బడ్జెట్‌ అంతా గాల్లో లెక్కలే  

వైయస్‌ఆర్‌సీపీ ఆర్థిక సలహాదారు దువ్వూరి కృష్ణ

వైయస్‌ జగన్‌ నవరత్నాలను కాపీ కొట్టారు

బడ్జెట్‌లో డ్వాక్రా రుణమాఫి ప్రస్తావనే లేదు

రూ.1700 కోట్లు మాత్రమే పసుపు–కుంకుమ పథకానికి కేటాయించారు

పసుపు–కుంకుమలో పది వేలు ఉచితం కాదు..రుణమే

బడ్జెట్‌ అమలుకు ఎలాంటి వనరులు లేవు

ప్రజలపై రూ.2.60 లక్షల కోట్ల అప్పులభారం ఉంది

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అంతా కూడా గాల్లో లెక్కలు తప్ప మరొకటి కాదని వైయస్‌ఆర్‌సీపీ పీఏసీ దువ్వూరి కృష్ణ విమర్శించారు. ప్రజలపై రూ.2.60 లక్షల కోట్ల అప్పుల భారం ఉందని, ఇంకెంత అప్పులు చేస్తారని ధ్వజమెత్తారు. ప్రజలను అప్పుల ఊబిలో నెట్టుతున్నారని ఆయన మండిపడ్డారు. వైయస్‌ జగన్‌ పథకాలను బడ్జెట్‌లో కాపీ కొట్టారని పేర్కొన్నారు. ఇవాల ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అమలుకు ఎలాంటి వనరులు లేవన్నారు. ప్రభుత్వ ఆదాయం పెరగడానికి పన్నులు పెంచుతారా అని ఆయన ప్రశ్నించారు. బడ్జెట్‌ లెక్కలపై మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో కృష్ణ మీడియాతో మాట్లాడారు.  ఏపీ ప్రభుత్వం దుబారా ఎక్కువైందని ఫైర్‌ అయ్యారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇవాళ బడ్జెట్‌ ప్రవేశపెట్టారే తప్ప..టీడీపీ మేనిఫెస్టోకు అనుగుణంగా బడ్జెట్‌ కేటాయింపులు లేవని విమర్శించారు.

గత ఎన్నికల సమయంలో  ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేర్చారు..ఎంతవరకు నెరవేర్చుతారన్నది చెప్పలేదన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పంట రుణాల గురించి చెప్పారన్నారు. బడ్జెట్‌లో ఎక్కడా కూడా ప్రస్తావన లేదన్నారు. ఇవాళ వ్యవసాయ రంగానికి సంబంధించిన బడ్జెట్‌లో 15 వేల కోట్లు కేటాయించారని, అందులో అన్నదాత సుఖీభవ పథకానికి రూ.5 వేల కోట్లు కేటాయించారన్నారు. రూ.8500 కోట్లు ఇంకా రుణ మాఫికి చెల్లించాల్సి ఉందన్నారు. డ్వాక్రా రుణాలు మాఫి చేస్తామన్నారని, వాటి గురించి బడ్జెట్‌లో ఎక్కడా ప్రస్తావన లేదన్నారు. ముఖ్యమంత్రి యువనేస్తం ప£ý కం కింద నిరుద్యోగ భృతి ఒక్కో కుటుంబానికి రూ.1.20 లక్షలు ఇవ్వాల్సి ఉందన్నారు. నిరుద్యోగ భృతి కింద రెండు నెలల నుంచి కేవలం రూ.1000 మాత్రమే కొంతమందికి మాత్రమే ఇస్తున్నారని మండిపడ్డారు.

ఇటీవల ఇస్తున్న పసుపు–కుంకుమ హామీ పరిశీలిస్తే..98 లక్షల మంది స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున పోస్టు డేటేడ్‌ చెక్కులు ఇచ్చారన్నారు. ఇందు కోసం దాదాపుగా రూ.9300 కోట్ల బడ్జెట్‌ ప్రవేశపెట్టి ఉండాలన్నారు. ఇవాళ పెట్టిన బడ్జెట్‌లో కేవలం రూ.1700 కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. వచ్చే ఏడాది రూ.4 వేల కోట్లు పెట్టారన్నారు. మొదటి చెక్కు ఫిబ్రవరిలో, రెండో చెక్కు మార్చిలో ఇవ్వాల్సి ఉందన్నారు. రెండు చెక్కులకు కనీసం రూ.6 వేల కోట్లు అవసరమవుతాయన్నారు. వీళ్లు మాత్రం రూ.1700 కోట్లు మాత్రమే పెట్టారన్నారు.

ఉచితంగా మహిళలకు ఇచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా అని ఆయన నిలదీశారు. ఈ రూ.10 వేలు ఉచితం కాదని, రుణమే అన్నారు. బడ్జెట్‌లో రూ.2500 కోట్లు రెవెన్యూ లోటుగా చూపించారని, రూ.70 వేల కోట్లను రెవెన్యూ ఆదాయంగా చూపారని తెలిపారు. ప్రభుత్వ ఆదాయం పెరగడానికి పన్నులు పెంచుతారా అని ప్రశ్నించారు. ఈ నాలుగున్నరేళ్లలో టీడీపీ ప్రభుత్వం దుబారా ఎక్కువ చేసిందని విమర్శించారు. ఇంకా ఎంతమేరకు ప్రజలపై అప్పుల భారం మోపుతారని ఆయన నిలదీశారు. దాదాపుగా ప్రజలపై రూ.2.60 లక్షల కోట్లకు పైగా అప్పుల భారం ప్రజలపై ఉందన్నారు. ప్రజలపై ఇంకెంత అప్పుల భారం మోపుతారని దువ్వూరి కృష్ణ ప్రశ్నించారు.
 

Back to Top