2014 ఎన్నికలకు ముందు చేనేతలకు చంద్రబాబు ఇచ్చిన హామీలు1. చేనేత కార్మికులు రూ. 1000 కోట్లతో ప్రత్యేక నిధితోపాటు బడ్జెట్‌లో ఏటా వెయ్యి కోట్లు కేటాయింపు 
2. రాష్ట్ర వ్యాప్తంగా నేత బజార్ల ఏర్పాటు
3. చేనేత కార్మికులకు గుర్తింపు కార్డులు
4. చేనేత మగ్గాలకు ఉచిత విద్యుత్‌
5. జరీపై విధించిన వ్యాట్‌ రద్దు
6. చేనేత కార్మికుల బ్యాంకు రుణాలు మాఫీ
7. ఒక్కొ కుటుంబానికి రూ. లక్ష మేర రుణ సదుపాయం
8. ఉచిత ఆరోగ్యబీమా, చేనేత కార్మికులకు వృద్ధాప్య పింఛన్‌ నెలకు వెయ్యి..
9. చేనేత సహకార సంస్థను పటిష్టం చేసి ముడిసరుల సరఫరా, మార్కెటింగ్‌ సదుపాయం..., జిల్లా, డివిజన్‌ కేంద్రాల్లో ఏర్పాటు. అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్‌కు సహకారం 
10. జిల్లాకు ఒక చేనేత పార్కు ఏర్పాటు చేసి కార్మికుల శిక్షణ, ఉపాధి కల్పించం
11. వృద్ధ చేనేత కార్మికుల కోసం ఉరవకొండ, చీరాల, మంగళగిరి, పెడన, ధర్మవరం ప్రాంతాల్లో ఆస్పత్రులు వృద్ధాశ్రమాల ఏర్పాటు
12. సగం ధరకే జనతా వస్త్రాలు– జనతా వస్త్రాల పథకం పునరుద్ధరణ
13. మూతబడిన చేనేత సంఘాల పునరుద్ధణ, బకాయిల రద్దు, మూలధన సహాయంతోపాటు 50 శాతం సబ్సిడీతో మగ్గాల సరఫరా
14. చేనేత సొసైటీలకు 20 శాతం రాయితీతో ముడిసరుకుల సరఫరా
15. చేనేత సహకార సంఘాల భవనాలకు ఆస్తిపన్ను నుంచి మినహాయింపు
16. చేనేత కార్మికులకు తక్కువ వడ్డీకే సంస్థాగత రుణాలు
17. రూ. 1.50 లక్షలతో ఉచితంగా ఇల్లు, మగ్గం షెడ్డు నిర్మాణం
18. చేనేత వస్త్రాల విక్రయాలపై 30 శాతం రిబేట్‌
19. సబ్సిడీపై నూలు, సిల్క్, రంగులు అందించడం
20. చేనేత ఉత్పత్తులపై ఆఫ్‌ సీజన్‌ సమయాల్లో రుణ సదుపాయం కల్పించి గిట్టుబాటు ధరలు వచ్చే వరకు వాటిని నిల్వ ఉంచుకునే అవకాశం 
21. సహకార రంగంలో ఉన్న చేనేత కార్మికులందరికీ ప్రభుత్వ పథకాలు అమలు చేయడం
22. సహకార సంఘాలు లేని చోట స్వయం సహాయక గ్రూపులు ఏర్పాటు చేసి వారికి కూడా ప్రభుత్వ పథకాలు అమలు 
23. త్రిఫ్ట్‌ ఫండ్‌ పథకం పునరుద్ధరణ
24. చేనేత పరిశ్రమ ఆధునికీకరణకు ప్రత్యేక విభాగం
25. చేనేత కార్మికుల పిల్లలను చదివించేందుకు ప్రత్యేక ప్యాకేజీ, వారికి ఉచిత వైద్య సేవలు 
Back to Top