ఆగిన చోటు నుంచే పునఃప్రారంభం

రంగారెడ్డి జిల్లా:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరికి ఆత్మీయ స్వాగతం పలికేందుకు రంగారెడ్డి జిల్లా సన్నద్ధమవుతోంది. మోకాలి గాయంతో జిల్లాలో అర్ధంతరంగా ఆగిపోయిన షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ మళ్లీ ప్రారంభం కాబోతుంది. ప్రజా సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం... కాంగ్రెస్, టీడీపీ నీచ రాజకీయాలకు నిరసనగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల సాగిస్తున్న మరో ప్రజాప్రస్థానం యాత్ర ఫిబ్రవరి 6న పునఃప్రారంభమవుతోంది. గత నెల 11న జిల్లాలోకి అడుగిడిన యాత్రకు ఇబ్రహీంపట్నం నియోకవర్గం తుర్కయాంజల్ సమీపంలో 14వ తేదీన బ్రేక్ పడింది.

     అంతకుముందు రోజు బీఎన్‌రెడ్డినగర్ వద్ద బహిరంగసభ అనంతరం వాహనం దిగుతుండగా పట్టు తప్పడంతో ఆమె మోకాలికి గాయమైంది. గాయాన్ని లెక్కచేయకుండా శ్రీమతి షర్మిల మూడు కిలోమీటర్ల మేర నడక సాగించారు.  మరుసటి రోజు పరిశీలించిన వైద్యులు శస్త్ర చికిత్స అవసరమని తేల్చిచెప్పడంతో యాత్ర వాయిదా పడింది. సర్జరీ అనంతరం శ్రీమతి షర్మిల పూర్తిస్థాయిలో కోలుకున్నారని పాదయాత్ర నిర్వహించవచ్చని డాక్టర్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆగిపోయిన చోటు నుంచి పాదయాత్ర నిర్వహించేందుకు ఫిబ్రవరి 6న జిల్లాకు ఆమె రానున్నారు. నాలుగు రోజుల పాటు జిల్లాలో యాత్ర కొనసాగించిన అనంతరం నల్లగొండ జిల్లాలోకి అడుగిడతారు. డిసెంబర్ 11న మహేశ్వరం మండలం కోళ్ల పడకల్ మీదుగా జిల్లాలోకి ప్రవేశించిన మరో ప్రజాప్రస్థానం యాత్ర మహేశ్వరం, ఎల్‌బీనగర్ నియోజకవర్గాల గుండా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోకి చేరింది. నాలుగురోజుల పర్యటనలో 59.4 కిలోమీటర్ల మేర శ్రీమతి షర్మిల పాదయాత్ర చేశారు.

Back to Top