‘ఆది’ని భర్తరఫ్‌ చేయాల్సిందే

– ఆయన వ్యాఖ్యలు ఎస్సీలను కించపరచడమే
– ముందుగా ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పాలి
– చంద్రబాబు బాటలోనే మంత్రులు, ఎమ్మెల్యేలు

అధికారంలో ఉంటే చాలు ఏం మాట్లాడినా చెల్లుబాటవుతుందని అనుకుంటున్నారు టీడీపీ నాయకులు. అధికారంలో ఉన్నందుకు ప్రభువుల్లా ఫీలవుతున్నారు. సింహాసనం మీద కూర్చుని రాజ్యాన్ని ఏలుతున్న పాలకుల్లాగా.. ప్రజలు వాళ్ల కింద పనిచేసే బానిసల్లాగా.. అధికార అహంకారంతో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే పోలీసులను పంపి అరెస్టు చేయించవచ్చనే ధీమా కాబోలు ఒకరు మార్చుకుని ఒకరు ఎస్సీ, ఎస్టీల మీద విరుచుకుపడిపోతున్నారు. యథా రాజా తథా ప్రజా అన్నట్టుగా చంద్రబాబు బాటలోనే మంత్రులు కూడా అణగారిన కులాల మీద అధికార మదంతో ప్రతాపం చూపిస్తున్నారు. 

నిన్న ముఖ్యమంత్రి.. నేడు మంత్రి
మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు ఎస్సీ ఎస్టీలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపాయి. ఎస్సీలుగా పుట్టాలని ఎవరు మాత్రం కోరుకుంటారు. అని ఎస్సీలను తక్కువగా చేసి మాట్లాడి వారి ఆగ్రహానికి గురయ్యాడు. అగ్రకుల అహంకారంతో ఆనాడు బాబు చేసిన వ్యాఖ్యలు ఆయన అధికార మదానికి అద్దం పట్టాయి. రాష్ట్రంలో అన్ని కులాలను సమాన దృష్టితో చూసి వెనకబడిన కులాల అభివృద్ధికి మరింత కృషి చేయాల్సింది పోయి వారిని ఇంకా అణగదొక్కేలా మాట్లాడటం బాబు  పిచ్చి, అహంకారానికి నిదర్శనం. ఈ మంటలు చల్లారకముందే చంద్రబాబు మళ్లీ గిరిజనుల మీద తన పిచ్చి ప్రతాపం చూపించాడు. గిరిజనులకు తెలివి ఉండదు.. వారికి చదువు రాదని వారినీ వదల్లేదు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అని ముఖ్యమంత్రే అలా మాట్లాడితే మంత్రులేమైనా తక్కువ తింటారా. మంత్రి ఆదినారాయణరెడ్డి నిన్న జమ్మలమడుగులో జరిగిన ఓ కార్యక్రమంలో తన వికృతరూపం ప్రదర్శించారు. ఎస్సీల మీద తన అక్కసు వెళ్లగక్కారు. జరుగుతున్న కార్యక్రమానికి చేస్తున్న పనికి సంబంధం లేకుండా ఎస్సీల మీద మాటలతో విరుచుకుపడ్డారు. మంత్రినని విచక్షణ కూడా మరిచి ఎస్సీలు శుభ్రంగా ఉండరు.. సరిగా చదవరు  అని అహంకారం ప్రదర్శించారు. పట్టాలుండవు అని అంత ఓపెన్‌గా మాట్లాడిన మంత్రి ముఖ్యమంత్రితో మాట్లాడి ఎస్సీలందరికీ ఇళ్ల పట్టాలు ఇప్పించొచ్చుగా. ముఖ్యమంత్రి, తర మంత్రులంతా కలిసి అమరావతిలో దోచుకున్న దాంతో వచ్చిన డబ్బుతో ఇంటికి మూడెకరాలు కొనిపించి ఇవ్వొచ్చుగా. ఎస్సీలు వెనకబడి ఉన్నప్పుడు అధికారంలో ఉండి వారి కోసం పనిచేయాలే కానీ ఇలా చిన్న చూపు చూస్తూ మాట్లాడటం నిజంగా దారుణం. ఎవరైనా ఖండించాల్సిన విషయం. దీనికి నైతిక బాధ్యతగా చంద్రబాబు ఎస్సీలకు క్షమాపణ చెప్పి తీరాలి. ఆనాడే చంద్రబాబు బాధ్యతగా వ్యవహరించి ఉంటే ఇలా రోజుకొకరు నోరు పారేసుకునేవారు కాదు. 
Back to Top