అమెరికా ఎన్ఆర్ఐ విభాగం ఆధ్వర్యంలో వైఎస్సార్ వర్థంతి కార్యక్రమాలు

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర్బంగా అమెరికాలోని వైఎస్సార్సీపీ యూఎస్ ఎ ... ఎన్ ఆర్ ఐ విభాగం ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. జూలై 2015 లో అట్లాంటాలో జరిగిన కార్యక్రమం విజయవంతం కావటంతో ఎన్ ఆర్ ఐ విభాగం కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, వాలంటీర్లు ఒక్క తాటి  పైకి వచ్చి ఈ కార్యక్రమాలు నిర్వమించారు. నిరుపేదలకు ఆహారాన్ని పంచటం, రక్త దాన శిబిరాలు ఏర్పాటు చేయటం వంటి అనేక స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు నిర్వహించారు. డల్లాస్, మేరీల్యాండ్, ఫిలడెల్ఫియా వంటి చోట్ల పార్టీ అగ్ర నేతలు బొత్స సత్యనారాయణ, చలమలశెట్టి సునీల్, గడికోట శ్రీకాంత్ రెడ్డి వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేసి స్ఫూర్తిని పెంపొందించారు. 

కార్యక్రమాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

1. వాషింగ్టన్ డీసీ లో జరిగిన కార్యక్రమం వివరాలు

వైఎస్సార్ ఫౌండేషన్, స్థానిక వైఎస్సార్సీపీ చాప్టర్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 13న ప్యారడైజ్ ఇండియా కజిన్ రెస్టారెంట్, మేరీల్యాండ్, వాషింగ్టన్ డీసీ లో బ్రహత్తర కార్యక్రమం జరిగింది. దాదాపు 350 మందికి పైగా అభిమానులు, కార్యకర్తలు, స్థానికులు తరలి వచ్చరు. వైస్సార్సీపీ రీజినల్ కోర్డినేటర్ రమేష్ రెడ్డి వల్లూరు, కోర్ కమిటీ సభ్యులు కిరణ్ ముక్తాపురం, ప్రసన్న కుకుమాని, రామ్ గోపాల్ దేవపట్ల, విజయ్ పొలం, వైస్సార్సీపీ మరియు వైస్సార్ అభిమానులు జనార్దన్ నానికాల్వ, తిప్పారెడ్డి కోట, నాగార్జున కొండూరు, నరసారెడ్డి ఆవుల, రాజశేఖర్ బసవరాజు, శివ దేవరపల్లి, సుబ్బు సిస్టా, చందు కట్టబోయిన, రాజశేఖర్ ఎరమల తదితరులు పాల్గొన్నారు. 
వైఎస్సార్ ఫౌండేసన్ తరపున రాఘవరెడ్డి గోశాల, రమేష్ అప్పారెడ్డి, ప్రతాప్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. భారత్ నుంచి వచ్చిన వైఎస్సార్సీపీ అగ్ర నాయకులు బొత్స సత్యనారాయణ, గడికోట శ్రీకాంత్ రెడ్డి, చలమలశెట్టి సునీల్ తో పాటు ఎన్ ఆర్ ఐ కన్వీనర్ రత్నాకర్ పండుగల్యాల పాల్గొని దివంగత వైఎస్సార్ తో తమకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకొన్నారు. 

2. డల్లాస్ లో రక్త దాన శిబిరం 
డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా అమెరికా వైఎస్సార్సీపీ డల్లాస్ విభాగం, అమెరికన్ రెడ్ క్రాస్ సంస్థ తో కలిసి సెప్టెంబర్ 12, 2015 న రక్త దాన శిబిరం ఏర్పాటు చేశారు. వైఎస్సార్సీపీ అగ్ర నేత బొత్స సత్యనారాయణ తో పాటు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెంకట్ మేడపాటి, వైఎస్సార్సీపీ యూఎస్ఏ విభాగం కన్వీనర్ రత్నాకర్, సలహాదారులు డాక్టర్ రాఘవరెడ్డి, విజయ్ భాస్కర్ చప్పిడి మరియు రీజనల్ కోర్డినేటర్ వాసుదేవ రెడ్డి , ఇతర వైస్సార్ సీపీ యూఎస్ఏ ఎన్ ఆర్ ఐ విభాగం ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, స్థానిక కమిటీ సభ్యులు, వైఎస్సార్ అభిమానులు, తదితరులు పాల్గొన్నారు. 

3. ఆస్టిన్ లో వైఎస్సార్సీపీ సేవా కార్యక్రమాలు
వైఎస్సార్సీపీ యూఎస్ ఎ ఎన్ ఆర్ ఐ విభాగం పథ నిర్దేశకత్వంలో పార్టీ అభిమానులు, అనుసరులు అమెరికాలో పలు సేవ కార్యక్రమాలు చేపట్టారు. ఆస్టిన్ నగరంలోసాయి మందిర్ ఆడిటోరియంలో అన్న దానం నిర్వహించారు. దివంగత ముఖ్యమంత్రి వైెఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతిని పురస్కరించుకొని దఫ దఫాలుగా సాగిస్తున్న సేవ కార్యక్రమాల్లో భాగంగా వీటిని నిర్వహించారు. ఈ సందర్భంగా దివంగత నేతకు నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘన నివాళి అర్పించారు. 
ఈ సందర్భంగా 300 మంది అనాథలకు భోజనాలు పంపిణీచేశారు. ఈ కార్యక్రమానికి కాకినాడ పార్లమెంటు నియోజక వర్గం వైాఎస్సార్సీపీ కన్వీనర్, ప్రముఖ పారిశ్రామిక వేత్త చలమల శెట్టి సునీల్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. సుబ్బారెడ్డి చింతగుంట, నారాయణ రెడ్డి గండ్ర అతిథులకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వెంకట్ నామాల, మురళీధర్ రెడ్డి బండ్లపల్లి, రఘు సిద్దపురెడ్డి, ప్రవర్ధన్ చిముల, ప్రదీప్ రెడ్డి చౌటి, కొండారెడ్డి ద్వర్శల, కుమార్ అశ్వపతి, సచ్చిముట్లూరు, మోహన్ రెడ్డి, రామ హనుమంత రెడ్డి మల్లిరెడ్డి, హేమంత్ బళ్ల, వెంకట్ వీరగుండి, శ్రీని చింత, వెంకట్ గౌతమ్, దేవేందర్ రెడ్డి, అశోక గుడూరు, శ్రీధర్ రెడ్డి వాసపల్లి, మల్లిక్ ఆవుల, మోహన్ రెడ్డి ఆరేకూటి, రవి నక్కల, ప్రదీప్ రెడ్డి, రవికిరణ్ రెడ్డి, ప్రకాష్ రామమూర్తి, శ్రీనివాస్ బూసా, రేవంత్ కుమార్ అంగడి  తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథి, కాకినాడ నియోజక వర్గ కన్వీనర్ సునీల్ చలమలశెట్టి మాట్లాడుతూ.. దివంగత వైఎస్సార్ రాష్ట్ర ప్రజలకు అందించిన సేవల్ని గుర్తు చేసుకొన్నారు. అట్టడుగు వర్గా్ల్ని ప్రగతిపథంలోకి తీసుకొని వచ్చేందుకు వైఎస్సార్ చేసిన క్రషిని వివరించారు. ఎన్ ఆర్ ఐ విభాగం ద్వారా వైఎస్సార్సపీ సోషల్ మీడియా ప్రచారాన్ని విస్తారం చేయాలని అభిలషించారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మీద తెలుగుదేశం జల్లుతున్న బురదను సమర్థవంతంగా తిప్పికొట్టాలని పిలుపు ఇచ్చారు. వెంకట్ నామాల కార్యక్రమానికి వందన సమర్పణ చేశారు. 

4. అట్లాంటా లో సేవ కార్యక్రమాలు
అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని డాక్టర్ వైఎస్సార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరో వర్ధంతిని పురస్కరించుకొని రక్త దాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జార్జియాలోని అల్ఫరెట్టా లో సెప్టెంబర్ 12వ తేదీన దీన్ని నిర్వహించారు. వైఎస్సార్సీపీ అట్లాంటా నేత్రత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. లైఫ్ సౌత్ కమ్యూనిటీ బ్లడ్ సెంటర్ ద్వారా దాతల నుంచి రక్తాన్ని సేకరించారు. ఈ సందర్భంగా వలంటీర్లకు లైఫ్ సౌత్ రక్త దాన శిబిర కోర్డినేటర్ నికియా జోన్స్ చేతుల మీదుగా సర్టిఫికేట్లు అందచేశారు. సౌత్ ఫర్సిత్ హైస్కూల్ వలంటీర్లకు ఆహారాన్ని అందచేశారు. 
దివంగత వైఎస్సార్ బంధువులు, స్నేహితులు, వైఎస్సార్ అనుచరులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇందులో శ్రీనివాస రెడ్డి కొట్లూరు, నంద గోపీనాథ రెడ్డి, వెంకట్రామి రెడ్డి చింతం, నరేష్ గువ్వ, సుధీర్ రెడ్డి బసు, గురు ర్ పరదామి, వెంకట్ మీసాల, దామోదర్ రెడ్డి పుస్పాల, గిరీష్ రెడ్డి మేక, క్రష్ణ నర్సేపల్లి, జగదీశ్వర్, రాజశేఖర్ రెడ్డి కాశిరెడ్డి, వెంకట్ మొండెద్దు, శ్రీని వంగిమల్ల, పుల్కరమ్ శ్రీనివాస్, నరసింహ రెడ్డి, రమేష్ దువ్వూరి, వినయ్ తాన్వీ, ఉమా మహేశ్వర రెడ్డి కావల కుంట్ల తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ ఎన్ ఆర్ ఐ విభాగం కన్వీనర్ గురవా రెడ్డి పుణ్యాల నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించటం జరిగింది. 

5. న్యూ జెర్సీలో సేవ కార్యక్రమాలు  
సాత్విక్ రెడ్డి, ఆయన స్నేహితులు, డాక్టర్ వైఎస్సార్ అభిమానులు, వైఎస్ జగన్ అభిమానులు.. యూఎస్ఏ ఎన్ ఆర్ ఐ విభాగం కన్వీనర్ రత్నాకర్ ఆధ్వర్యంలో రక్త దాన శిబిరాన్ని నిర్వహించారు. పేదలకు ఆహారాన్ని అందించారు. 

6. రలేగ్ లో సేవ కార్యక్రమాలు
దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర్భంగా రలేగ్ లో ఆహార పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఇందులో ఈశ్వర్ పొలిరెడ్డి, శివప్రసాద్, గోపీచంద్ రెడ్డి, మహమ్మద్ సుజత్, రవికుమార్ గాదిరెడ్డి, అరుణ్ వెన్నపూస, విశ్వనాథ్ రెడ్డి, శ్రీష్ మహిపాల్ రెడ్డి మాల్యే, గోపాల్ రెడ్డి, విష్ణు వెన్నపూస, హరి ప్రేమిరెడ్డి, ప్రసన్న కొక్కంటి, నాగార్జున రెడ్డి, హరీష్ రెడ్డి , శ్రీనివాస్ ఆర్ ఎదుల, సత్య రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

7.  బర్మింగ్ హామ్ లో సేవ కార్యక్రమాలు 

దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి ని సెప్టెంబర్ 13న బర్మింగ్ హామ్ లోని చర్చ్ ఆఫ్ రీకన్సిల్లర్ వేదికగా వైఎస్సార్సీపీ అమెరికా అలబామా విభాగం నిర్వహించింది. ఈ సందర్భంగా నిరుపేదలకు ఆహార పంపిణీ చేపట్టారు. దీనికి వైఎస్సార్సీపీ యూఎస్ఎ విభాగం కోర్ కమిటీ సభ్యులు మరియు అలబామా రాష్ట్ర కన్వీనర్ శ్రీనివాస రెడ్డి ఎర్రబోతుల సారథ్యం వహించారు. 
 

9. ట్రాయ్ నగరంలో సేవ కార్యక్రమాలు 


అమెరికా లోని అలబామా రాష్ట్రంలోని ట్రాయ్ నగరంలో వైఎస్సార్సీపీ యూఎస్ఎ..ఎన్ ఆర్ ఐ విభాగం కన్వీనర్ రత్నాకర్ పండుగాయల ప్రోత్సాహంతో ఆదిత్య రెడ్డి పల్లేటి, రోహిత్ గంగిరెడ్డి, దిలీప్ దొండపాటి, ప్రథ్వి ప్రవీణ్, ప్రేమ్ కుమార్, శివ కుమార్, యశ్వంత్, కరుణ్, జగదీష్ తదితరులు సేవ కార్యక్రమాలు నిర్వహించారు. ట్రాయ్ లోని నోబుల్ మానర్ ఎల్ఎల్సీ వ్రద్ధాశ్రమంలో వీటిని ఏర్పాటు చేశారు. 


10. కనెక్టికట్ లో సేవ కార్యక్రమాలు  

వైఎస్సార్సీపీ యూఎస్ఎ ఎన్ ఆర్ ఐ కమిటీ కన్వీనర్ రత్నాకర్ పండుగాయల మరియు ఇతర వైఎస్సార్సీపీ వలంటీర్లు, అభిమానులు కనెక్టికట్ లో సెప్టెంబర్ 2న రక్తదాన శిబిరం మరియు ఆహార పంపిణీ శిబిరం నిర్వహించారు. 
Back to Top