బీసీ సెల్‌ రీజనల్‌ కో–ఆర్డినేటర్ల నియామకం

హైదరాబాద్‌:  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ బీసీ సెల్‌ కో–ఆర్డినేటర్లను నియమించారు. బీసీ విభాగం రాయలసీమ రీజినల్‌ కో–ఆర్డినేటర్‌గా తొండమల్ల పుల్లయ్య, కోస్తా– ఆంధ్ర రీజినల్‌ కో–ఆర్డినేటర్‌గా అంగిరేకుల ఆదిశేషు, ఉత్తరాంధ్ర రీజినల్‌ కో–ఆర్డినేటర్‌గా పక్కి వెంకట సత్య దివాకర్‌లను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పత్రికా ప్రకటన విడుదల చేశారు.
 

Back to Top