అభిమానపుటలలు.. ఆనందం ఉరకలు

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, జననేత, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో ఆమెపై అభిమానం కురుస్తోంది. షర్మిల నడిచే దారిలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల ఉత్సాహం ఉరకలేస్తోంది. వృద్ధుల ఆప్యాయత, మహిళల అనురాగం, చిన్నారుల సందడి అడుగడుగునా కనిపిస్తోంది. మహానేత రాజన్న, జననేత జగనన్నపై కురిపించిన అభిమానాన్నే పల్నాటి ప్రజలు.. షర్మిలపైనా చూపుతున్నారు.

దాచేపల్లి(గుంటూరు): వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర మండలంలో ఉత్సాహంగా సాగుతోంది. రెండో రోజు శ్రీనగర్ గ్రామ సమీపంలో బస చేసిన శ్రీమతి షర్మిల ఆదివారం ఉదయం 9.50 నిముషాలకు పాదయాత్రను ప్రారంభించారు.

* 10.10 గంటలకు శ్రీనగర్ గ్రామంలోకి షర్మిల పాదయాత్ర ప్రవేశించింది. గ్రామంలోని మహానేత డాక్టర్ వైయస్ఆర్ విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు.

* 10.30 నిముషాలకు ఎస్సీ కాలనీలోకి ప్రవేశించారు.

* 10.50 నిముషాలకు ఆంధ్రా సిమెంటు ఫ్యాక్టరీ వద్ద వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ జెండాను ఆవిష్కరించారు.

* 11.20 నిముషాలకు గామాలపాడు గ్రామంలోకి ప్రవేశించిన శ్రీమతి షర్మిలకు గ్రామానికి చెందిన సంకురాత్రి గోపాల్ గొర్రెపిల్లను బహూకరించారు.

* 11.40 నిముషాల నుంచి నాలుగు గంటల వరకు భోజన విరామం తీసుకున్నారు.

* 4.10 నిముషాలకు పాదయాత్ర గామాలపాడు సమీపంలో ప్రారంభమైంది. 15మంది వికలాంగులు శ్రీమతి షర్మిలను కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు.

* 4.13 నిముషాలకు సుమారు 50 మంది రైతులు నాగళ్ళతో ఎదురొచ్చి మహానేత తనయకు స్వాగతం పలికారు. నాగలిని బహూకరించారు.
* 4.17 నిముషాలకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి నివాస గృహ సమీపంలో ఏర్పాటు చేసిన వైయస్ఆర్ విగ్రహాన్ని, పార్టీ జెండాను ఆమె ఆవిష్కరించారు.

* అనంతరం 4.25 నిముషాలకు రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు.

* 4.50 నిముషాలకు దాచేపల్లి మాజీ ఎంపీపీ అంబటి శేషగిరిరావు తన అనుచరులతో పార్టీలో చేరారు.

* 5 గంటలకు గామాలపాడు నుంచి ప్రారంభమైన పాదయాత్ర 5.20 గంటలకు నాయకురాలు నాగమ్మ విగ్రహం వద్దకు చేరుకుంది. నాగమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

* 6 గంటలకు బ్రహ్మనాయుడు ఆడిటోరియంలో బ్రహ్మనాయుడు, నాయకురాలు నాగమ్మ, నలగమరాజు వేషదారణలో ఉన్న వారిని శ్రీమతి షర్మిల పలుకరించారు.
* 6.08 నిముషాలకు నారాయణపురంలోని ఆర్‌అండ్‌బీ బంగ్లా వద్ద రచ్చబండ నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.
* 6.25 నిముషాలకు ప్రజలనుద్దేశించి శ్రీమతి షర్మిల ప్రసంగించారు.
* 6.37 నిముషాలకు రచ్చబండ కార్యక్రమాన్ని ముగించారు.

అనంతరం 6.50 నిముషాలకు కారంపూడి రోడ్డులోనికన్నమదాసు విగ్రహానికి నివాళులర్పించిన శ్రీమతి షర్మిల మండలంలోని కేసనపల్లి గ్రామానికి 7.15 నిముషాలకు చేరారు.

* 7.30 నిముషాలకు గ్రామంలోని కస్తూర్బా విద్యాలయం బాలికలతో మాట్లాడి చక్కగా చదువుకోవాలని చెప్పారు.

* 7.57 నిముషాలకు తక్కెళ్ళపాడు గ్రామ సమీపంలోని బసకు శ్రీమతి షర్మిల చేరారు.

చిన్నారికి పలకరింపు
     మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఫ్యాక్టరీ సెంటర్ సమీపంలోకి రాగానే ఇరికేపల్లికి చెందిన ఆరేళ్ల చిన్నారి మందపాటి దీపికను శ్రీమతి షర్మిల ప్రేమతో దగ్గరకు తీసుకుని ముద్దాడారు. బాగా చదువుకోవాలని చెప్పారు. తన తలపై ఉన్న టోపీని తీసి దీపిక తలకు అలంకరించారు. దీంతో ఆ చిన్నారితో పాటు దీపిక తండ్రి వీరారెడ్డి ఆనందానికి అవధుల్లేవు.

అక్కా.. మేమూ మీ వెంటే..
     శ్రీమతి షర్మిల వెంట యువత ఉత్సాహంగా పాల్గొంటోంది. ముత్యాలంపాడు గ్రామానికి చెందిన ఎంటెక్ విద్యార్థిని మూలగుండ్ల పావని రెండ్రోజులుగా ఆమె వెంట నడుస్తోంది. ఆమెతోపాటు కె.భారతి, మరో 20 మంది మహిళలు పాదయాత్రలో పాల్గొన్నారు.

నాగళ్లతో ఘనస్వాగతం
     రైతు పక్షపాతిగా పేరొందిన మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిలకు రైతులు నాగళ్లతో స్వాగతం పలికి తమ సంఘీభావం తెలిపారు. గామాలపాడులో రైతులు ఎదురేగి స్వాగతం చెప్పారు. తామంతా డాక్టర్ వైయస్ కుటుంబానికి ఎంతో రుణపడి ఉన్నామనీ, అండగా నిలబడతామనీ ప్రకటించారు. మహానేత హయాంలో ఉచిత విద్యుత్తు అందడంతో పాటుగా, పంటలకు గిట్టుబాటు ధర లభించిందని చెప్పారు.

Back to Top