అధినేతకు బంట్లు...అధికారానికి తూట్లు...


ఏపీలో ఏదైనా జరుగుతుంది. దేవుళ్లకు బదులు దెయ్యాల కు పూజలు జరుగుతాయి.  దేవాలయాల్లోనే తాంత్రిక శక్తులు ప్రవేశిస్తాయి.  రావణాసురురావణాసురులు, భస్మాసురులు, బకాసురులు అధికారం చలాఇస్తుంటారు. రాజ్యాంగ హక్కులు, మానవ హక్కులు, ప్రజాస్వామ్యం అనే మాటలకు ఆంధ్రాలో తావులేదు.  
ఎక్కడైనా స్పీకర్, గవర్నర్ అధికారపక్షానికి, ప్రతిపక్షానికి సమన్యాయం చేసేలా ఉంటారు. కానీ ఏపీలో మాత్రం రాజ్యాంగ విరుద్ధంగా స్పీకర్ ముఖ్యమంత్రి కటౌట్ కి పాలాభిషేకం చేసి, హారతులిస్తుంటారు. ఓటు కోసం కోట్లు ఇస్తూ దొరికిపోయినా సరే స్వయంగా గవర్నర్ రాయబారాలు నడిపి ఆ ముఖ్యమంత్రికి కొమ్ము కాస్తుంటారు. 

గౌరవనీయమైన బాధ్యతాయుతమైన పదవిలో ఉండి స్పీకర్ కోడెల ముఖ్యమంత్రిపై తన అభిమానాన్ని ప్రత్యేకంగా చాటుకోవడం దేనికి నిదర్శనం? పక్క పార్టీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేసినప్పుడు, ప్రతిపక్ష నాయకుడిని హౌస్ లోనే దుర్భాషలాడిన ప్పుడు, ఓ మహిళ శాసన సభ్యురాలిని అవమానించినప్పుడు ఈ స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అధికార పార్టీపై అభిమానం చూపించి సభలో స్పీకర్ పదవికి ఉండాల్సిన గౌరవాన్ని మంట కలిపారు కోడెల.   శాసనసభలో కోడెల ఎప్పుడు ఏకపక్షంగానే వ్యవహరించారు. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రికి తాను దాసానుదాసుడిని అని బహిరంగంగా చెప్పుకుంటున్నారు. పార్టీ వేదికల మీద రాజకీయ ప్రసంగాలు, అధికార పార్టీకి మాత్రమే అనుకూలమైన వ్యవహారాలు ఓ స్పీకర్ పదవిలో ఉన్న వ్యక్తి చేయాల్సినవి కాదు.  స్పీకర్ అంటేనే నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ సభలో అధికార ప్రతిపక్షాల మధ్య సమతూకం సమన్యాయం ఉండేలా చూడాలి. కానీ కోడెల స్పీకర్గా సభలో అడుగు పెట్టిన రోజు నుంచి వివక్షాపూరితంగా వ్యవహరిస్తున్నారు.  గవర్నర్ సైతం చంద్రబాబుకు వెన్నుదన్నుగా నిలిచి, బాబు అవినీతిని కేంద్రం దృష్టికి పోనీయకుండా శాయశక్తులా కృషి చేస్తున్నారు. గవర్నర్ నరసింహన్, స్పీకర్ కోడెల ఈ ఇద్దరూ వారి వారి పదవులకు కంటే ప్రభుత్వ అధినేతకే అనుకూలంగా పని చేస్తున్నారు... ఇది నేటి  ఏపీ దుస్థితి.
Back to Top