ఒకసారి మోసపోయాం..మళ్లీ మళ్లీ మోసపోవద్దు.

సోమందేపల్లి సభలో వైయస్‌ జగన్‌ 

పెనుకొండ నియోజకవర్గంలో తాగునీటి సమస్య అధికంగా ఉంది

హంద్రినీవా ఫేజ్‌–1 వైయస్‌ఆర్‌ హయాంలో 80 శాతం పూర్తి

మిగిలిన 20 శాతం పనుల్ని చంద్రబాబు పూర్తి చేయలేదు

తాగునీళ్లు ఇవ్వరు కానీ..నదుల్లో ఇసుకను మాత్రం దోచేస్తున్నారు

బాబు పాలనలో ప్రభుత్వ కార్యాలయాల్లోనే హత్యలు జరుగుతున్నాయి

ఐదేళ్ల పాలనలో అన్ని వర్గాలను చంద్రబాబు మోసం చేశారు

చంద్రబాబుకు మళ్లీ ఓటేస్తే ఇళ్లు, భూములు ఏవీ మిగలవు

గోరంట్ల మాధవ్‌ను అడ్డుకునేందుకు బాబు నానారకాలుగా ప్రయత్నించారు

కొన్ని రోజులు ఓపిక పడితే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తుందని చెప్పండి

 

అనంతపురం: చంద్రబాబు మాటలు విని ఒకసారి మోసపోయారని, మళ్లీ మళ్లీ మోసపోవద్దని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సూచించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క వాగ్ధానం కూడా చంద్రబాబు నెరవేర్చలేదని, మళ్లీ ఆయనకు పొరపాటున ఓటు వేస్తే మన ఇల్లు మిగలదు..భూములు మిగలవని హెచ్చరించారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా పెనుకొండ నియోజకవర్గంలోని సోమందేపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ పాల్గొని ప్రసంగించారు. 

  • ఇదే నియోజకవర్గంలో..ఈ జిల్లాలో ఎలాంటి నీటి కొరత ఉందో వేరే చెప్పాల్సిన పని లేదు. రాజస్థాన్‌ తరువాత కరువు ఎక్కడైనా ఉంటుందనే చెప్పాలంటే అనంతపురం గురించి చెప్పాలి. ఇలాంటి జిల్లాకు ఎవరి హయాంలోనైనా మంచి జరిగిందంటే..చిత్తశుద్దితో నీరు తీసుకురావాలని ఆలోచన చేశారంటే అది ఒక్క దివంగత నేత వైయస్‌ రాజశేఖరరెడ్డి అని గర్వంగా చెబుతాను. నాన్న హయాంలో గొల్లపల్లి రిజర్వాయర్‌ పనులకు శ్రీకారం చుట్టారు. ఇవాళ పరిస్థితి చూస్తే..హంద్రీనీవా ఫెస్‌–1 పనులు 80 శాతం పనులు పూర్తి అయ్యాయి. మిగిలిన 20 శాతం పనులు, పిల్ల కాల్వలు కూడా పూర్తి చేయలేకపోయింది. 
  • ఇదే గోరంట్ల మండల కేంద్రంలో కనీసం తాగడానికి నీరు లేదంటే ఇంతకన్న దారుణం ఎక్కడైనా ఉంటుందా? ఐదేళ్లుగా ఇక్కడ తాగడానికి నీరు లేవని తెలిసి కూడా ట్యాంకర్లతో అప్పుడప్పుడు ఇస్తు డ్రామాలాడుతున్నారు.
  • ఇదే నియోజకవర్గానికి నీరు ఇవ్వాలన్న ఆలోచన పాలకులకు లేదు. ఇక్కడి నదులు పెన్నా, జయమంగళి, చిత్రావతి నుంచి ఇసుకను యధేచ్చగా తరలిస్తున్నారు. 
  • ఇదే నియోజకవర్గంలోని వేల ఎకరాలు ప్రభుత్వం భూములు సేకరించింది.ఈ పాలనలో ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా? కీయా మోటర్సుకు నరేంద్ర మోడీ ఆ కంపెనీతో చర్చిస్తే..ప్రధాని కారణంగా ఆ కీయా మోటర్స్‌ వచ్చింది. వచ్చిన కీయా మోటర్స్‌తో చంద్రబాబు చేసిన స్కామ్‌లు చూశాం. రైతులకు తక్కువ ధరలు ఇచ్చి భూములు కొనుగోలు చేశారు. ప్రభుత్వ పెద్దలు మాత్రం ఆ కంపెనీ చుట్టూ భూములు కొనుగోలు చేశారు. కీయా మోటర్స్‌ పేరు చెప్పి రైతుల నుంచి తీసుకున్న భూముల్లో చదును చేసేందుకు అక్షరాల రూ.177 కోట్లతో ఎల్‌ అండ్‌ టీ సంస్థకు కాంట్రాక్ట్‌ ఇచ్చారు. ఆ ఎల్‌ అండ్‌ టీ సంస్థ టీడీపీ నేతలకు సబ్‌కాంట్రాక్ట్‌ ఇచ్చి దోచేశారు. నిజంగా వీళ్లను పాలకులు అనాలా? రాక్షసులు అనాలా మీరే చెప్పండి. వచ్చిన కంపెనీలు వీరి కారణంగా వెనక్కి వెళ్తున్నాయి. బెల్‌ కంపెనీ, ఎయిర్‌ బస్సు కంపెనీలు వస్తున్నాయని చంద్రబాబు చెబుతున్నారు. ఈ కంపెనీలు ఎందుకు రాలేదని అడుగుతున్నాను. కారణం మీరు డబ్బాలైనా చెప్పి ఉండాలి. లేదా మీ లంచాలకు భయపడి వెనక్కి వెళ్లి ఉండాలి. ఒక్కసారి ఆలోచన చేయండి.
  •  ఐదేళ్ల చంద్రబాబు పాలనలో మనం చూసింది ఏమిటీ? రుణాలు మాఫీ చేస్తానని చెప్పి రైతులను మోసం చేశారు. డ్వాక్రా మహిళలను దగా చేశారు. సున్నా వడ్డీ రుణాలను ఎగరగొట్టారు. ఓట్ల కోసం చదువు అయిపోయిన చిన్న పిల్లలను వదిలిపెట్టలేదు. ప్రతి నెల రూ.2 వేల నిరుద్యోగ భృతి అన్నారు. అది ఇవ్వకుండా మోసం చేశారు. ప్రతి కులానికి ఒక పేజీ పెట్టి మేనిఫెస్టో అమలు చేయకుండా మోసం చేశారు.
  •  ఐదేళ్ల చంద్రబాబు పాలనలో మోసం..మోసం..మోసం కనిపిస్తుంది. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ఏమీ మిగలదు. ఆంధ్రప్రదేశ్‌లో ఏ ఒక్క ప్రభుత్వ స్కూల్‌ ఉండదు. ఇప్పటికే 6 వేల స్కూళ్లు మూత వేయించారు. పేదవారు ఎవరు కూడా తమ పిల్లలను బడికి పంపించే పరిస్థితి ఎక్కడా ఉండదు.  ప్రతి గ్రామంలోనూ నారాయణ స్కూళ్లు వస్తాయి. ఎల్‌కేజీ చదివించాలంటే లక్ష రూపాయాలు చెల్లించాల్సిందే.  ఇంజినీరింగ్, డాక్టర్‌ చదువులు చదివించలేకపోతున్నాం. ప్రభుత్వం ఇచ్చేది అరకొరగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తున్నారు. మళ్లీ చంద్రబాబుకు ఓటు వేస్తే..ఇంజీనీరింగ్‌ కాలేజీ ఫీజులు రూ.5 లక్షలకు పెరుగుతుంది.
  •  చంద్రబాబుకు పొరపాటున ఓటు వేస్తే ఆర్టీసీ చార్జీలు పెరుగుతాయి. ఈ ఐదేళ్లలో కరెంటు చార్జీలు, ఇంటి పన్నులు, స్కూల్‌ ఫీజులు, పెట్రోలు, డీజీల్‌ రేట్లు బాదుడే బాదుడు. వీర బాదుడే.
  •  అధికారంలోకి రాగానే పింఛన్లు తొలగిస్తారన్నది మర్చిపోవద్దు. రేషన్‌ కట్‌ చేస్తారు. 2014లో చంద్రబాబు సీఎం కాకముందు మన రాష్ట్రంలో పింఛన్లు 44 లక్షలు ఉండేవి. ఈయన 36 లక్షలకు కుదించారు.  వేలిముద్రలు పడటం లేదని రేషన్‌లో కొత విధించారు.  ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఉండదు. ఏమీ ఉండదు.  
  •  చంద్రబాబుకు పొరపాటున ఓటు వేస్తే రైతులకు రుణాలు ఉండవు. పావలా వడ్డీలు ఉండదు. 108 అంబులెన్స్‌ ఉండదు. 
  •  చంద్రబాబు పరిపాలనలో భూములు,ఇల్లు ఎప్పుడు పడితే అప్పుడు ఇష్టం వచ్చినట్లు లాక్కోవడానికి భూసేకరణ చట్టంలో సవరణలు చేశారు. వెబ్‌ ల్యాండ్‌లో భూ రికార్డులు తారుమారు చేశారు. పొరపాటున ఓటు వేస్తే భూములు..ఇల్లు ఏమీ మిగలవు.
  •  ఇప్పటికే ఇసుక, మట్టి, కొండలు, గుట్టలు, నదులు మిగలడం లేదు. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే మిగిలిన ఏది మిగలదు. ఇప్పటికే ఇసుక లారీ రూ.40 వేలు పలుకుతుంది. చంద్రబాబుకు ఓటు వేస్తే రూ.1 లక్ష పలుకుతుంది.
  •  గ్రామాల్లో జన్మభూమి మాఫియా కనిపిస్తోంది. పింఛన్, రేషన్‌ కార్డు కావాలన్నా లంచం ఇవ్వాల్సిందే. మరుగుదొడ్డి కావాలన్నా లంచాలు అడుగుతున్నారు. జన్మభూమి కమిటీలు మీరు ఏ పార్టీ అని అడుగుతున్నారు.మళ్లీ చంద్రబాబు వస్తే మీకు సంక్షేమ పథకాలు కావాలంటే లంచాలు ఇవ్వాల్సిందే. వాళ్లకు నచ్చిన సినిమాలే చూడాలి. వాళ్లకు నచ్చిన స్కూళ్లకే వెళ్లాలి. ఇవేవి చేయకపోతే పింఛన్‌ కట్, రేషన్‌ కట్, మరుగుదొడ్డి ఇవ్వమని జన్మభూమి కమిటీలు చెబుతాయి.
  •  గ్రామాల్లో ఎలా అరాచకాలు జరుగుతున్నాయో మీరు చూస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయంలోనే హత్యలు జరుగుతున్నాయి. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ..తనను వ్యతిరేకించేవారిని ఎవర్ని కూడా చంద్రబాబు బతకనివ్వరు. తన మనుషులనే పోలీసులుగా చంద్రబాబు పెట్టుకున్నారు. మీడియా కూడా పూర్తిగా అమ్ముడపోయింది. హత్యలు చేసినా, నేరాలు చేసినా రాసేవారు ఉండరు. చూపే నాథుడు ఉండరు. వాళ్లే చంపి..వాళ్ల బంధువులే చంపారని రివర్స్‌లో ప్రచారం చేస్తారు.
  •  బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకు ఉద్యోగాలు ఉండవు, జడ్జీలుగా బీసీలకు అవకాశం వస్తే..చంద్రబాబు లేఖ రాస్తూ..వీరు అర్హులు కారన్నారు. మన మాధవ్‌ పక్కనే ఉన్నారు. పాపం సీఐ ఉద్యోగం చేసేవారు. మన పార్టీ నుంచి టిక్కెట్టు ఇస్తే సీఐ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఎక్కడ ఎంపీ అయిపోతాడో అని భయంతో చంద్రబాబు ఈయన రాజీనామా ఆమోదించకుండా అడ్డుపడ్డారు. చంద్రబాబుకు పొరపాటున ఓటు వేస్తే బీసీలు, ఎస్సీలు బతకరు.
  •  చంద్రబాబు చివరి మూడు నెలల్లో చూపుతున్న సినిమాలు ఎవరైనా పొరపాటున నమ్మితే..టీవీ చానళ్లలో వస్తున్న ప్రకటనలు నమ్మితే నరమాంసం తినే వ్యక్తిని నమ్మినట్లే. ఒక్కసారి మోసపోయాం..మళ్లీ మళ్లీ మోసపోవద్దు. ఈ చెడిపోయిన వ్యవస్థలోకి విశ్వసనీయత అనే పదానికి అర్థం రావాలి. రాజకీయ నాయకుడు ఇచ్చిన వాగ్ధానం నెరవేర్చకపోతే ఆ పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లాలి. అప్పుడే ఈ వ్యవస్థలో మార్పు వస్తుంది. 
  •  13 రోజుల్లో ఎన్నికలు జరుగబోతున్నాయి. ఇప్పటికే చంద్రబాబు ప్రతి రోజు ఒక సినిమా చూపుతున్నాడు. ఆ అబద్ధాన్ని ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 చానల్స్‌ ఉన్నవి లేనట్లుగా చూపుతున్నారు. రాబోయే రోజుల్లో కుట్రలు, మోసాలు ఎక్కువవుతాయి. రాబోయే రోజుల్లో గ్రామాలకు మూటలు మూటల  డబ్బులు పంపిస్తారు. ప్రతి ఒక్కరి చేతుల్లో రూ.3 వేలు డబ్బులు పెడతారు. మళ్లీ మోసం చేస్తారు. మీరంతా కూడా గ్రామాల్లోని ప్రతి ఒక్కరిని కలిసి..ప్రతి ఒక్కరికి చెప్పండి. చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దు..20 రోజులు ఓపిక పడితే అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. మన బతుకులు మారుతాయని చెప్పండి.      
Back to Top