రాజన్న బిడ్డకు ఒక్క అవకాశం ఇవ్వండి

వైయస్‌ షర్మిల

డ్వాక్రా మహిళలను కూడా రుణమాఫీ పేరుతో మోసం చేశారు

ఎన్నికలకు ముందు హోదా..తరువాత ప్యాకేజీ..మళ్లీ హోదా..

హరికృష్ణ భౌతికకాయం వద్ద పొత్తు కోసం చంద్రబాబు మంతనాలు

నిన్ను నమ్మం బాబు అని ఓటుతో తేల్చి చెప్పండి

బాకీలు తీర్చమని డ్వాక్రా మహిళలు బాబును ప్రశ్నించాలి

 
గుంటూరు: మాట తప్పని నేత..మడమ తిప్పని నాయకులు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి కుమారుడు వైయస్‌ జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలని వైయస్‌ షర్మిల కోరారు. చంద్రబాబు ఐదేళ్లలో ఏ ఒక్కరికి భద్రత ఇవ్వలేదని..ఇప్పుడు మీ భవిష్యత్తు– నా బాధ్యత అంటూ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఎంత ఇచ్చినా బాకీ పడ్డట్టే అని పేర్కొన్నారు.  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి పొత్తులు అవసరం లేదని..సింహం సింగిల్‌గానే వస్తుందని చెప్పారు. గుంటూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వైయస్‌ షర్మిల ప్రసంగించారు.

వైయస్‌ఆర్‌ పాలనలో ప్రతి ఒక్కరికి భరోసా..
వైయస్‌ఆర్‌ పాలనలో ప్రతి పేదవాడికి భరోసా ఉండేది. ప్రతి మహిళకు ఒక ధైర్యం ఉండేది. ప్రతి ఒక్క వర్గానికి మేలు చేసిన నాయకుడు వైయస్‌ రాజశేఖరరెడ్డి ఒక్కరే అన్నారు. సోషలిస్టు, ఫ్యాక్షనిస్టు అంటూ ముద్ర వేయాలనుకున్నా..ఆయన ఎంత మంచి వ్యక్తి మీ అందరూ చూశారన్నారు. చంద్రబాబు ఎలా ఉన్నారో చూశారన్నారు. రైతులందరి రుణాలుమాఫీ చేస్తామని దగా చేశారన్నారు. డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని దారుణంగా మోసం చేశారన్నారు. చేస్తామన్న రుణమాఫీ చేయకుండా ఇప్పుడు భిక్షం ఇస్తున్నట్లు పవిత్రమైన పసుపు–కుంకుమ పేరుతో మళ్లీ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రుణాలు మాఫీ చేయకుండా మహిళలను వంచించారని విమర్శించారు. పేదవాడు మళ్లీ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని చంద్రబాబు శాసించారని మండిపడ్డారు. పోలవరం అంచనలు పెంచి దోచుకున్నారని విమర్శించారు. ఆయన మాట మీద నిలబడి ఉంటే ఈ పాటికి పోలవరం పూర్తి అయ్యేదన్నారు. అమరావతి విషయంలో వేల ఎకరాలను తన బినామీలకు కట్టబెట్టారన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులు ఏం చేశారో అర్థం కావడం లేదన్నారు. ఇలాంటి మోసగాళ్లు అవసరమా అని ప్రశ్నించారు. అమ్మకు అన్నం పెట్టడు కానీ..పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానని చెబుతున్నారన్నారు. ఐదేళ్లలో అమరావతి కట్టలేని చంద్రబాబు ఇంకొక ఐదేళ్లు అవకాశం ఇస్తే దేశంలోనే నంబర్‌వన్‌ చేస్తానని చెవులో పూలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

లోకేష్‌కు ఏం అర్హత, అనుభవం ఉంది..
బాబు వస్తే జాబు వస్తుందని చెప్పారని, జాబు మాత్రం చంద్రబాబు కొడుకు లోకేష్‌కు వచ్చిందని ఎద్దేవా చేశారు. ఈ పప్పుగారికి కనీసం జయంతి, వర్ధంతికి కూడా తేడా తెలియదన్నారు. ఏకంగా మూడు శాఖలకు మంత్రి అయ్యారని విమర్శించారు. అఆలు రావు కానీ..అగ్రతాంబూలం తనకే అన్నారట.  ఏ అర్హత, అనుభవం ఉందని పప్పును చంద్రబాబు జనాల నెత్తిన రుద్దారని ప్రశ్నించారు. ఇది పుత్రవాత్సల్యం కాదా అన్నారు. నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వడం లేదని నిలదీశారు. 

బాబుది రోజుకో మాట..పూటకో వేషం
బాబు–మోడీ జోడీ కలిసి మనకు రావాల్సిన ప్రత్యేకహోదాను ఎగ్గొట్టారని  విమర్శించారు. చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకొని నాలుగేళ్లు కాపురం చేశారన్నారు. బీజేపీ ఇంత ద్రోహం చేయడానికి చంద్రబాబు ప్రశ్నించకపోవడమే అన్నారు. హోదాను నీరుగార్చే ప్రతి ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు హోదా అన్నారని, ఆ తరువాత ప్యాకేజీ అన్నారని, మళ్లీ ఎన్నికలు వచ్చే సరికి హోదా అంటున్నారని, మళ్లీ ఏమంటారో తెలియదన్నారు. మొన్న ఎన్నికల్లో బీజేపీతో పొత్తు అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌తో పొత్తు అంటున్నారని, రోజుకో మాట..పూటకో వేషం వేస్తున్నారని, చంద్రబాబు మాటలు చూస్తే ఊసరవెళ్లి కూడా సిగ్గుపడుతుందన్నారు.

నిన్ను నమ్మం బాబూ..
జగనన్న ప్రత్యేక హోదా కోసం రోజుల తరబడి ధర్నాలు, నిరాహారదీక్షలు చేశారన్నారు. యువభేరిలు నిర్వహించారని గుర్తు చేశారు. వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు హోదా కోసం పదవులకు రాజీనామా చేశారన్నారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టింది వైయస్‌ఆర్‌సీపీనే అన్నారు. యూటర్న్‌ తీసుకున్న చంద్రబాబు చేతనైతే నిజం చెప్పాలని సవాలు విసిరారు. నాన్న ఒక మాట అనేవారని..చంద్రబాబు నెత్తిన శాపం ఉందని..చంద్రబాబు నిజం చెబితే ఆయన తల వెయ్యి ముక్కలవుతుందట అని వివరించారు. అందుకే చంద్రబాబు నిజం చెప్పరని పేర్కొన్నారు.
గత ఎన్నికల్లో 600 హామీలు ఇచ్చిన చంద్రబాబు ఏ ఒక్కటి కూడా పూర్తిగా నిలబెట్టుకోలేదన్నారు. వాటికి సమాది కట్టి మళ్లీ కొత్త హామీలు, అబద్ధాలు చెబుతున్నారని ఫైర్‌ అయ్యారు. ఇంకొక ఐదేళ్లు కావాలని అంటున్నారని, ఈయన్ను నమ్ముతారా అని ప్రశ్నించారు. నిన్ను నమ్మం బాబు అని టీడీపీ నేతలకు తేల్చి చెప్పాలని పిలుపునిచ్చారు. 

మాకు ఎవరితో పొత్తు లేదు:
మూడు నెలల వరకు కేసీఆర్‌తో పొత్తు పెట్టుకోవాలని చూసింది చంద్రబాబే అన్నారు. హరికృష్ణ చనిపోతే ఆయన భౌతికదేహం పక్కనే కేటీఆర్‌తో పొత్తు గురించి మాట్లాడారు. ఇన్నేళ్లు బీజేపీతో పొత్తు పెట్టుకుంది చంద్రబాబు. నాలుగేళ్లు హ్యాపీగా సంసారం చేశారు. మాకు కేసీఆర్,బీజేపీ, కాంగ్రెస్‌తో పొత్తు లేదని చెప్పారు. సింహాం సింగిల్‌గానే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వైయస్‌ జగన్‌కు ఎవరితో పొత్తులేదని, సింగిల్‌గానే వైయస్‌ఆర్‌సీపీ బంపర్‌ మెజారిటీతో గెలుస్తారని అన్ని సర్వేలు చెబుతున్నాయని వెల్లడించారు. 

మళ్లీ చంద్రబాబును నమ్ముతారా?
సొంత మామకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. ఈ ఐదేళ్లలో ఎంత మందికి వెన్నుపోటు పొడిచారో చూశామన్నారు. నాలుగు నెలల ముందు పసుపుకుంకుమ, పెంఛన్‌ పెంపు, నిరుద్యోగ భృతి అంటూ చేపలకు ఎర వేసినట్లు ఇస్తున్నారు. ఈ నాలుగు నెలలే కదా పింఛన్‌ పెంచింది. మళ్లీ చంద్రబాబును నమ్ముతారా? ఇన్నేళ్లు ఉద్యోగాలు ఇవ్వలేదు..ఇప్పుడు భృతి అంటున్నారు..నమ్ముతారా అని ప్రశ్నించారు. చిన్న పిల్లలకు చాకెట్లు వేసినట్లు అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నారు. తల్లిదండ్రులు కట్టిన ఫీజు వడ్డీతో సహా చెల్లించాలి. 

చంద్రబాబును బాకీ తీర్చమని అడగండి..
ఆడబిడ్డ పుడితే రూ.25 వేలు ఇస్తామన్నారు. ఈ ఐదేళ్లలో ఆడబిడ్డలను కనిన తల్లిదండ్రులు చంద్రబాబును ప్రశ్నించాలన్నారు. కాలేజీ విద్యార్థులకు ఐప్యాడ్‌ అన్నారు. మహిళలకు స్మార్ట్‌పోన్‌ ఇస్తామన్నారు. ఎన్నికలలోపు ఇవ్వమని డిమాండు చేయండి అన్నారు.ప్రతి ఇంటికి నెలకు రూ.2 వేల చొప్పున రూ.1.20 లక్షలు బాకీ పడ్డారు. పేదవారికి మూడు సెంట్ల భూమి ఇస్తామన్నారు. ఇళ్లు కట్టిస్తామన్నారు. అడగండి. రైతులు, చేనేతలు అందరూ ప్రశ్నించాలని షర్మిల పిలుపునిచ్చారు. 

డబ్బిస్తే..తీసుకోండి.
ఎన్నికలు వచ్చాయని చంద్రబాబు మీ ఓటును డబ్బుతో కొనాలని చూస్తున్నారు. మీకు డబ్బిస్తే తీసుకోండి..చంద్రబాబు ఎంత డబ్బిచ్చినా  మీ బాకీ తీరదన్నారు. ఇచ్చిన ప్రతి హామీని వసూలు చేయాలని సూచించారు. ఇప్పుడేమో మీ భవిష్యత్తు–నా బాధ్యత అంటున్నారు. ఈ ఐదేళ్లు ఆయన బాధ్యత కాదా? ఆయన కొడుక్కు మాత్రమే భరోసా కల్పించారన్నారు. ఇన్నాళ్లు చంద్రబాబు గాడిదలు కాశారా అని ప్రశ్నించారు.

రాజన్న బిడ్డకు ఒక్క అవకాశం ఇవ్వకూడదా?
తొమ్మిదేళ్లుగా విలువలతో కూడిన రాజకీయాలు చేసింది వైయస్‌ జగన్‌ ఒక్కరే అన్నారు. చంద్రబాబు మాదిరిగా అవతల పార్టీలో గెలిచిన వారిని తన పార్టీలోకి చేర్చుకోలేదన్నారు. 3468 కిలోమీటర్ల పాదయాత్ర చేసి, కోట్లాది మంది కష్టాలు విన్నారని, అర్థం చేసుకొని నేనున్నానని భరోసా ఇస్తున్నారని, రాజన్న బిడ్డకు ఒక్క అవకాశం ఇవ్వకూడదా? అన్నారు.

జగనన్న రావాలి
రాబోయే రాజన్న రాజ్యంలో రైతులకు ప్రతి ఏటా రూ.12500 ఇస్తారు, బిడ్డలను బడికి పంపిస్తే ప్రతి తల్లి చేతిలో రూ.15000 వేలు ఇస్తారు. మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు రూ.75 వేలు ఉచితంగా ఆర్థికసాయం చేస్తారని చెప్పారు. పింఛన్‌ రూ.2 వేల నుంచి రూ.3 వేలకు క్రమంగా పెంచుతూ పోతారని చెప్పారు. మీ పిల్లలు ఏం చదివినా పూర్తిగా ఉచితంగా చదివిస్తారు. ఆరోగ్యశ్రీ కింద ఏ ఆసుపత్రిలోనైనా చేరండి ప్రభుత్వమే భరిస్తుందన్నారు. చెప్పిందే కాదు..చెప్పంది చేస్తారని..మాట తప్పని వాడు..మడమ తిప్పని వ్యక్తి వైయస్‌ జగన్‌ అన్నారు. రాష్ట్రం మళ్లీ కళకళలాడాలంటే జగనన్న రావాలని కోరారు.

ప్రజా తీర్పు..బైబై బాబు..ఫ్యాన్‌ గుర్తుకే మీ ఓటు
వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ముస్తాఫా అన్న, ఎంపీ అభ్యర్థి వేణుగోపాల్‌రెడ్డి అన్నను గొప్ప మెజారిటీతో గెలిపించాలని వైయస్‌ షర్మిల విజ్ఞప్తి చేశారు. ఓటు వేసే సమయంలో ఒక్కసారి రాజన్న పాలన గుర్తు చేసుకోండి. జగనన్న ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయాలని, ప్రజాతీర్పు కావాలి..బైబై బాబు అంటూ నినదించారు.

 

Back to Top