3000 కిలోమీటర్ల మైలురాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అలనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి 1470 కిలోమీటర్ల పాదయాత్ర చేసారు. అది ప్రజాప్రస్థానం. ఆ అవిశ్రాంత కాలినడకలో ఆయన సామాన్యులకు చేరువయ్యారు. వారి గుండెల్లోని బాధలను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలను లోతుగా అధ్యయనం చేసారు. అన్నిటికంటే ఎక్కువగా నాటి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేసారు. ప్రభుత్వ విధానాలకు నిరసనను శాసన సభలో కాదు ప్రజాక్షేత్రంలోనే తెలియజెప్పాలనుకున్నారు. ప్రజలకు ఆ ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకత పాదయాత్ర సమయంలో మరింతగా బైటికొచ్చింది. తమ గోడు చెప్పుకునే దోవ లేని ప్రజలకు వైఎస్ రాక ఓ ఓదార్పు అయ్యింది. తమ బాధలు వినేందుకు ఒకరున్నారనే ఆలంబన వారిలోని అశక్తతను దూరం చేసింది. ఆ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేలా ప్రేరేపించింది. 68 రోజుల పాదయాత్ర ఓ ప్రజాకంటక పాలనకు చరమగీతం పాడింది.
ఒక్కసారి ఈ చరితను గుర్తుచేసుకున్నాం కదా...ఇప్పుడు వర్తమానంలో జరిగేది చూద్దాం. 
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. తండ్రి అడుగుజాడలే తన ఆశయాలుగా మార్చుకుని ప్రజా సంక్పల్పానికి శ్రీకారం చుట్టాడు. ఇప్పుడూ అదే ప్రభుత్వం. అదే దమన నీతి. ప్రజల్లో అదే ఆక్రోశం. అదే వ్యతిరేకత. నాడు తండ్రి పోరాడిన నాయకుడితో నేడు తనయుడు పోరాటం చేస్తున్నాడు. ప్రజల కోసం అండగా నిలుస్తున్నాడు. రాష్ట్రం మూలమూలలా కాలినడకన సాగుతున్నాడు. వారి కష్టమేమిటో తెలుసుకుంటున్నాడు. కన్నీళ్లు తుడుస్తున్నాడు. అన్యాయపు రోజులకు కాలం చెల్లిందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాడు. ప్రజావ్యతిరేక పాలనకు చరమగీతం పాడుతానని శపథం చేస్తున్నాడు. 
చరిత్ర పునరావృతం కాబోతోంది. ప్రజాప్రస్థానం సంక్షేమ పాలనను తెచ్చింది. రాజన్నను రాష్ట్రానికి కానుకగా ఇచ్చింది. నేడు ప్రజా సంకల్పం ఆ నాయకుడి వారసుడు చేస్తున్నది. తండ్రికి రెట్టింపు అడుగులు అతడివి. తండ్రిని మించి మంచిని చేయాలన్న సంకల్పం అతనిది. రాజన్న రాజ్యాన్నది మళ్లీ తెస్తుంది. పేదల పెన్నిధి ప్రభుత్వాన్ని ప్రజలకు కానుకగా ఇస్తుంది. 3000 కిలోమీటర్ల మైలురాయిని దాటుతున్న వైఎస్ జగన్ ప్రజాసంకల్పం ఆ ఆశలకు ఊతమై నిలుస్తున్నది. 

 

తాజా ఫోటోలు

Back to Top