వైయస్‌ఆర్‌సీపీకి ఏపీ ప్రయోజనాలే ముఖ్యం

వైయస్‌ జగన్‌ అంటే చంద్రబాబుకు వణుకు..

చంద్రబాబు పిరికిపందలా వ్యవహరిస్తున్నారు.

భయంతోనే చంద్రబాబు దిగజారుడు వ్యాఖ్యలు

వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వాసురెడ్డి పద్మ

హైదరాబాద్‌: వైయస్‌ఆర్‌సీపీకి ఏపీ ప్రయోజనాలే ముఖ్యమని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు.హైదరాబాద్‌లో వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు.తెలంగాణ ప్రాజెక్టులతో ఏపీకి నష్టం జరిగితే చంద్రబాబు ఎందుకు ప్రశ్నించలేదని ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో స్వార్థ ప్రయోజనాల కోసం ఆంధ్రా,తెలంగాణ  ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అనుమతులు లేకుండా నీటి ప్రాజెక్టులు కడుతుంటే..అనుమతులు లేకుండా ఎలా కడుతున్నారని కేసీఆర్‌ని ఒక మాట కూడా చంద్రబాబు అడగలేదన్నారు.నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు సంబంధించి నీరు కిందకు రాకుండా తెలంగాణ వాడుకున్నప్పుడు చంద్రబాబు నోరు ఏమైంది.. 2015,16,17 సంవత్సరాల్లో శ్రీశైలం నీటిని తెలంగాణ ప్రభుత్వం వదిలివస్తుంటే చంద్రబాబు చోద్యం  చూశారా అని ప్రశ్నించారు.

హైదరాబాద్,ఉమ్మడి రాజధాని,సంస్థల విషయంలో రాజీ పడినట్లు చెప్పిన వ్యక్తి చంద్రబాబు కదా..ఉమ్మడి రాజధాని విషయంలో రాజీపడి  పారిపోయి రాజధాని వచ్చానని స్వయంగా చెప్పుకున్న చంద్రబాబు..ఐదేళ్ల పాటు నోరు మూసుకుని..కేసీఆర్‌ అడుగులకు మడుగులు లెత్తి..నేడు ఎన్నికల కోసం ఆంధ్ర,తెలంగాణ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.నిజానికి మోదీకి భయపడ్డారు.ఆ తర్వాత కేసీఆర్‌కు భయపడ్డారు. తొమ్మిదేళ్లుగా మిమ్మలి భయపెడుతుంది వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని అన్నారు. జగన్‌ అనే మూడు అక్షరాలను చూసి చంద్రబాబు గజగజ వణికిపోతున్నారన్నారు. భయంతో దిగజారుడు మాటలు మాట్లాడుతున్నాడన్నారు. ఓటుకు నోటుకు కేసులో భయపడి ఆంధ్రను తాకట్టు పెట్టారన్నారు.చంద్రబాబును బ్రహ్మదేవుడు కూడా కాపాడలేరు అన్న కేసీఆర్‌..ఆ తర్వాత ఆ కేసు ముందుకు ఎందుకు కదలలేదు.

చంద్రబాబు సమాధానం చెప్పగలరా.మోదీకి భయపడి ప్రత్యేకహోదా,అన్ని  హక్కులను వదిలేసి దాక్కున్నది ఎవరు..చంద్రబాబు కాదా..ప్రత్యేకహోదాకు సంబంధించి మోదీ,చంద్రబాబు కలిసి మాయా చేశారు.నీతి ఆయోగ్‌ ప్రత్యేకహోదా వద్దని చెప్పిందని చంద్రబాబు చెప్పారు.అదే మాట వెంకటయ్యనాయుడు కూడా చెప్పారన్నారు. నీతి ఆయోగ్‌ చాటున ప్రత్యేకహోదాను పాతిపెట్టారన్నారు.రాష్ట్ర ప్రజలందరూ ప్రత్యేకహోదా కావాలంటే..కేంద్ర ఏం మాట్లాడమంటే అది మాట్లాడలేదా అని ప్రశ్నించారు.ప్రత్యేకహోదా ఎందుకు కావాలో మీతో చెప్పించింది వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కాదా అనిప్రశ్నించారు.కేసీఆర్‌కు ఐదేళ్ల పాటు దాసోహం అవ్వలేదా. అనుమతులు లేకుండా  ప్రాజెక్టులు కడుతుంటే..మా ఆంధ్ర ప్రజలకు నీళ్లు ఎలా వస్తాయని అని వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దీక్ష చేశారని గుర్తుచేశారు.ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.

నీళ్లు,ఉమ్మడి రాజధాని, ఆస్తులు విషయంలో కూడా కేసీఆర్‌ను చంద్రబాబు అడగలేదన్నారు.హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్ర ప్రజల గురించి ఒక్క మాట మాట్లాడలేదని.నేడు చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాలు కోసం రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు.ఈ ఐదేళ్లలలో సెక్షన్‌ 8 ఎందుకు గుర్తుకురాలేదు అని ప్రశ్నించారు.ఏపీని మోకరిల్లే పరిస్థితికి చంద్రబాబు తీసుకొచ్చారన్నారు. కేసీఆర్‌కు రెడ్‌ కార్పెట్‌ పరిచిన చంద్రబాబుకు నేడు ఆయన మీద రోషం వస్తుందంటే..ఆంధ్ర ప్రజలు పిచ్చివాళ్లు అనుకున్నావా అని ప్రశ్నించారు.ఆం్ర«ధ రాష్ట్రం బాగోగులు కోసం ఇతర రాష్ట్రాలతో మీరు గొడవ పడ్డారా అని ప్రశ్నించారు.మోదీ,కేసీఆర్‌కు భయపడి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు.

చంద్రబాబు వలనే ప్రత్యేకహోదా  రాలేదన్నారు. ఏపీలో కేసీఆర్‌ పెత్తనం అని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని,ఏపీలో టీఆర్‌ఎస్‌ పోటీ చేస్తుందా అని ప్రశ్నించారు.మీ బినామీలను టీఆర్‌ఎస్,కాంగ్రెస్‌ పార్టీలోకి పంపించావు..మహ కూటమి అనిపెట్టి నానాయాగీ చేసి చతికిలపడ్డావన్నారు.తెలంగాణ ఎన్నికల్లో పొత్తు కోసం ఆరాటపడింది కేసీఆర్‌తో కాదా అని ప్రశ్నించారు.ఏపీలో టీఆర్‌ఎస్‌ పోటీ చేసే పరిస్థితి లేదని, చంద్రబాబే తెలంగాణలో వచ్చి పోటి చేశారన్నారు.వైయస్‌ఆర్‌సీపీకి ఏపీ ప్రయోజనాలే ముఖ్యమన్నారు.వైయస్‌ఆర్‌సీపీ మోదీ ప్రభుత్వంపై అవిశ్వాసం తీర్మానం పెట్టిన,కేసీఆర్‌ను ప్రశ్నించిన,చంద్రబాబును తూర్పారపడుతున్నా.. ఏపీ ప్రయోజనాలు కోసమే అని అన్నారు. ఐదేళ్లగా ఆంధ్రరాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే ముఖ్యమంత్రిగా మాట్లాడకుండా..నేడు పౌరుషం,రోషం అంటూ మాట్లాడుతున్నారన్నారు. 

ఏపీ కోసం రాజీలేని పోరాటం చేసింది వెయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అని అన్నారు. రాష్ట్రం విడిపోవాలని లెటర్‌ ఇచ్చింది చంద్రబాబు అన్నారు.రాష్ట్రం కలిసి ఉండాలని చివరి దాకా పోరాడింది వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని, ప్రత్యేకహోదా ఈ రాష్ట్రానికి కావాల్సిందే అని, ఐదేళ్ల పాటు పోరాడిన వ్యక్తి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని అన్నారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత  ఏపీ ప్రత్యేకహోదాకు మద్దతు ఇవ్వాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సాయాన్ని వైయస్‌ జగన్‌  తీసుకుంటారన్నారు.పవన్‌ కల్యాణ్‌ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని గతంలో కేసీఆర్‌ను పవన్‌కల్యాణ్‌ కీర్తించి మాట్లాడలేదా అని ప్రశ్నించారు.ఏపీ ప్రయోజనాలు కోసం ఇతర రాష్ట్రాలతో పోరాడే దమ్ము బాబుకు లేదని, చంద్రబాబు పిరికిపందలా వ్యవహరిస్తున్నారు.

Back to Top