‘జగన్’ వ్యక్తిత్వానికి అతడే చిరునామా

చిరునవ్వుతో ప్రజలను పలకరిస్తాడు. చిరుతలా
అవినీతి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడు. నాడు కాంగ్రెస్ తో, నేడు బిజెపీతో
తలపడుతూ మేరు శిఖరంలా కనిపిస్తాడు. పేదవాడి భుజాన చేయి వేయిసి నడుస్తూ అతి సామాన్యుడిలా అనిపిస్తాడు. ప్రజల తరఫున
పోరాడేటప్పుడు అతడు సైనికుడు. ప్రజల బతుకులు మార్చేందుకు సాగుతున్న శ్రామికుడు. వైఎస్ జగన్
మోహన్ రెడ్డి. తండ్రి ఆశయాలకు వారసత్వం, మంచితనానికి
మూర్తిమత్వం కలబోస్తే అతడే.

నాయకుడంటే జగనే

నాయకుడెలా ఉండాలంటే ఇలా ఉండాలని ఓ బెంచ్ మార్క్ ఏర్పాటు చేసారు
వైఎస్ రాజశేఖర్ రెడ్డి. నాన్నగారి కంటే రెండడుగులు ముందుకేసి ప్రజల గురించి ఆలోచిస్తా
అంటాడు వైఎస్ జగన్. అందుకే ప్రజలు కోరిందే మేనిఫెస్టో అని ప్రకటించాడు. అన్నమాటకే
కట్టుబడి ప్రజామేనిఫెస్టో సిద్ధం చేస్తున్నాడు. మాటతప్పని
మడమ తిప్పని తత్వం ఆ కుటుంబానిది. విలువలు, విశ్వసనీయత ఉండే రాజకీయాలు చేయాలన్న సిద్ధాంతం జగనన్నది. ఒక రోజులో
పదిమందితో మాట్లాడొచ్చు. వందమందిని కలవొచ్చు. వెయ్యిమందిని పలకరించొచ్చు. కానీ అందరినీ
ఆదరంగా హత్తుకోగలమా? సామాన్యులకు అది సాధ్యమా? జగన్ కు
అది సాధ్యం. నిత్యం వేలాది మందితో ఆయన మమేకం కాగలడు. ప్రతి ఒక్కరి
ఆర్తినీ సహృదయంతో వినగలడు. వారి కష్టాన్ని కళ్లతో కాదు, మనసుతో చూడగలడు. తన ఒక్క
మాటతో వారి గుండెల్లో బాధకు ఉపశమనం కలిగించగలడు. నాన్నలా
డాక్టర్ కాకపోయినా, కష్టాలను నయం చేసే వైద్యం తెలిసిన వాడు జగన్ అని జనం అనుకుంటున్నారు. ఎప్పుడూ
అతడు తన కారెక్టర్ ను అమ్ముకోలేదు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెబుతుంటారు. వ్యక్తిగత
స్వార్థం కోసం రాజీపడలేదని, పడబోనని కూడా చెప్పారు వైఎస్.జగన్. ఇది తనకు
తాను ఇచ్చుకుని గౌరవం. అదే గౌరవం ప్రజలకు ఆ యువనేత పై ఉంది. అందుకు అతడి
కారెక్టరే కారణం.

ఆత్మవిశ్వాసాన్ని అహంకారమనే వాళ్లకు

చంద్రబాబు లాగే మీరూ రుణమాఫీ అని ప్రజలకు హామీ ఇచ్చుంటే మీరు
గెలిచేవారు అన్నారుట కొందరు నేతలు. అన్నా వీలుకాని హామీలిచ్చి నేను విలువలు లేని రాజకీయం చేయలేను. దానికన్నా
ఓడిపోయినా నేను బాధపడను అన్నార్ట జగన్. ఇది మాటను నిలబెట్టుకోవాలనుకునే
నాయకుడి నిజాయితీకి నిదర్శనం. పెద్దవాళ్లను గౌరవించడని, అహంభావి
అని, ఎవ్వరి మాటా లెక్కచేయని వాడని కొందరు వైఎస్ జగన్ పై దుష్పప్రచారం
చేసారు. నిప్పు నిజం ఎన్నాళ్లు దాగుతాయి. జగన్ ది
అహంకారమో, ఆత్మవిశ్వాసమో అందరికీ చాలా త్వరగానే అర్థం అయ్యింది. పెద్దలకు
వైఎస్ జగన్ ఎంతటి గౌరవమిస్తారో, అభిమానంతో అన్నా అంటూ ఎలా పలకరిస్తారో, అతి సామాన్యంగా
ఎలా నడుచుకుంటారో చూసిన వాళ్లు ఆశ్చర్యపోయారు. ఇంత సాదాసీదాగా
ఉన్న మనిషిపై ఇన్ని అపోహలు ఎలా సృష్టించారని అవాక్కయ్యారు. ఇలాంటి విమర్శలు
ఎన్ని ఎదొర్కున్నా చెక్కు చెదరని చిరునవ్వుతో కనిపిస్తారు వైఎస్ జగన్. అనేవాళ్లని
అనుకోనీండి అన్నా, అంతటితో పోయేదేముంది అని తేలిగ్గా తీసిపారేసే ఆ వ్యక్తిలో అంతులేని
సహనం దాగుందని వేరే చెప్పాలా!!

ధర్మం అతని సిద్ధాంతం

ఏం గుండెధైర్యం అది! అక్రమంగా బనాయించి
వేధిస్తున్న కేసులు నేటికీ ఓ కొలిక్కి రాలేదు. అయినా వెనకడుగు
వేయడం లేదు. చట్టాన్ని నమ్మాడు. న్యాయాన్ని నమ్ముతున్నాడు. ధర్మంగా
నడుచుకోవడమే నా సిద్ధాంతం అంటున్నాడు. అంతేకాదు మీ మనఃస్సాక్షిని
నమ్మే ఓటేయండి అని ప్రజలకు నిర్భయంగా చెబుతున్నాడు. ఇది ఓ ధీరుడి
లక్షణం. తన మాటే మంత్రంగా పనిచేసే కార్యశూరుడి లక్షణం. తన నడవడితోనే
ఒరవడి సృష్టించే నాయకుడి లక్షణం. ఆత్మవిశ్వాసం తొణికిసలాడే యువోత్సాహం అతడిలో కనిపిస్తోంది. సువర్ణయుగాన్ని
తెస్తాననే నమ్మకం అతడి గొంతులో వినిపిస్తోంది. జగనే మా
నాయకుడని ప్రతి తెలుగువాడి గుండె ప్రతిధ్వనిస్తోంది. 

Back to Top