అబివృద్ధి పోటీ మోదీ తోటి


ప్రధాని నరేంద్రమోదీ ఫిట్ నెస్ ఛాలెంజ్ విసిరితే చంద్రబాబు మోదీకి అభివృద్ధి చాలెంజ్ విసిరాడు. మనం ఫిట్ గా ఉంటే దేశం ఫిట్ గా ఉంటుంది అనే నినాదంతో మోదీ ఛాలెంజ్ సాగుతోంది. నాలుగేళ్లలో దేశం, రాష్ట్రం మధ్య అభివృద్ధి గురించి చర్చించేందుకు సిద్ధంగా ఉన్నా అంటూ చంద్రబాబు కేంద్రానికి సవాల్ విసిరాడు. మోదీ ఆ సవాల్ స్వీకరిస్తారో లేదో కానీ అసలు మన ఎపిలో అభివృద్ధి గురించి చంద్రబాబు చెప్పుకోవాల్సి వస్తే ఏం చెబుతాడో చూద్దాం. 

దేశ రాజధాని నగరం దిల్లీ కంటే రెండింతల విస్తీర్ణంలో ఎపీ రాజధాని అమరావతి ఉంది. కానీ అది అందరికీ కనిపించదు. నార్మన్ పోస్టర్ ఇంకా టీడీపీ ప్రభుత్వానికి మాత్రమే కనిపిస్తుంది. ఇదో నూతన టెక్నాలజీ. 
విదేశాలకు టూర్లు వేయడంలోనూ చంద్రబాబు మోదీతో పోటీ పడి అభివృద్ధి సాధించారు. ఆసియా, ఆఫ్రికా, నార్త్ అమెరికా, ఆస్ట్రేలియా, యూరొప్ ఇలా ప్రపంచంలో అన్ని మూలలూ మోదీ చుట్టొచ్చినట్టే చంద్రబాబు సైతం కొరియా, సింగపూర్, దుబాయ్, లండన్, జపాన్, చైనా ఇలా దేశదేశాలూ చుట్టొచ్చారు. 
ప్రధానిగా మోదీ పెట్టుబడుల ఎం.ఓ.యూలకు దీటుగా చంద్రబాబు ఎం.ఓ.యూలు ఉన్నాయి. కాకుంటే అవి కాగితాల మీద మాత్రమే ఉంటాయి. 
మోదీ సులభతర వాణిజ్యం అన్నాడు. చంద్రబాబు సింగపూరు వ్యాపారం అన్నాడు.
మోదీ మేకిన్ ఇండియా అంటాడు. చంద్రబాబు ఎపి టెక్నాలజీ హబ్ అంటాడు.
మోదీ డిజిటలైజేషన్ కన్నా చంద్రబాబు గ్రీవెన్స్ పాలన లో అభివృద్ధి ఆకాశంలోకి దూసుకుపోతోంది. అవి సాధారణ ప్రజలకు అందుబాటులో ఉన్నాయని ఎవరూ ప్రశ్నించక్కర్లేదు. 
దేశం మొత్తం మీద కోట్ల ఉద్యోగాలు మోదీ ఇస్తే, అందులో సగం ఎపిలో  ఇచ్చేసి చంద్రబాబు మోదీని బీట్ చేసేశాడు. 
మోదీ పథకాలకు జాతీయ నాయకుల పేర్లు మార్చినట్టే చంద్రబాబు కూడా పథకాలన్నిటికీ పేరు మార్చి ఘనత సాధించారు. అయితే మోదీ కంటే ఈ విషయంలో బాబు ఓ అడుగు ముందున్నారు. పాత పథకాల పేర్లు మార్చడం, ఎన్టీఆర్ పేరు పెట్టడం, తర్వాత వాటిని చంద్రన్న పథకాలుగా మార్చడంలో ఆయన ఎనలేని అభివృద్ధిని సాధించారు. 
మహిళలపై దాడుల్లో భారతదేశమే కాదు, చంద్రబాబు తెలుగుదేశం కూడా యమా స్పీడుగా దూసుకుపోతోంది. గట్టిగా చెబితే ఒకింత ఎక్కువ వేగంగానే పోతోంది. దేశంలోనే మహిళలపై అత్యాచారాల్లో ప్రధమ స్థానంలో ఉంది. 
అవినీతి విషయంలో తెలుగుదేశంతో భారతదేశం ఎప్పటికీ పోటీ పడలేదని నిరూపించేసారు చంద్రబాబు. దేశం అంతా ఒక ఎత్తు, చంద్రబాబు పాలన ఒక్కటీ ఒక ఎత్తు అని జాతీయ మీడియా కితాబిచ్చింది కూడా. 
దేశం మొత్తం మీద ఉన్న ముఖ్యమంత్రుల్లో అత్యంత ధనిక ముఖ్యమంత్రి, లావిష్ సిఎమ్ చంద్రబాబే అని సర్వేలు తేల్చాయి. సో ఈ విషయంలోనూ ఎపిని టాప్ పొజీషన్లో నిలిపింది చంద్రబాబని ఒప్పుకోక తప్పదు. 
వలస నేతలను అక్కున చేర్చుకోవడంలో మోదీని మించి అభివృద్ధి చంద్రబాబుదే. కనీసం త్రిపుర ఎమ్మెల్యేని అయినా స్పీకర్ అనర్హుడిగా ప్రకటించారు. కానీ ఏ 23 మంది ఎమ్మెల్యేలు ముగ్గురు ఎంపీలను పశువుల్లా కొన్నా చంద్రబాబు వారిపై అనర్హత పడనీయకుండా కాపాడి, మంత్రిపదవులిచ్చి మరీ అక్కున చేర్చుకున్నారు. రాజ్యంగాన్నీ,ప్రజా ఓటును గౌరవించడంలో దేశం కంటే తెలుగుదేశం ముందుందని నిరూపించారు. 
నీళ్లు, ఇళ్లు, ప్రాజెక్టులు, పథకాలు ఇలా అన్నింటిలో దేశం కంటే వేగంగా రాష్ట్రం తిరోగమనంలో అభివృద్ధి సూచిక జర్రున జారుతోంది. 
అభివృద్ధి అంటే చంద్రబాబు నిర్వచనమే వేరు మరి. అందుకే దేశం వర్సెస్ తెలుగుదేశంలో ఎప్పుడూ చంద్రబాబు ముందుంటున్నాడు. 
 
 
Back to Top