ఉద్యోగాల విప్లవానికి నాందీ 

జూపాడుబంగ్లా మండలంలో మెగా అల్ట్రాఫుడ్‌ ఫార్క్‌ సంగతేంటి?

నందికొట్కూరులో వంద పడకల ఆసుపత్రి హామీ ఏమైంది?

హంద్రీనీవా నుంచి నీళ్లిచ్చేలా చర్యలు తీసుకుంటానని బాబు మాటిచ్చాడు

దేశంలో ధనిక ముఖ్యమంత్రుల్లో బాబు ఒకరు

ఇక్కడి రైతు మాత్రం దేశంలోనే అత్యంత పేదవాడు

మీ భవిష్యత్తు..నా భరోసా అంటూ బాబు మళ్లీ మోసం

ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా

నందికొట్కూరు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఉద్యోగాల విప్లవానికి నాందీ పలుకుతానని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. చంద్రబాబు పాలనలో ఏ ఒక్కరికి ఉద్యోగం ఇవ్వలేదని, ఎన్నికలకు మూడు నెలల ముందు ముష్టి రూ.1000 ఇచ్చి చేతులు దులుపుకున్నారని, ఆయన కుమారుడికి మాత్రమే ఉద్యోగం ఇచ్చారని విమర్శించారు. ఎన్నికలు వచ్చేసరికి మీ భవిష్యత్తు–నా భరోసా అంటూ మళ్లీ మోసం చేసేందుకు వస్తున్నారని, ఆయన మాటలు నమ్మకండి అంటూ పిలుపునిచ్చారు. చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని, అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందామని అందరికి చెప్పాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగం కర్నూలు జిల్లా నందికొట్కూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ..

ముచ్చుమ్రరి ఎత్తిపోతల పథకం ఈ ప్రాజెక్టు కట్టాలని, ఈ ప్రాంతానికి మంచి చేయాలని ఎవరూ గతంలో ఆలోచన చేయలేదు. ఎందరో ముఖ్యమంత్రులను చూశాం. కానీ చేసిందెవరు అంటే అది ఆ దివంగత నేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే జరిగింది. వైయస్‌ఆర్‌ హయాంలో 80 శాతం పనులు పూర్తయ్యాయి. 12 పంపులు పెట్టి ఒకొక్క పంపుద్వారా 15 వందల క్యూసెక్కుల నీటిని పంపు చేసి ఈ ప్రాంతానికి మేలు చేయాలనే ఆలోచనతో వైయస్‌ఆర్‌ గొప్ప ప్రాజెక్టును తీసుకొచ్చారు. ఐదు సంవత్సరాల చంద్రబాబు పాలనలో మిగిలిపోయి ఉన్న 20 శాతం పనులు కూడా పూర్తి కాని పరిస్థితి. 12 పంపులకు గానూ, 4 పంపులు పెట్టారు. అందులో 2 మాత్రమే పనిచేస్తున్నాయట. ఒక్కో పంపు 15 వందల క్యూసెక్కుల నీటిని పంపు చేయాల్సి ఉంటే కేవలం 750 క్యూసెక్కుల నీటిని పంపుచేస్తున్న అన్యాయమైన పరిస్థితి. 

కేసీ కెనాల్‌ కింద మార్చి వరకు రెండో పంటకు కూడా సాగునీరు ఇవ్వాలి. అలాంటిది మొదటి పంటకు కూడా సాగునీరు అందించలేని అధ్వాన్నమైన పరిస్ధితిలో వ్యవస్థను నడుపుతున్నారు. బడకచర్ల వద్ద రెగ్యులేటర్‌ విస్తరణ చేపట్టాలని, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు కట్టాలని తద్వారా రాయలసీమకు మంచి జరుగుతుందని, 44 వేల క్యూసెక్కుల నీటిని అక్కడ నుంచి తీసుకురావాలని, ఈ ప్రాంతానికి మంచి చేయాలని ఆలోచన చేసిన వ్యక్తి దివంగత నేత వైయస్‌ఆర్‌ అని గర్వంగా చెప్పొచ్చు. బడకచర్ల వద్ద రెగ్యులేటర్‌ విస్తరణ పనులు కూడా పూర్తి చేయలేదు. నాన్నగారి హయాంలోనే 80 శాతం పూర్తయిన పనులు ఇవాల్టికి నత్తనడకన సాగుతున్నాయంటే వీళ్లకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉందని ఆలోచన చేయాలి. 

హంద్రీనీవా నుంచి మిడ్తూరు, నందికొట్కూరు, జూపాడు బంగ్లా మండలాల్లోని చెరువులకు ఎత్తిపోతల ద్వారా నీరు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో మాట ఇచ్చారు. ఇది జరిగిందా.. అని అడుగుతున్నా.. ముఖ్యమంత్రి హోదాలో మాట ఇస్తే ఆ మాట నెరవేర్చని పరిస్థితి రాష్ట్రంలో చూస్తున్నాం. రైతన్న పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఈ ప్రాంత పంటలు చూస్తే బాధ అనిపిస్తుంది. వరికి కనీస మద్దతు రూ. 1750 క్వింటాల్‌కు అంటారు. అదే క్వింటాల్‌కు రూ. 12 వందలు కూడా రాని పరిస్థితుల్లో వ్యవసాయం జరుగుతుంది. మొక్కజొన్న పంటకు కనీస మద్దతు ధర రూ. 17 వందలు, రైతులకు కనీసం రూ. 11 వందలు రాని పరిస్థితి, ఇదే శనగకు కనీస మద్దతు ధర రూ. 5200 అయితే కనీసం రూ. 3500 కూడా రాని పరిస్థితుల్లో రైతులు వ్యవసాయం చేస్తున్నారు. జూపాడు బంగ్లా మండలాన్ని మెగా ఆల్ట్రా ఫుడ్‌ పార్కుగా మార్చుతామన్నారు. జరిగిందా అని అడుగుతున్నా.. నందికొట్కూరు మండలంలో 30 పడకల ఆస్పత్రిని 100 పడకలు చేస్తామన్నారు. ఇది జరిగిందా అని అడుగుతున్నా.. ముఖ్యమంత్రి హోదాలో ఇచ్చిన హామీకి ఇవాళకు దిక్కు లేని పరిస్థితుల్లో ఉన్నారంటే.. ఒక మాట అంటే ఆ మాటను పాటించాలని ఏ మాత్రం చిత్తశుద్ధి ఉందా అని అడుగుతున్నా.. 

చంద్రబాబు ఐదేళ్ల పాలన తరువాత అత్యంత ధనిక సీఎంలో చంద్రబాబు మొదటి స్థానంలో ఉన్నారు. మన ముఖ్యమంత్రి దేశంలో అత్యంత ధనికుడు అయితే మన రైతు మాత్రం దేశంలోనే అత్యంత పేద అని రిపోర్టులు చెబుతున్నాయి. అత్యంత రుణభారంలో రైతులు ఉన్నారని నాబార్డు నివేదిక చెబుతుంది. మన పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల అప్పులు చూస్తే ఐదేళ్లలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేనాటికి రూ. 14,200 కోట్లు అయితే.. ఈ ఐదేళ్లలో వడ్డీలతో కలిసి రూ. 26 వేల కోట్లకు ఎగబాకాయి. ఈ మాదిరిగా పెరిగాయని సాక్షాత్తు చంద్రబాబు ఆధ్వర్యంలో స్టేట్‌ లెవల్‌ బ్యాంకర్లు మీటింగ్‌లు పెట్టి రిపోర్టులు ఇచ్చారు. 

రాష్ట్రంలో నిరుద్యోగ సోదరుల సంఖ్య రెట్టింపు అయిపోయింది. ఏ పట్టణం, ఏ గ్రామం చూసినా చదువులు అయిపోయి ఉద్యోగాల కోసం ఎక్కడకు పోవాలన్నా అనే మాటలు వినిపిస్తున్నాయి. బాబు బాగుంటే.. రాష్ట్రం బాగున్నట్లా.. లేక ప్రజలు బాగుంటే రాష్ట్రం బాగున్నట్లా.. ఎక్కడైనా ప్రజలు బాగుంటేనే రాష్ట్రం బాగున్నట్లు, కానీ మన రాష్ట్రంలో చంద్రబాబు బాగుంటే రాష్ట్రం బాగున్నట్లని చెబుతుంది ఎల్లో మీడియా.. జాబు రావాలంటే బాబు రావాలన్నారు.. ఐదేళ్ల తరువాత అడుగుతున్న జాబు రావాలంటే బాబు పోవాలి. చంద్రబాబు ప్రభుత్వంలో గత ఐదేళ్లలో జాబుల కోసం మీ చుట్టూ ఉన్న గ్రామాల్లో డిగ్రీలు పూర్తయిపోయి ఉన్న నిరుద్యోగులను చూడండి.. ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాలకు వలసలు పోతున్నారు. రాష్ట్రంలో అక్షరాల 1.75 కోట్ల ఇళ్లు ఉంటే.. ఇంటికో ఉద్యోగం.. ఉద్యోగం ఇవ్వలేకపోతే నెలకు రూ. 2 వేల నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు.. మీలో ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా.. లేకపోతే 60 నెలలకు రూ. 1.20 లక్షలు ఇచ్చారా అని అడుగుతున్నా.. ఏ ఒక్కరికీ ఉద్యోగం రాలేదు. నెల నెల ఇస్తానని చంద్రబాబు చెప్పిన భృతి అందలేదు. కానీ ఉద్యోగం వచ్చింది చంద్రబాబు కొడుక్కు మాత్రమే వచ్చింది. ఎమ్మెల్సీ ఉద్యోగం, ప్రమోషన్‌ ఇచ్చి మంత్రిగా కూడా చేశాడు. 

చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఉద్యోగాలు ఏవీ అని అడిగితే బాబు నోట్లో నుంచి మాటలు రావు.. ఎన్ని ఉద్యోగాలు ఊడిపోయాయని చూస్తే అనేక ఉదాహరణలు కనిపిస్తాయి. బాబు ముఖ్యమంత్రి అయిన తరువాత 30 వేల మంది ఆదర్శ రైతుల ఉద్యోగాలు గోవింద. గృహ నిర్మాణ శాఖలో కంప్యూటర్‌ ఆపరేటర్లు, వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు 3500 మంది ఉద్యోగాలు గోవింద, వెయ్యి మంది గోపాల మిత్ర ఉద్యోగాలు గోవింద, ఆయుష్‌లో పనిచేస్తున్న 8 మంది ఉద్యోగాలు గోవింద, సాక్షరభారత్‌లో పనిచేస్తున్న 30 వేల మంది ఉద్యోగాలు గోవింద, బాబు ముఖ్యమంత్రి అయిన తరువాత మధ్యాహ్న భోజన కార్మికులు 85 వేల మంది ఉద్యోగాలు గోవింద, ఉద్యోగాలు అన్ని గోవింద, మిగిలిన పోయినవారు జీతాలు పెంచమని అడిగితే.. వారిపై పోలీసులతో దాడి చేయిస్తున్నాడు. 57 నెలలు అన్యాయాలు చేసి చివరి మూడు నెలలు మాత్రం నిరుద్యోగ భృతి అంట. రాష్ట్రంలో కోటి 75 లక్షల మంది ఉంటే కేవలం 3 లక్షల మందికే అది కూడా నెలకు రూ. వెయ్యి ముష్టివేసినట్లు ఇస్తాడంట. ఎన్నికలకు మూడు నెలల ముందు సినిమా చూపించి.. ఇదే గొప్ప పాలన అంటూ చూపిస్తున్నాడు. 

రాష్ట్రం విడగొట్టినప్పుడు లక్షా 40 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కమల్‌నాథన్‌ కమిటీ తేల్చింది. ఆ ఉద్యోగాలన్నీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే నోటిఫికేషన్‌ ఇస్తాడని ఉద్యోగాలు సాధించాలని వేలకు వేలు తగలేసి కోచింగ్‌ తీసుకుంటున్నారు. ఆ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ కూడా రాలేదు. పైగా ఈ ఐదు సంవత్సరాల్లో రిటైర్డ్‌ అయినవారిని కలుపుకుంటే అక్షరాల 2.30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఒక్క ఉద్యోగం ఇవ్వని ఘనత చంద్రబాబుది. ఇవాళ గ్రామాల్లో ఉన్న పరిస్థితులు నేను చూశా. చదువు అయిపోయిన తరువాత ఉద్యోగాల కోసం యువత పడుతున్న బాధలు చూశా. ప్రతి ఇంట్లో అవస్థలు పడుతున్న పిల్లల ఆవేదన నేను విన్నాను.. మీ కష్టాన్ని నేను చూశా.. మీ బాధను నేను విన్నా.. నేను ఉన్నానని మీ అందరికీ మాటిస్తున్నాను. 

దేవుడి దయ, మీ అందరి ఆశీర్వాదంతో మన ప్రభుత్వం వచ్చిన తరువాత ఉద్యోగాలు కల్పించేందుకు వైయస్‌ఆర్‌ సీపీ ఏం చేయబోతుందో చెబుతా.. మన ప్రభుత్వం వచ్చిన తరువాత మొట్టమొదటగా మనం చేయబోయేది.. ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలు మొత్తం రిలీజ్‌ చేస్తానని హామీ ఇస్తున్నా. అంతేకాదు.. జనవరి 1వ తేదీ వచ్చే సరికి ప్రభుత్వ ఉద్యోగాల క్యాలెండర్‌ ప్రతి సంవత్సరం విడుదల చేస్తాం. మన ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రతి గ్రామంలో గ్రామ సెక్రటేరియట్‌ తెరుస్తాం. మీ ఊరులోనే చదువుకున్న 10 మంది పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేట్లుగా చేస్తానని హామీ ఇస్తున్నా.. అదే గ్రామంలో ప్రతి 50 ఇళ్లకు ఒకరిని గ్రామ వలంటీర్‌ను తీసుకుంటాం. ఆ గ్రామ వలంటీర్లకు నెలకు రూ. 5 వేల వేతనం ఇస్తాం. ఆ గ్రామంలో ఉన్న వలంటీర్‌ గ్రామ సెక్రటేరియట్‌తో అనుసంధానమై ఆ ఇళ్లకు ప్రతి సంక్షేమ పథకం డోర్‌ డెలవరీ చేస్తాడని హామీ ఇస్తున్నా. ఎవరి చుట్టూ ఎవరు తిరగాల్సిన పనిలేదు. ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన పనిలేదు. 50 ఇళ్లకు వలంటీర్, గ్రామ సెక్రటేరియట్‌ పెట్టి ప్రతి పథకాన్ని మీ ఇంటికి నేరుగా అందజేస్తామని మాటిస్తున్నా.. 

ప్రభుత్వ పథకాలు అందజేసేటప్పుడు కులాలు చూడం, మతాలు చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడమని భరోసా ఇస్తున్నా. అంతేకాకుండా పరిశ్రమల కోసం మన భూములు తీసుకుంటున్నారు. ఉద్యోగాలు మాత్రం మన పిల్లలకు రావడం లేదు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మొదటి శాసనసభలోనే ఒక చట్టం తీసుకువస్తాం. 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలనే చట్టంలో తీసుకువస్తాం. అంతేకాకుండా.. మన పిల్లలు ఆ పరిశ్రమల్లో పనిచేయడానికి ప్రతి జిల్లాలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లు తీసుకొస్తా.. పరిశ్రమల్లో ఉద్యోగాలను బట్టి ఉచితంగా ట్రైనింగ్‌ ఇస్తారు. అంతేకాదు ఇంకొక అడుగు ముందుకువేసి గవర్నమెంట్‌ కాంట్రాక్టులు చూస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రైవేట్‌ బస్సులు కూడా నడుస్తున్నాయి. ఆ ప్రైవేట్‌ బస్సుల కాంట్రాక్ట్‌ జేసీ బ్రదర్స్, కేశినేని ట్రావెల్స్‌కు అప్పగిస్తున్నారు. ఇది పూర్తిగా మార్చేస్తాం. ఏ గవర్నమెంట్‌ కాంట్రాక్టులో అయినా సరే బస్సులు, కార్లు, అన్ని నిరుద్యోగ యువతకే ఇస్తామని హామీ ఇస్తున్నా. ఆ నిరుద్యోగ యువత కార్లు అద్దెకు పెట్టాలన్నా.. దాని కోసం పెట్టుబడి కింద సబ్సిడీ కూడా ఇస్తామని హామీ ఇస్తునాన.. అంతేకాదు ఇంకా ఒక అడుగు ముందుకు వేసి నిరుద్యోగ యువతకు ఇచ్చే ఈ లబ్ధి బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలకు 50 శాతం చెందేలా చేస్తాం. ఆ తరువాత దేవుడు ఆశీర్వదించి 25 ఎంపీ స్థానాలు మీ చల్లని దీవెనలతో సాధిస్తే ప్రత్యేక హోదా ఇచ్చిన తరువాతే మద్దతు తెలిపే కార్యక్రమం చేస్తాం కేంద్రంలో ఉన్న ఏ పార్టీకైనా. ప్రత్యేక హోదాతో హోటళ్లు, పరిశ్రమలు, ఆస్పత్రులు వస్తాయి. హోదా వస్తే జీఎస్టీ, ఇన్‌కం ట్యాక్స్‌ కట్టాల్సిన పనిలేదు. ఒక ఉద్యోగాల విప్లవానికి నాంది పలుకుతాం. మీ అందరి చల్లని దీవెనలు కావాలని కోరుతున్నా.. 

ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి మార్పు తీసుకురావాలని, విశ్వసనీయ పదానికి అర్థం తీసుకురావాలని కోరుతున్నా. చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో మార్పు తీసుకువచ్చేందుకు సహకారం అందించాలని కోరుతున్నా.. రాజకీయ నాయకుడు మైక్‌ పట్టుకొని ఏదైనా చెబితే.. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన మాట నెరవేర్చకపోతే తన పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లే పరిస్థితి తీసుకురావాలి. అప్పుడే మార్పు వస్తుంది. విశ్వసనీయత అనే పదానికి అర్థం కూడా వస్తుంది. మరో 13 రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో చంద్రబాబు చేయని కుట్ర ఉండదు. చంద్రబాబు చేయని మోసం, డ్రామా ఉండదు. చూపని సినిమా కూడా ఉండదని ఎవరూ మర్చిపోవద్దు. రోజూ టీవీ చూసినా.. పేపర్లు చూసినా ఉన్నది లేనట్లుగా.. లేనిది ఉన్నట్లుగా చూపిస్తారు. 

నవరత్నాలతో ఏమేం మేలు జరుగుతుందని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలి. ఎన్నికలు వచ్చే సరికి చంద్రబాబు కుట్రలో భాగంగా గ్రామాలకు మూటల మూటల డబ్బులు పంపిస్తాడు. ప్రతి చేతిలో రూ. 3 వేలు పెట్టే ప్రయత్నం చేస్తాడు. మీ అందరితో ఒక్కటే కోరుతున్నా.. ఎన్నికలు వచ్చే నాటికి ఓట్లను కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తాడు. మీ గ్రామాల్లో, మీ వార్డుల్లో మీరంతా ప్రతి అక్కను, ప్రతి చెల్లెమ్మను, ప్రతి అవ్వ, తాతను, ప్రతి అన్నను కలవండి. డబ్బులకు మోసపోవద్దు అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం.. నవరత్నాలతో ప్రతి ఇంటిలో సంతోషం నింపుతాడని ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. మన పిల్లలను ఇంజనీర్, డాక్టర్, కలెక్టర్‌ వంటి పెద్ద చదువులను ఎన్ని లక్షలు ఖర్చు అయినా అన్న చదివిస్తాడని చెప్పండి. 

అదే విధంగా అన్న ముఖ్యమంత్రి అయిన తరువాత పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు ఉన్న రుణమంతా నాలుగు దఫాలుగా మీ చేతుల్లోనే పెడతాడని, సున్నావడ్డీలకే రుణాలు అందిస్తాడని చెప్పండి. ఆరోగ్యశ్రీ పథకాన్ని మెరుగుపరిచి వైద్యం ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే దాన్ని ఆరోగ్యశ్రీ కిందకు తీసుకువస్తాడని చెప్పండి.  వైయస్‌ఆర్‌ చేయూత పథకం తీసుకువచ్చి 45 నుంచి 65 సంవత్సరాల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు రూ. 75 వేలు దఫాలుగా అన్న ఇస్తాడని చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అయిన తరువాత అవ్వాతాతలకు పెన్షన్‌ రూ. 3 వేలకు పెంచుకుంటూ పోతాడని చెప్పండి. రైతులకు పంట పెట్టుబడి కోసం రూ. 12500 అందజేస్తాడని, అక్షరాల రూ. 50 వేలు అందించి వ్యవసాయాన్ని అన్న పండుగ చేస్తాడని చెప్పండి. అదే విధంగా ఇల్లు లేని ప్రతి నిరుపేదకు పక్కా ఇళ్లు ఇస్తాడని, అక్షరాల 25 లక్షల ఇళ్లు కట్టిస్తాడని చెప్పండి. 

మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆర్తర్‌ నిలబెడుతున్నాడు.. మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు ఆర్తర్‌ అన్నపై ఉంచాలని, అదే రకంగా బ్రహ్మానందరెడ్డి అన్న ఎంపీగా నిలబడుతున్నాడు.. మీ అందరి చల్లని దీవెనలు సంపూర్ణంగా వీరిద్దరిపై ఉంచాలని పేరు పేరునా కోరుతున్నా.. బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని నా గుండెల్లో పెట్టుకుంటాను.. రాజకీయంగా పైకి తీసుకువస్తానని మాటిస్తున్నాను. మీ నియోజకవర్గంలో ఏం జరుగుతున్నాయో మీకు తెలుసు దశాబ్దాలుగా యుద్ధం చేసిన వారు ఇవాళ ఏకమయ్యారు. మన పార్టీకి సిద్ధార్థ వంటి యువకులు తోడుగా ఉన్నారు. మన పార్టీ యువకుల పార్టీ అని చెప్పడానికి గర్వపడుతున్నా.. చివరకు మన పార్టీ గుర్తు ఫ్యాన్‌ అని ఎవరూ మర్చిపోద్దు. 

 

Back to Top