అడవిబిడ్డలకు ఆధారమేది?

 

అధికారంలోకి వచ్చేందుకు
అన్ని వర్గాలకూ హామీలిచ్చిన బాబు గిరిపుత్రులనూ వదల్లేదు. వారి సామాజిక, ఆర్థిక జీవితాన్ని మారుస్తానని, బ్రతుకులను బంగారం చేస్తానని
నమ్మబలికాడు చంద్రబాబు. ఈ అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం రోజున గిరిజనులకు ఇచ్చిన
హామీలను ఒక్కటి కూడా నెరవేర్చని చంద్రబాబు వైఖరి గురించి ప్రతి ఒక్క గిరిజనుడూ గుర్తు
చేసుకుని ఆగ్రహిస్తున్నాడు.

బాబు పాలనలో గిరిపుత్రలకు
వంచన

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న
గిరిజనులకు బాబు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ నెరవేరలేదు. దుర్భర పరిస్థితుల్లో వారి జీవితాలు సాగుతున్నాయి. కనీస సౌకర్యాలు లేక
గిరిపుత్రులు అల్లాడుతున్నారు. తాగునీరు, రోడ్లు, రవాణా, వైద్య సదుపాయాలు లేక గిరిజన కుటుంబాలు తల్లడిల్లుతున్నాయి. అధికారంలోకి వచ్చాక
పక్కారోడ్లు వేయిస్తా అని, ఇళ్లు నిర్మిస్తా అని, అర్హులకు భూములు ఇస్తా
అని చెప్పిన టిడిపి నాయకుడు పాలనా పగ్గాలు చేపట్టాక ఆ హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదు. సరైన రోడ్లు లేక, రవాణా సౌకర్యాలు లేక
ఆదివాసీలు నానా అవస్థలు పడుతున్నారు. గర్భిణులను డోలీల్లో తరలించడం, వాగులు దాటించడం వారి
దుర్భర పరిస్థితికి అద్దం పడుతోంది. గిరిజన ప్రాంతాల్లో వైద్య సదుపాయం లేక కిలోమీటర్ల దూరం
రోడ్లు, రవాణా లేక వారు సమాజానికి దూరంగా ఉండిపోతున్నారు. సీజన్ లో వచ్చే విష
జ్వరాలు, వ్యాధుల బారిన పడి, సరైన చికిత్సకు నోచుకోని వారెందరో! డయేరియా, మలేరియా, డెంగీలాంటి వ్యాధులకు
ఆరోగ్య బీమా పథకం వర్తింప చేస్తామన్న హామీ కూడా అతీగతీ లేకుండా పోయింది. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు
లేక గిరిజనులు దూరంగా పట్నాల్లో ఉన్న ఆసుపత్రులకు పరుగులు పెట్టాల్సి వస్తోంది. ప్రతి జిల్లాలో గిరిజన
భవన్ అని, గిరిజన యూనివర్సిటీ అని చెప్పిన బాబు ఆ విషయాలను గాలికొదిలేసాడు. 50ఏళ్లు నిండిన గిరిజనులకు
వెయ్యి రూపాయల పింఛన్ అని చెప్పినా అది అమల్లో అందరికీ అందడం లేదు. గిరిజన సంస్కృతిని పరిరక్షించే
ఆలయ పూజారులకు నెలకు 5000 గౌరవ వేతనం అని చెప్పారు, ప్రతి గిరిజన కుటుం
బానికీ లక్షా యాభై వేలతో ఉచితంగా ఇల్లు నిర్మాణం అన్నారు. గిరిజన ఉత్పత్తులకు
మార్కెటింగ్ సదుపాయాలు అని ఊదరగొట్టారు. చివరకు వారికి స్వచ్ఛమైన తాగునీరు, సాగునీరు కూడా దొరకని
దుస్థితి. చంద్రబాబు సర్కార్ లో ఒక్క గిరిజన మంత్రి కూడా లేరంటేనే వారిపై చంద్రబాబుకు
ఉన్న చులకన భావం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. చాలా చోట్ల గిరిజనులు వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులను
గెలిపించారు. అయితే ఫిరాయింపుల్లో భాగంగా కొత్తపల్లి గీత వంటివారిని టిడిపిలోకి చేర్చుకున్న
చంద్రబాబు, నెమ్మదిగా తన అక్కసు బైటపెట్టడం మొదలెట్టాడు. గిరిజనులకు ఎలాంటి హామీలూ
నెరవేర్చకపోగా ఆ నాయకులను పార్టీ కార్యక్రమాలకు దూరం పెట్టాడు.

అడవిబిడ్డలకు అండగా
వైఎస్సార్

ఆరులక్షల ఎకరాల్లో గిరిజనులకు
భూమి హక్కు కల్పించి గిరిపుత్రుల పాలిట కల్పతరువు అయ్యారు వైఎస్సార్. ఏళ్ల తరబడి పోడు వ్యవసాయం
చేసుకునే గిరిజనులను అటవీ శాఖా అధికారులు వేధింపులకు గురి చేస్తుంటే, 31,961 మందిరి అటవీ హక్కు పత్రాలు
పంపిణీ చేసి అడవి బిడ్డలకు రక్షణ కల్పించారు. లక్షలాది ఎకరాల భూ పంపిణీ చేయగా, వాటిపై కోట్ల మేర రైతుబంధు
సాయం కూడా వారికి లభించింది. ఆ మహానేత అడుగుజాడల్లోనే వైఎస్ జగన్ సైతం గిరిపుత్రులపై
వరాల జల్లు కురిపించారు. నవరత్నాలతో గిరిజనుల బతుకుల్లో కొత్త కాంతులు నింపుతామన్నారు. 500 జనాభా ఉన్న గూడాలను
పంచాయితీలుగా మారుస్తామని చెప్పారు. పొలాల్లో ఉచితంగా బోరులు, ఏటా పెట్టుబడికి 12500, ఉచిత విద్యుత్, పేదవారికి భూమి అందిస్తామని
హామీ ఇచ్చారు. ప్రతి ఐటిడిఎ పరిధిలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, మెడికల్, ఇంజనీరింగ్ కాలీ కట్టిస్తామని
చెప్పారు. గిరిజన తండా, గూడెంలలో ప్రతి ఇంటికీ 200 యూనిట్ల వరకూ ఉచిత కరెంటు
ఇస్తామన్నారు. 

Back to Top