టీవీ–5ను బ్యాన్‌ చేసిన వైయస్‌ఆర్‌ సీపీ

పార్టీ కార్యక్రమాలు కవరేజీ చేయాల్సిన అవసరం లేదని స్పష్టీకరణ

పత్రికా ప్రకటన విడుదల చేసిన కేంద్ర కార్యాలయం

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీని నెత్తిన ఎత్తుకొని మోస్తున్న టీవీ–5 ఛానల్‌ చర్చలకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఎవరూ పాల్గొనకూడదని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ చేస్తూ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్రకటనలో.. ‘తెలుగుదేశం పార్టీని భుజాన మోసే స్థితి నుంచి నెత్తికెక్కించుకుకుని వార్తా ప్రసారాలు, టీవీ చర్చలు చేస్తున్న టీవీ–5 ఛానల్‌ చర్చలకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరుఫున ఏ ఒక్కరూ పాల్గొనకూడదని పార్టీ నాయకులందరినీ ఆదేశించడమైనది. మా పార్టీ వారిని చర్చలకు ఆహ్వానించవద్దని టీవీ–5కు కూడా స్పష్టం చేస్తున్నాం. అలాగే, మొత్తంగా పార్టీ ప్రెస్‌మీట్లు, కార్యక్రమాల కవరేజీలో టీవీ–5ను నిషేదించడమైనది. స్వతంత్ర జర్నలిజం ముసుగులో ఎల్లో మీడియాగా మారిన వారిని బట్టబయలు చేసేందుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇటువంటి నిర్ణయం తీసుకోవాల్సి వస్తోంది’. ఏబీఎన్‌ను నిషేధిస్తూ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇంతకు ముందే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 

 

Back to Top