అంటవా.. నాలుగెకరాల పొలముంటే ఎకరాకే వస్తాంది. ఎందుకట్టా అంటే.. ఈఆర్‌వో కళ్లు తేలేస్తుండు. మినరల్‌ వాటర్‌ ఎక్కడిస్తుండో మీ అమ్మనడుగు. ఈ ఫ్లోరేడు నీళ్లు తాగలేక అందరం తలో ఇంత వేసుకుని వాటర్‌ ప్లాంట్‌ ఊళ్లో పెట్టించుకుళ్లా.. నీ అమ్మ చెప్పలా.. రేషన్‌ దుకాణం మొహ జూసి మూడేళ్లు దాటిపాయె. ఆ మారాజున్నప్పుడు 9 రకాల సరుకులు 190 ఇచ్చిండు.. మా ఖర్మ కాలి ఈ నంగనాసోడు వచ్చిండు కనీసం బియ్యం కూడా దొరకడం లేదు. ఏవో ఏలు ముద్ర మిసన్లు తీసుకొచ్చి లైన్లు నిలబెడుతున్రు. మోకాళ్ల నొప్పులతో నిలబడలేక ఆ ఇచ్చే బియ్యం కూడా తీసుకోవడం మానేసిన. మొన్న మీ మామకు కిడ్నీల్లో రాళ్లున్నయంటే హైదరాబాద్‌లో మంచి ఆస్పత్రులున్నాయని పెద్ద మనుసులు సెబితే ఆరోగ్య శ్రీ కార్డు పట్టుకుని వెళ్లినం. అక్కడాసుపత్రాళ్లు సెప్పుతో కొట్టినట్టు అవమానం చేసి పంపితిరి. నోట మాట రాలేదు మీ మావకి. ఆయన మొహం జూస్తే నాకు కళ్లెమ్మట నీళ్లు సుడులు దిరిగినయ్‌.. ఆరోగ్యశ్రీ కార్డులు వాళ్ల రాష్ట్రంలో సెల్లవని పంపిన్రు. ఉసోరుమని ఇక్కడికే వచ్చి ఆస్పత్రి డబ్బులు పెట్టి సూపించుకుంటున్నడు. ఆయనకు భూమ్మీద నూకలు ఇంకా ఉండబట్టి సరిపోయున్నది కానీ.. లేకపోతే నేనొక్కదాన్నే మిగిలిపోయేదాన్ని. అయినా మీలాంటి సదువుకున్నోళ్లు కూడా టీవీల్లో, పేపర్లల్లో వచ్చినవన్నీ నిజమని నమ్మేత్తే ఎట్టా. మాకు సెప్పాల్సింది బోయి మీరే మోసపోతార. రాష్ట్రం ఇడిపోయిందని సెంద్రబాబుకు ఓటేసినం కానీ.. ఆయన మేధావి అని కాదు. ఆయన పనితనం తెలిసిపోయింది. అవకాశాన్ని వాడుకుని డబ్బులు సంపాదించుకుండు.. ఈ నాలుగేళ్లలో మా బతుకులు ఏం మారలా. పెబుత్వం ఉందంటే ఉంది.. అంతే. మాకు ఏ పెయోజనం లేదు. మనూళ్లో జన్మభూమి కమిటీలు సెప్పిందే ఇక్కడ జరగాలి. ఆళ్లు చిన్నోళ్లని యేధిస్తున్రు. అందుకే మేమంతా ఒకటే డిసైడయ్యినం.. ఈసారి రాజన్న బిడ్డకే ఓటేసి గెలిపించుకుంటాం. పాపం బిడ్డ ఎండల్లో వానల్లో కష్టపడుతుండు. అప్పుడు రాష్ట్రం ఇడిపోకుండా పోరాడిండు.. ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్లుగా తిరుగుతుండు. జైల్లో బెట్టినా భయపడలా.. నిజంగా ధైర్నమంతుడు. మనకోసం ఏదైనా చేయగలడని మా ఆడాళ్లంతా నమ్ముతున్నం. రాష్ట్రమంతా తిరిగి సమస్యల మీద అవగాహన పెంచుకుండు. రాజÔó ఖర్‌రెడ్డి మాదిరిగా చేస్తాడని మా విశ్వాసం. అందుకే ఈసారికి మా ఓటు జగన్‌కే. 
Back to Top