కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకే పట్టిసీమ

హైదరాబాద్: కాంట్రాక్టర్లు, నేతల జేబులు నింపేందుకే పట్టిసీమ ప్రాజెక్టును ప్రభుత్వం తలపెట్టిందని వైఎస్సార్ సీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇందుకోసమే ఆగమేఘాల మీద రూ.1300 కోట్లు కేటాయిస్తూ జీవో జారీ చేశారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టు ఉండగా మరలా పట్టిసీమ ప్రాజెక్టు చేపట్టడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ సీపీ ఎంపీ మైసూరా రెడ్డి, ఎమ్మెల్యేలు భూమా అఖిలప్రియ, షేక్ బే పారి అం జాద్ బాషా విలేకరులతో మట్లాడారు.
పోలవం ప్రాజెక్టును 2018 నాటికి పూర్తి చేస్తామని గణతంత్ర వేడుకల్లో గవర్నర్ ప్రసంగంలో పేర్కొనడాన్ని, సీఎం, మంత్రులూ ఇదే మాట చెప్పడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. మరి పోలవం ఉండగా కొత్తగా పట్టిసీప ప్రాజెక్టు ఎందుకు నిర్మించాల్సి వస్తోందని ప్రశ్నించారు. పట్టిసీమ ప్రాజెక్టు వ్యవహారం ప్రాంతీయ విభేదాలకు దారి తీసేలా ఉందన్నారు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) ఇతర అనుమతులు, టెండర్లు ప్రక్రియ, ఇతర అనుమతులు  పూర్తయ్యేనాటికి కనీసం మూడేళ్ల వ్యవధి పడుతుందన్నారు.
పోలవరం నిర్మాణం నాలుగేళ్లలో పూర్తవుతుందని అధికార పక్షం విశ్వాసం వ్యక్తం చేస్తున్నపుడు మరి పట్టిసీమ ప్రాజెక్టు ఎందుకని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రూ.1300 కోట్లు వృథా చేయడమెందుకు? అని మైసూరా ప్రశ్నించారు. ఉద్యోగుల  జీతభత్యాల కోసం రిజర్వ్‌బ్యాంకు వద్దకు ఓవర్‌డ్రాఫ్ట్ రిజర్వు బ్యాంకు దగ్గరకు వెళుతున్న  ప్రస్తుత పరిస్థితుల్లో వందల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేయడం ఎందుకని నిలదీశారు. ఈ ప్రాజెక్టు పూర్తయినా ప్రయోజనం ఉండదని, నిరర్థక ప్రాజెక్టుగా మిగిలిపోతుందన్నారు. కృష్ణా, గోదావరి నదులకు ఒకేసారి వరదలు వస్తున్నాయి. అలాంటపుడు ఒక చోట నుంచి మరో చోటకు నీటి తరలించే అవకాశం ఉండదు. కనక ఇది నిరర్థక ప్రాజెక్టుగానే మిగిలిపోతుంది. ఎమ్మెల్యే అఖిలప్రియ మాట్లాడుతూ.. పోలవరమైనా, పట్టిసీమ ప్రభుత్వం రైతుల భూములు లాక్కుంటోందని విమర్శించారు.

ప్రత్యేక హోదా హుళక్కే ?

తాము అధికారంలోకి వస్తే రాష్ట్రానికి పదేళ్లపాటు ప్రత్యేకహోదా ఇస్తామని ప్రకటించిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం, కేంద్రం తీరు చూస్తుంటే ప్రత్యేక హోదాపై మాట తప్పేలా ఉన్నారని అన్నారు.
Back to Top