నాపై పచ్ఛమీడియా దుష్ఫ్రచారం

టీడీపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోంది 

నా ఆత్మసై్థర్యంపై దెబ్బకొట్టాలని చూస్తున్నారు

కార్పొరేట్‌ మాఫియాకు అధిపతి  నారాయణ 

టీడీపీ చిల్లర రాజకీయాలు సహించను

వైయస్‌ఆర్‌సీసీ నెల్లూరు సిటీ అభ్యర్థి అనిల్‌కుమార్‌ యాదవ్‌

నెల్లూరు: పచ్చమీడియా నాపై దుష్ఫ్రచారం చేస్తుందని వైయస్‌ఆర్‌సీపీ నెల్లూరు సిటీ అభ్యర్థి అనిల్‌కుమార్‌ యాదవ్‌ మండిపడ్డారు.నెల్లూరులో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నా ఆత్మసై్థరాన్ని దెబ్బతీయడానికి టీడీపీ నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. నా  మాటల్ని పచ్చమీడియా వక్రీకరించిందని, జనవరిలో  కార్యకర్తల సమావేశంలో మాట్లాడితే ఎడిట్‌ చేసి దుష్ఫ్రచారం చేస్తున్నారన్నారు. టీడీపీ  డబ్బుతో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారన్నారు.సైనికుడిలా పనిచేయాలని కార్యకర్తలను  ఉద్దేశించి మాట్లాడితే  ఆ వ్యాఖ్యలను ఎడిట్‌ చేసి  దుష్ఫప్రచారం చేస్తున్నారన్నారు.

ఎన్నికలు ముందు విష ప్రచారం చేస్తున్నారు.ఈ ఐదేళ్లలో ఎమ్మెల్యేగా నాపై అవినీతిగాని,ఎవరినైనా బెదిరింపులకు పాల్పడ్డానని నిరూపించాలన్నారు. నారాయణ వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నారని,నారాయణ కాలేజిలో 80 మంది విద్యార్థులు చనిపోయారు. ఎప్పడైనా వారి ఇంటికెళ్ళి తల్లిదండ్రులను పరామర్శించారా అని ప్రశ్నించారు. టీడీపీ నేతలు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు,నాపై విష ప్రచారం చేస్తున్న పచ్చమీడియాపై ఎస్పీకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు.

రాజకీయంగా ఎదుర్కొవాలంటే ఫేస్‌టూఫేస్‌ రాజకీయాలు చేయాలన్నారు.కార్పొరేట్‌ మాఫియాకు అధిపతి నారాయణే అని అన్నారు. నారాయణ ఎలా ఎదిగారో అందరికి తెలుసునన్నారు.నేనేంటో నెల్లూరు ప్రజలకు తెలుసునని, నిజాయితీ ఎదిగానన్నారు. నా ఆత్మసై్థర్యం మీద దెబ్బకొట్టాలని ప్రయత్నించవద్దన్నారు.ఎలా పడితే అలా మాట్లాడితే సహించనన్నారు. ఎటువంటì తప్పులు చేయలేదని,నా కుటుంబంతో సహా ప్రమాణం చేయడానికి సిద్ధమన్నారు.టీడీపీ చీఫ్‌ రాజకీయాలు ప్రజలు గమనిస్తున్నారన్నారు.

Back to Top