దర్జాగా రూ. 39 కోట్లు తాగేశారు

()హెరిటేజ్ లాభాల కోసం బాబు పథక రచన
()మజ్జిగ కేంద్రాల పేరుతో భారీ దోపిడీ

చంద్రబాబు దోపిడీకి అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ధనార్జనే ధ్యేయంగా అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేస్తున్న అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుంటే నోరెళ్లబెట్టడం సామాన్యుల వంతవుతుంది. ఎవరేమన్నా అనుకోనీ నాకేంటి. నా ఖజానా నిండితే చాలని జనం కడుపులు కొట్టి  కొడుక్కి మూటలు కట్టి పెట్టాలని చంద్రబాబు చేస్తున్న వ్యవహారాలు విస్మయ పరుస్తున్నాయి. ఏదో తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా.. కొత్తగా రాజధాని నిర్మాణం జరుగుతుంది.. అనుభవం ఉన్న వ్యక్తిని ముఖ్యమంత్రిని చేద్దామని జనం ఓట్లేసి గెలిపిస్తే ఈయన మాత్రం మంచి తరుణం మించిన దొరకదు అన్నట్టు ప్రజాధనాన్ని తన ఇష్టారాజ్యంగా సొంత సంస్థలకు మళ్లిస్తున్న తీరు అంతటా విమర్శలకు తావిస్తుంది. 

హెరిటేజ్ కోసం ప్రజాధనం లూటీ
గడిచిన వేసవిలో ప్రజలు ఎండల తీవ్రతతో అలమటిస్తుంటే అక్కడా సంపాదన మార్గాలు అన్వేషించడం బాబుకే చెల్లింది. నష్టాల్లో ఉన్న హెరిటేజ్‌ సంస్థను గట్టెక్కించేందుకు బాబు పక్కా పథకం రచించాడు. ఎండల్లో ప్రజల దాహార్తిని తీర్చే పేరుతో చలివేంద్రాల పథకం వేశారు. చలివేంద్రాలు ఏర్పాటు చేసి మజ్జిగ  పంపిణీ పథకం ప్రారంభించారు. ఆయా చలివేంద్రాలకు అవరసరమైన పెరుగు, పాలను హెరిటేజ్‌ ఫ్రెష్‌లోనే కొనుగోలు చేయాలని రూల్ పెట్టేశారు. ఇదేదో నోటి మాటకాదు. సాక్షాత్తు కలెక్టర్లు తహశీల్దార్లకు దీనిపై జీవోలు కూడా విడుదల చేశారు. దాని ప్రకారం రోజుకు 20 లీటర్ల పాలను ఒక్కో చలివేంద్రానికి వినియోగించారు. మజ్జిగతోపాటు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, చలివేంద్రాల ఏర్పాటుకు షెల్టర్లు, దానిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు హుటాహుటిన నిధులు కేటాయించారు. 

హుటాహుటిన జిల్లాకు రూ.3 కోట్లు
రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు.. చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని చంద్రబాబుకు ఆలోచన వచ్చిందే తడవుగా అధికారులకు  2016 ఏప్రిల్‌ 25న జారీ చేసిన జీవో ( G.O.RT.No.57). ఇక్కడే మరో వింత చూశారా జీవో జారీ చేసిన రోజే నియోజకవర్గానికి రూ. 3 కోట్లు విడుదల చేస్తూ ఆర్థికశాఖ నుంచి (G.O.RT.No.1150) పేరుతో మరో జీవో విడుదలైంది. అయితే ఆయా ప్రాంతాల్లో హడావుడిగా సకల హంగులతో బాబు ఫోటోలతో ఏర్పాటు చేసిన చలివేంద్రాలు ఎన్నిరోజులు నిలవలేదు.  ప్రభుత్వం మజ్జిగ కేంద్రాల ఏర్పాటు చేసిన విషయం ప్రజలకు తెలిసేలోపు కుండలు బోర్లించారు. 

 రూ.39 కోట్ల దందాకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన జీవోలు, చలివేంద్రం నిర్వహణ తీరుకు సంబంధించి ఇటీవల వెలుగుచూసిన వాస్తవాలు విస్తుపోయేలా చేస్తున్నాయి.

–– 1,2 ఫోటోలు జిల్లాకి రూ. 3 కోట్లు చొప్పున మొత్తం 39 కోట్లు కేటాయిస్తూ ఏప్రిల్‌ 25న జారీ చేసిన జీవో ( G.O.RT.No.57) .
–– 3వ ఫోటో కేటాయించిన రూ. 39 కోట్లు అదే రోజు అనగా ఏప్రిల్‌ 25నే నిధులు విడుదల చేస్తూ ఆర్థికశాఖ జారీ చేసిన జీవో (G.O.RT.No.1150) .
–– 4 వ ఫోటో, అన్ని చోట్లా చంద్రబాబు సొంత కంపెనీ అయిన హెరిటేజ్‌ కేంద్రాలలోనే మజ్జిగ కొనాలని కలెక్టర్లు జారీ చేసిన ఉత్తర్వులు .
–– మిగతా ఫోటోలలో ఒక్కరోజు హడావుడి చేసి రెండో రోజు కుండలు బోర్లించిన చిత్రాలు చూడొచ్చు. అంతే కాదు మజ్జిగకు బదులు మున్సిపాలిటీ నీళ్లని కుండలకి పడుతున్న దృశ్యాలు చూడొచ్చు.

  


Back to Top