22న ర‌హ‌దారుల‌ దిగ్బందానికి వైయ‌స్ఆర్‌సీపీ మ‌ద్ద‌తు

ప్రత్యేక హోదా సాధనలో భాగంగా జరిగే ఏ పోరాటానికైనా, ఏ ఆందోళనకైనా మద్దతు ఇస్తామన్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విధానంలో భాగంగా ఈ నెల 22న రాష్ట్రంలోని అన్ని జాతీయ రహదారులను దిగ్బంధించాల్సింగా ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి ఇచ్చిన పిలుపునకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తన సంపూర్ణ మద్దతు తెలిపారు. ర‌హదారుల‌ దిగ్బంధం, ఆందోళన కార్య‌క్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా పార్టీ నాయకులకు, శ్రేణులకు వైయ‌స్ జగన్‌ పిలుపునిచ్చారు.  Back to Top