నిధులు నిరర్థకం చేసి దీక్షలా?

ఆంధ్రప్రదేశ్ లోని వెనుకబడిన ఏడు జిల్లాలకూ ప్రత్యక అభివృద్ధి ప్యాకేజీని ఇస్తోంది కేంద్రం. గత మూడేళ్లుగా ఒక్కో జిల్లాకూ 50 కోట్లు చొప్పున ఇస్తున్నారు. 2017లో ఎస్డీపీ నిమిత్తం 350 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం, వెంటనే వెనక్కు తీసుకుంది. దీనికి నిరసనగా కరువు నేలపై కేంద్రం వివక్ష అంటూ టిడపి ఎంపిలంతా కలిసి ఒక్కరోజు దీక్షకు పూనుకున్నారు. వెనకబడిన జిల్లాల అభివృద్ధికోసం ఇప్పటికి కేంద్రం మొత్తం 700 కోట్లు ఇచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. కానీ 1000 కోట్లు ఇచ్చామని కేంద్రం అంటోంది. పైగా ఈ నిధుల్లో 88 శాతం నిధులు ఇంత వరకూ వినియోగించలేదని కూడా ఆరోపిస్తోంది. ఇచ్చిన నిధులను వినియోగించకుండా ఏటా నిధులు కావాలనడం దేనికి అంటోంది కేంద్రప్రభుత్వం. వీటికి సమాధానం చెప్పకుండానే టిడిపి నేతలు కేంద్రం ప్యాకేజీ ఇవ్వడం లేదంటూ దీక్షలు చేస్తున్నారు. చిత్తశుద్ధిలేని చంద్రబాబు పాలనలో వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన నిధులుకూడా నిరపయోగం అయ్యాయన్న వాస్తవం బయటపడకుండా, దీక్షల పేరుతో కాలం వెళ్ల బుచ్చుదామనుకుంటున్నారు. 

నిధులు దారి మళ్లింపు

వెనుకబడ్డ జిల్లాలకు కేంద్రం ఇచ్చిన నిధులు దారి మళ్లాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మౌలిక వసతుల కోసం కేటాయించాల్సిన నిధులను వేరే వాటికి ఖర్చు చేసేసారు. ఉత్తర కోస్తా, రాయలసీమ పరిధిలోని వెనుకబడ్డ ఏడు జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక అభివృద్ధి పథకం కింద కేటాయించిన నిథులను, ఆ జిల్లాల్లో తలసరి ఆదాయం పెంచే అభివృద్ధి పనులకు వినియోగించాలి. కానీ ఇది అక్రమార్కుల జేబులు నింపటానికే పనికొస్తోంది. దీనికి ఒక్క ఉదాహరణ చెప్పుకోవాలి. కర్నూలు జిల్లాకు ప్రత్యేక అభివృద్ధి పథకం కింద 2014 - 2017 వరకూ 150 కోట్లు మంజూరు చేసారు. అయితే జిల్లాలో 1,278 పనులకు ఏకంగా 260 కోట్లకు అనుమతులిచ్చేసారు. వీటిలో ఎక్కువ శాతం పంచాయితీరాజ్ రహదారులకే కేటాయించారు. మినిస్టర్ లోకేష్ శాఖ గనుక, భవిష్యత్ లో పేరు రావాలనే ఉద్దేశ్యంతో ఇలా చేసారని విమర్శలు వచ్చాయి.
ఇదండీ కేంద్రం ఇచ్చిన ఎస్డీపి నిధులను రాష్ట్రం ఉద్ధరించిన తీరు. చేయాల్సిన నష్టం అంతా చేసి, ఇప్పుడు కేంద్రం ఏదో అన్యాయం చేసిందంటూ దీక్షలు చేయడం టిడిపి నేతలకే చెల్లింది. దొంగ దీక్షలు, బరువు తగ్గే దీక్షలు, బరువు తగ్గని నిరాహారదీక్షలు వీటన్నిటికీ తెలుగుదేశానికి పేటెంట్ ఉందని అనుకుంటున్నారు తెలుగు ప్రజలు. 




 
Back to Top